Hyderabad

News August 19, 2025

చర్లపల్లి: నాయుడుపేట వెళ్లే ప్రజలకు గుడ్‌న్యూస్

image

సిటీ నుంచి నాయుడుపేట వెళ్లే ప్రయాణికులకు రైల్వే అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. రెగ్యులర్‌గా చర్లపల్లి నుంచి చెన్నయ్ వెళ్లే రైలు నాయుడుపేట మీదుగా వెళ్తుంది. అయితే అక్కడ స్టాపేజ్ లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడేవారు. ప్రయాణికుల కోరిక మేరకు నాయుడుపేటలో స్టాప్ ఏర్పాటు చేశారు. దీంతో చర్లపల్లి- చెన్నై ఎక్స్‌ప్రెస్ ట్రైన్ (12604) ఇక నుంచి 2 నిమిషాల పాటు నాయుడుపేటలో ఆగుతుంది.

News August 19, 2025

HYD: జాగ్రత్త.. వీడియో కాల్ న్యూడ్ కాల్‌గా మారుస్తున్నారు

image

సైబర్ నేరగాళ్లు కొత్త పంథా ఎంచుకుంటున్నారు. డేటింగ్ యాప్‌లో పరిచయం చేసుకొని వీడియో కాల్స్ మాట్లాడించి ఆ తర్వాత దానిని మార్ఫింగ్ చేసి నగ్న వీడియోగా మార్చి బెదిరిస్తున్నారు. గుడిమల్కాపూర్‌కు చెందిన యువకుడి నుంచి రూ.1.80 లక్షలు వసూలు చేశారు. తిరిగి లక్షల్లో డిమాండ్ చేయడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వారితో అసలు వీడియో కాల్‌లో మాట్లాడవద్దని సైబర్ పోలీసులు చెబుతున్నారు.

News August 19, 2025

గతంలో 3 నెలలు ఊచలు లెక్కించిన ‘సృష్టి’ నమ్రత

image

అక్రమ సరోగసి కేసులో అరెస్ట్ అయిన డా.నమ్రత గతంలో 3 నెలలు జైలులో ఉండి వచ్చారు. 2020లో ఏపీలోని మాడుగులకు చెందిన ఓ మహిళ నమ్రతపై ఫిర్యాదు చేయడంతో జైలుకు వెళ్లింది. తనకు మాయమాటలు చెప్పి తన బిడ్డను తీసుకున్నారని ఫిర్యాదు చేయడంతో ఏపీ పోలీసులు విశాఖ జైలుకు తరలించారు. జైలు నుంచి తిరిగి వచ్చినా నమ్రత దందా కొనసాగించి ఇటీవల మళ్లీ అరెస్ట్ అయింది.

News August 19, 2025

HYD: నిమజ్జనోత్సవానికి ఖర్చు రూ.30 కోట్లు

image

నిమజ్జనోత్సవం.. HYDలో ఈ వేడుక ఉంటే సందడేవేరు. ఇందుకు GHMC దాదాపు రూ.30 కోట్లు ఖర్చు చేయనుంది. అలాగే సెప్టెంబరు 6న జరిగే శోభాయాత్ర, నిమజ్జనాలకు బల్దియా అధికారులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రోడ్ల మరమ్మతులు, విద్యుత్ తీగలకు సమస్యలు రాకుండా చర్యలు, అడ్డుగా ఉన్న చెట్టు కొమ్మలను తొలగింపు పనులు చురుగ్గా సాగుతున్నాయి. వినాయకచ చవితి (27న) మూడో రోజు నుంచే (29న) HYDలో నిమజ్జనాలు ప్రారంభమవుతాయి.

News August 19, 2025

యూట్యూబ్‌లో ఇంకా ‘సృష్టి’ వీడియోలు!

image

సృష్టి ఫెర్టిలిటి సెంటర్ నిర్వాహకురాలిగా డా.నమ్రత యూ ట్యూబ్‌లో వీడియోలను అప్లోడ్ చేసింది. ఆ వీడియోలు ఇంకా అందులోనే ఉన్నాయి. సరోగసి పేరుతో నవజాత శిశువులను విక్రయించి రిమాండులో ఉన్న నమ్రత ప్రసంగాలు ఇంకా అందుబాటులో ఉండటంతో పలువురు మండిపడుతున్నారు. ఇంత మోసం చేసిన ఆమె వీడియోలు యూట్యూబ్‌లో తొలగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఆ దిశగా పోలీసులూ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరీ మీరేమంటారు.

