India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD సోమాజిగూడలోని రాజ్‌భవన్ దర్బార్ హాల్‌లో వినాయక చవితి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. గణేశుడికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రత్యేక పూజలు చేశారు. ఈ గణేశ్ విగ్రహాన్ని హైదరాబాద్‌లోని అగ్రికల్చరల్ యూనివర్సిటీ విద్యార్థులు సాదా బంకమట్టితో పర్యావరణ అనుకూలంగా తయారు చేశారు. విషరహిత కూరగాయల రంగులతో పెయింట్ వేశారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను HYD బేగంపేట్‌లోని ప్రజాభవన్‌లో టీపీసీసీ నూతన అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మార్యదపూర్వకంగా కలిశారు. ఆయనతోపాటు వ్యవసాయ కమిషన్ నూతన ఛైర్మన్ కోదండ రెడ్డి డిప్యూటీ సీఎంను కలిసి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, కార్పొరేషన్ ఛైర్మన్లు అనిల్ కుమార్, శివసేన రెడ్డి, అన్వేశ్ రెడ్డి ఉన్నారు.
వినాయక చవితి పర్వదినోత్సవం సందర్భంగా HYD గాంధీ భవన్‌లో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు కుమార్ రావ్, ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్, కార్పొరేషన్ ఛైర్మన్ బెల్లయ్య నాయక్, మహేశ్, శ్రీనివాస్ రెడ్డి, నాయకుడు అల్లం భాస్కర్ పాల్గొన్నారు.
హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని శ్రీ కృష్ణ ఉడిపి పార్క్ హోటల్‌లో డ్రైనేజీ నీటితో ప్లేట్లు , గిన్నెలు , టీ గ్లాసులు కడుగుతున్నారని వచ్చిన ఫిర్యాదులతో ఫుడ్ సేఫ్టీ బృందం రంగంలోకి దిగింది. తనిఖీలు చేపట్టిన అసిస్టెంట్ ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంటనే నోటీసులు జారీ చేశారు. మురుగు నీటితో ఇలాంటి పనులు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
హెచ్ఎండీఏ పరిధిలోని కీలక ప్రాంతాలన్నీ ఇక నుంచి మహా బల్దియా పరిధిలోకి రానున్నాయి. దాదాపు 51 గ్రామాలు జీహెచ్ఎంసీలో కలవనున్నాయి. ప్రస్తుతం హెచ్ఎండీఏ విస్తరిత ప్రాంతం విస్తీర్ణం 7,200 చదరపు కిలోమీటర్లు. దాదాపు 841 గ్రామాలు హెచ్ఎండీఏ కింద ఉన్నాయి. ఆయా ప్రాంతాలన్నీ ఇక నుంచి బల్దియా కిందకు రానున్నాయి. దీంతో హెచ్ఎండీఏ విస్తీర్ణం 5,872 చదరపు కిలోమీటర్లకు పరిమితం కానుంది. SHARE IT
రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన వైఫల్యాన్ని అంగీకరించడానికి ఇంకెంత మంది రైతులు చావాలని..? BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మేడ్చల్‌లో దుబ్బాక రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్య గుండెను కలిచివేసిందని, ఇలాంటి బాధలు రావొద్దనే ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేశామన్నారు. రైతు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన KTR, రైతు వేదన వివరించలేనిదని పేర్కొన్నారు.
బేగంపేట్ ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణికి 570 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ప్రజావాణి నోడల్ అధికారి దివ్య, ఇతర అధికారులు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఎస్సీ వెల్ఫేర్ 77, రెవెన్యూ 57, పంచాయతీ రాజ్ 47, విద్యుత్ శాఖ 28, ఇతర శాఖలకు 93 దరఖాస్తులు వచ్చాయి. కాగా ఈనెల 10న జరగాల్సిన ప్రజావాణిని 11న నిర్వహిస్తున్నట్లు నోడల్ అధికారి తెలిపారు.
విద్యుత్ శాఖలో అధికారులు ఎవరైనా లంచం అడిగితే తమ కార్యాలయానికి ఫిర్యాదు చేయవచ్చని డిస్కం సీఎండీ ముషారఫ్ ఫరూఖీ సూచించారు. అవినీతి ఫిర్యాదులు స్వీకరించేందుకు సీఎండీ కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. విద్యుత్ సంస్థలో సిబ్బంది, అధికారులు ఏదైనా పనికి లంచం అడిగితే 040-234548845, 7680901912 నంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. SHARE IT
భారీ ఆక్రమణలతో కునారిల్లిన రాజధానిలోని నాలా వ్యవస్థను గాడిలో పెట్టాలని కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో హైడ్రా కార్యాచరణ రూపొందించింది. రెండు దశల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని హైడ్రా శుక్రవారం నిర్ణయించింది. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో వంద మంది అధికారులు, సిబ్బంది పరిశీలన మొదలు పెట్టారు. నాలాలపై వరదకు అడ్డుపడుతున్న భవనాలను గుర్తించనున్నారు. అనంతరం 2 దశల్లో వాటిని కూల్చివేయనున్నారు.
వినాయక చవితి పండుగ సందర్భంగా జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, కమిషనర్ ఆమ్రపాలి నగర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సకల విజ్ఞానలు తొలగించే వినాయకుడి అనుగ్రహం నగర ప్రజలందరికీ కలగాలని, అందరి ఇంట సుఖశాంతులు వెళ్లివిరియాలని ఆకాంక్షించారు. ఎలాంటి విఘ్నాలు లేకుండా నగరం మరింత అభివృద్ధి చెందాలని వారు అభిలాషించారు.
Sorry, no posts matched your criteria.