India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణ నుంచి కేన్స్ టెక్నాలజీ సంస్థకు చెందిన అత్యంత అధునాతనమైన ‘ఓశాట్ ‘ యూనిట్ గుజరాత్‌కు తరలిపోతోందన్నది వాస్తవమని BRS కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. దీనిపై ఐటీ మంత్రి తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఈ అంశంపై ‘X’లో బుధవారం కేటీఆర్ స్పందించారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థ, గందరగోళ నిర్ణయాల కారణంగా.. 2 పెద్ద ప్రాజెక్టులను రాష్ట్రం కోల్పోవడం బాధాకరమని అన్నారు.
రాష్ట్రంలోని ఎస్సీ గురుకుల జూనియర్, డిగ్రీ కళాశాలల్లో మిగిలిన సీట్లకు ఈనెల 5, 6 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు గురుకుల సొసైటీ కార్యదర్శి అలగు వర్షిణి తెలిపారు. హైదరాబాద్ లో బుధవారం మాట్లాడారు. జూనియర్ కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ కోర్సుల్లో 3,168 సీట్లు ఖాళీగా ఉంటే.. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలకు 221 అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు.
హైడ్రా నగరంలోని అక్రమ ప్రకటనలపై దృష్టి సారించింది. నగరంలో వేలాదిగా ఉన్న అనుమతిలేని ప్రకటన బోర్డులను తొలగించేందుకు సిద్ధమైంది. బుధవారం హిమాయత్‌నగర్ హైవే డివైడర్‌పై ఏర్పాటు చేసిన ప్రకటన బోర్డులను సిబ్బంది తొలగించారు. ఆయా ప్రకటనలకు అనుమతి లేదని, జీహెచ్ఎంసీ ఆదాయానికి గండి కొడుతూ ప్రకటన సంస్థలు ఏర్పాటు చేసిన బోర్డులన్నింటినీ తీసేస్తున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లి పరిధి హస్మత్‌పేటలోని 13.17 ఎకరాలకు సంబంధించి NVN కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై తక్షణ చర్యలు తీసుకోకుండా… హైడ్రా, ఇతర అధికారులపై తెలంగాణ హైకోర్టు నిషేధాజ్ఞలు జారీ చేసింది. పూర్తి విచారణ చేపట్టిన అనంతరం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించింది.
గురుకుల విద్యపై ప్రస్తుత ప్రభుత్వం కుట్ర చేస్తోందని భారాస నేత RS. ప్రవీణ్ కుమార్ వాపోయారు. తెలంగాణ భవన్‌లో బుధవారం మాట్లాడారు. ‘గురుకులాల్లోని 2,000 మంది టీచర్లను తొలగించడంతో విద్యార్థుల భవిత అగమ్యగోచరంగా మారింది. ఈ కుట్ర నుంచి గురుకులాలను కాపాడుకోవాలి. కేసీఆర్ హయాంలో నాణ్యమైన గురుకుల విద్య అందించారు. ప్రభుత్వం కుట్రకు ఎస్సీలే సమిధలవుతున్నారు’ అని సీఎం ఫైర్ అయ్యారు.
నగరంలోని ధూల్‌పేట నుంచి వినాయక విగ్రహాల తరలింపు దృష్ట్యా నేటి నుంచి 7వ తేదీ రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు బుధవారం తెలిపారు. గణేశ్ విగ్రహాలు తీసుకెళ్లే వాహనాలు ఎంజే మార్కెట్ బ్రిడ్జి నుంచి గాంధీ విగ్రహం వైపు (ధూల్పేట) వరకు మాత్రమే అనుమతిస్తారు. ఎంజే బ్రిడ్జి నుంచి పురానాపూల్ వరకు ఇతర వాహనాలు అనుమతించరు.
గచ్చిబౌలి పరిధిలో వివిధ రాష్ట్రాలకు చెందిన నిపుణుల సమక్షంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ అంశాలపై గ్లోబల్ సబ్ సమ్మిట్ జరిగింది. AI సిస్టమ్స్ ప్రాముఖ్యతపై నిపుణుల బృందం విస్తృతంగా చర్చించినట్లు తెలంగాణ స్టేట్ ఎమర్జింగ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీని యువత అందిపుచ్చుకోవాల్సిన అవసరం వచ్చిందన్నారు.
గణపతి విగ్రహాలకు కేరాఫ్ అడ్రస్ ధూల్‌పేట. వినాయకచవితి సమీపించడంతో HYD, ఇతర జిల్లాల నుంచి విగ్రహాల కొనుగోలుకు ఇక్కడికి వస్తుంటారు. అయితే, గతంతో పోల్చితే ఈసారి విక్రయాలు ఎక్కువగా ఉంటాయని భారీగా గణనాథులను వ్యాపారులు సిద్ధం చేశారు. అనుకున్న స్థాయిలో విక్రయాలు జరగలేదు. ధరలు తగ్గించి అమ్మకాలు సాగిస్తున్నట్లు టాక్. 2023లో రూ.60 వేలు పలికిన విగ్రహం ఈసారి రూ. 40 వేలకు అమ్ముతున్నట్లు ఓ వ్యాపారి తెలిపారు.
బంజారాహిల్స్‌లోని రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. నీలోఫర్ కేఫ్ కిచెన్ అపరిశుభ్రంగా ఉండటాన్ని గుర్తించారు. రిఫ్రిజిరేటర్‌లో భద్రపరిచిన షుగర్ సిరప్, మసాలా దినుసులు వంటి లేబుల్ లేని వస్తువులు చూసి అసహనం వ్యక్తం చేశారు. అమ్మకానికి ఉంచిన కేక్‌లను కూడా లేబుల్ చేయలేదు. దీంతో పాటు వంటగదిలో ఎక్స్పైరీ అయిన అరకిలో చీజ్, మిరప పొడి, 5 కిలోల కాల్చిన వేరుశెనగలు ఉన్నాయి.
హైడ్రా పేరుతో బెదిరింపులు, వసూళ్లకు పాల్పడితే జైలుకు పంపిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. కొంతమంది బిల్డర్లను బెదిరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. హైడ్రాలో ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నట్లు బెదిరిస్తున్నారని చెప్పారు. తమ విభాగాన్ని నీరు గార్చే ప్రయత్నాలు, తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా ఇలా బెదిరిస్తే పీఎస్‌లో ఫిర్యాదు చేయాలన్నారు.
Sorry, no posts matched your criteria.