News August 19, 2025

IPSC డాన్స్ ఫెస్ట్-2025లో మెరిసిన యషితా బాంటియా

image

జోధ్‌పూర్‌లోని రాజమాత కృష్ణ కుమారి బాలికల పబ్లిక్ స్కూల్ నిర్వహించిన ఇపస్సీ డ్యాన్స్ ఫెస్ట్-2025 నిర్వహించారు. బేగంపేటలోని HYD పబ్లిక్ స్కూల్‌కు చెందిన యషితా బాంటియా సత్తాచాటింది. కష్టపడి పనిచేయడానికి ప్రత్యామ్నాయం లేదని ఆమె అన్నారు. తాను పడ్డ కష్టానికి ఫలితం దక్కిందన్నారు. బాంటియా ఫర్నిచర్ యజమాని సురేందర్ బాంటియా మనవరాలే ఈ యషితా.

News August 19, 2025

ఫొటోలు HYDను కొత్తగా పరిచయం చేశాయి!

image

నగరంలోని ఎన్నో అద్భుత కట్టడాల సొగసును ఫొటోలు మన ముందుకు తీసుకొచ్చాయి. ఫొటోలు HYDను కొత్తగా పరిచయం చేశాయంటే అతిశయోక్తి కాదేమో! సాధరణ వ్యక్తులు చూడలేని కోణాల్లో ఫొటోలు తీసి పలువురు ఫొటోగ్రాఫర్లు ఓరా అనిపించారు. HYDకు కొత్త అందం తెచ్చిన రాజమందిరంలాంటి సెక్రటేరియట్ దాని పరిసరాలను ఆకట్టుకునేలా తీసిన ఈ చిత్రం చూపరుల మనసు దోచేసింది. నేడు అంతర్జాతీయ ఫొటోగ్రఫీ దినోత్సవం.
Photo Credits: షేక్ మహ్మద్ సలీం

News August 19, 2025

విద్యార్థులకు నిరంతర అభ్యాసం అవసరం: డా.రత్తయ్య

image

విద్యార్థులకు నిరంతర అభ్యాసం అవసరమని, అప్పుడే ఉన్నత శిఖరాలకు చేరగలరని విజ్ఞాన్స్ విద్యాసంస్థల ఛైర్మన్ డా.లావు రత్తయ్య తెలిపారు. విద్యార్థుల్లో చదువు, అభివృద్ధి అనేది సంతోషంగా జరగాల్సిన ప్రక్రియని చెప్పారు. సోమవారం బీటెక్ 1st ఇయర్ విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దేశ్‌ముఖిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. విద్యార్థులందికీ అభినందనలు తెలిపారు.

News August 19, 2025

కూకట్‌పల్లి: బాలిక మృతదేహంపై 9 కత్తిపోట్లు

image

కూకట్‌పల్లి సంగీత్‌నగర్‌లో జరిగిన <<17442408>>బాలిక హత్య<<>> కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. పోస్టుమార్టం రిపోర్ట్ ప్రకారం.. శరీరం మీద 9 కత్తిపోట్లు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. హత్య జరిగిన ఇంట్లోని కత్తుల్లో ఒకటి కనిపించకుండా పోయింది. ఈ హత్య దాదాపు 10 నుంచి 11 గంటల మధ్య జరిగి ఉంటుందని వారు తెలిపారు.

News August 19, 2025

HYD- తిరుపతి విమానంలో సాంకేతిక లోపం

image

శంషాబాద్ ఎయిర్ పోర్టులో HYD- తిరుపతి అలియాన్స్ ఎయిర్‌లైన్స్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. 67 మంది ప్రయాణికులు బోర్డింగ్ అయిన తర్వాత సాంకేతిక లోపాన్నీ పైలెట్ గుర్తించారు. తిరిగి ప్రయాణికులను దింపేసి సాంకేతిక లోపాన్ని నిపుణులు పరిశీలిస్తున్నారు. కాగా.. తిరుపతి వెళ్లాల్సిన 67 మంది ప్రయాణికులు హోల్డింగ్‌లొనే ఉన్నారు.