Hyderabad

News March 26, 2026

HYD: గ్యాస్ బండ కావాలా? నయా దందా గుట్టు రట్టు!

image

HYDలో గ్యాస్ సిలిండర్ల అక్రమ రీఫిల్లింగ్, బ్లాక్ మార్కెట్ దందాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. నార్సింగి, గాంధంగూడ, పోతురాజు నగర్ ప్రాంతాల్లో నివాస గృహాల్లోనే గృహ వినియోగ సిలిండర్ల నుంచి కమర్షియల్ సిలిండర్లలోకి గ్యాస్‌ను మారుస్తున్న ముఠాను పట్టుకున్నారు. నిందితుల నుంచి భారీగా సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. నగరవ్యాప్తంగా ఇప్పటివరకు ఇలాంటివి 1,112 కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు.

HYD: 90% సబ్సిడీ లోన్స్.. ఫామ్ ఫిల్ చేయండి!

image

ఎస్సీ కార్యచరణ ప్రణాళిక 2025- 26 గానూ రవాణా రంగం కింద 2, 3 వీలర్స్ ఈవీలతో పాటు రైతులకు సబ్సిడీ రుణాలు అందించనున్నట్లు కార్పొరేషన్ ఈడీ పద్మావతి తెలిపారు. ఏప్రిల్ 2 వరకు ఎస్సీ నిరుద్యోగులు దరఖాస్తులు చేసుకోవాలని, రేషన్ కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, లైసెన్స్ ఉండాలన్నారు. 2 వీలర్‌కు 90%, 3వీలర్‌కు 70% సబ్సిడీ ఇస్తున్నట్లు స్పష్టంచేశారు. <>https://tsobmms.cgg.gov.in<<>> లోకి వెళ్లి ఫామ్ ఫిల్ చేయండి.

News March 26, 2026

HYD: పెట్రోల్ అక్రమాలా? కాల్ చేయండి

image

HYDలోని పెట్రోల్ బంక్‌లను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది. ప్రభుత్వం అధికారులను నియమించింది. సరఫరా & స్టాక్ కఠినంగా నియంత్రించనున్నారు. ఆకస్మిక తనిఖీలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. పెట్రోల్‌కు సంబంధించిన అక్రమాలు ఉంటే వెంటనే ఫోన్ నం.74166 87878, టెలిఫోన్ నం. 040-23202113లో సంప్రదించాలని సూచించారు.
# SHARE IT

News March 26, 2026

HYD: ‘కామారెడ్డి బీసీ డిక్లరేషన్’పై BRS వాయిదా తీర్మానం

image

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 7వ రోజుకు చేరుకున్నాయి. నేడు సమావేశాల్లో వెనుకబడిన తరగతుల సంక్షేమానికి ప్రతీ వార్షిక బడ్జెట్‌లో రూ.20 వేల కోట్లు ఖర్చు పెడతామని, బీసీ సబ్‌ప్లాన్ అమలు చేయడంతో పాటు ఎన్నికల సందర్భంగా కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు శాసనసభలో చర్చ జరగాలని బీఆర్ఎస్ శాసన సభా పక్షం వాయిదా తీర్మానం ప్రతిపాదించింది.

News March 26, 2026

HYD: సూసైడ్ నోట్ రాసి యువతి ఆత్మహత్య

image

కుత్బుల్లాపూర్‌లోని పేట్ బషీరాబాద్ PS పరిధిలో పల్లవి లహరి(19) అనే యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సందీప్‌తో ప్రేమలో ఉన్న ఆమె, మార్చి 24 జరిగిన గొడవ తర్వాత ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకుంది. సందీప్ తిరిగి వచ్చి చూడగా, అప్పటికే ఆమె మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో సందీప్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 26, 2026

జై శ్రీరామ్: రేపు దద్దరిల్లనున్న హైదరాబాద్

image

నగరం రేపు ‘కాషాయ’మయం కానుంది. శ్రీరామ నవమి వేళ సీతారాంబాగ్, ఆకాశ్‌పురి నుంచి హనుమాన్ టేక్డీ వరకు సాగే మహా శోభాయాత్రకు రంగం సిద్ధమైంది. ఓ వైపు వీధుల్లోని రామాలయాల్లో కళ్యాణోత్సవాలు, మరోవైపు రహదారుల మీద ‘రామ’ నినాదాల నడుమ సాగే ర్యాలీలు పండుగకు మరింత శోభను తేనున్నాయి. ఇక పోలీసులు భారీ బందోబస్తుతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భక్తుల కోలాహలం, ఆధ్యాత్మిక చైతన్యంతో ‘జై శ్రీరామ్’ స్లోగన్ మారుమోగనుంది.

Trending: HYDలో నోట్ల కోసం వెతుకులాట!

image

డిజిటల్ ఇండియా పుణ్యమా అని ఫోన్ పే, గూగుల్ పేలతో జేబులో రూపాయి లేకుండా తిరిగే మన హైదరాబాదీలకు కొత్త తిప్పలొచ్చాయి. బంకుల దగ్గర “ఓన్లీ క్యాష్” బోర్డులు చూసి అర్జెంటుగా ATMల దగ్గర క్యూ కడుతున్నారు. చిత్రమేంటంటే.. పెట్రోల్ కోసం కాకుండా, పాత పర్సులు దులిపి అందులో దాచుకొన్న వంద నోట్ల కోసం వెతుకులాట మొదలైంది. బండిలో చుక్క పెట్రోల్ పోయించుకోవాలంటే మాత్రం ఇప్పుడు ‘నోట్ల కట్ట’ తీయాల్సిందే.