India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి ఖైరతాబాద్ బడా గణేశ్‌ను శనివారం సందర్శించారు. భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. బందోబస్త్‌లో ఎటువంటి లోపాలు లేకుండా చూడాలని ఆమె అధికారులు, ఉత్సవ సమితికి సూచించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ అదనపు డీసీపీ ఆనంద్, సైఫాబాద్ డివిజన్ ఏసీపీ సంజయ్, ఖైరతాబాద్ ఇన్‌స్పెక్టర్ వెంకట్ రెడ్డి, డీఐ, ఎస్ఐలు పాల్గొన్నారు.
ఫ్యాన్సీ నంబర్ ప్రియులకు ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. ఫ్యాన్సీ నంబర్ల ప్రాథమిక ధరను దాదాపు మూడు రెట్లు పెంచింది. ఆ నంబర్ నచ్చిన వారు వేలంలో పాడుకొని దక్కించకోవచ్చు. ఇలా దాదాపు రూ.100 కోట్ల వరకు ఆదాయం వచ్చేలా రవాణాశాఖ అధికారులు ప్లాన్ చేశారు. ఫ్యాన్సీ నంబర్ల ధరలను పెంచుతూ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది.
నగరంలో రోజు రోజుకూ ట్రాఫిక్ పెరిగిపోతోంది. ముఖ్యంగా ప్రధాన ఐటీ సంస్థలు, ఆస్పత్రుల వద్ద ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటోంది. అందుకే ఆయా సంస్థల వద్ద ట్రాఫిక్ నియంత్రణకు ట్రాఫిక్ మార్షల్స్‌ను ఏర్పాటు చేయాలని సీపీ నిర్ణయించారు. అయితే, వారి జీతం మాత్రం ఆయా కంపెనీలే భరిస్తాయి. శిక్షణ మాత్రం పోలీసులు ఇచ్చి ట్రాఫిక్‌ను నియంత్రిస్తారు. 100 మంది మార్షల్స్ ను ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఉపయోగించుకుంటారు.
వినాయకచవితికి మరో 10 రోజులే గడువు ఉండడంతో HYDలోని వీధుల్లో సందడి మొదలైంది. గల్లీ గణేశుడికి గూడు కడుతున్నారు. నాటు కర్రలు, తడకలు, బొంగు కర్రల షాపులకు క్యూ కట్టారు. కర్రపూజ చేసి మండపం నిర్మిస్తున్నారు. విగ్రహాన్ని తీసుకొచ్చిన తర్వాత పందిరి వేస్తామని కొందరు ఆర్గనైజర్లు చెబుతున్నారు. మార్కెట్‌లో 18 ఫీట్ల కర్ర ఒక్కోటి రూ.180 నుంచి రూ.250 మధ్య అమ్ముతున్నారు. మీ ఏరియాలో ధరలు ఎలా ఉన్నాయి? కామెంట్ చేయండి.
సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో డిప్లమా ఇన్ మ్యాజిక్ (ఇంద్రజాలం) కోర్సులో చేరేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు Way2Newsతో తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణత అయినవారు అర్హులని, నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ కోర్సును ప్రతిరోజు సాయంత్రం వేళల్లో నాంపల్లి ప్రాంగణంలో నిర్వహిస్తామన్నారు. ఆసక్తి గలవారు 90597 94553 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు(39)పై వేధింపుల కేసు నమోదైంది. బల్కంపేట్‌కు చెందిన ఓ వివాహిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు ప్రముఖ కొరియోగ్రాఫర్ బంధువు అని పోలీసులు తెలిపారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
సృష్టి కేసులో నమ్రతతో పాటు ఆమె కొడుకు జయంత్ కృష్ణ బెయిల్ పిటిషన్‌ను సికింద్రాబాద్ కోర్టు కొట్టివేసింది. నమ్రత నుంచి చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఆమె ఆస్తులపై విచారణ జరపాల్సి ఉందని పోలీస్ తరఫు న్యాయవాది వాదించారు. నమ్రత కంపెనీలపై దర్యాప్తు జరపాల్సి ఉందని చెప్పారు. మరోవైపు తన కొడుకు పెళ్లి ఉందని కోర్టుకు నమ్రత తెలిపింది. ఇరువాదనల తర్వాత బెయిల్ పిటిషన్ కోర్టు కొట్టివేసింది.
ఐదేళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన ఘటన ఉప్పల్ PS పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. రామంతపూర్‌లో నివాసముండే ఓ వ్యక్తి టింబర్ డిపోలో పని చేస్తున్నాడు. ఈ నెల 12న కుమారుడు కనిపించడం లేదంటూ PSలో ఫిర్యాదు చేయగా సీసీ ఫుటేజీ ఆధారంగా అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. కమర్ అనే వ్యక్తి బాలుడికి మాయమాటలు చెప్పి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడి గొంతు నులిమి హత్య చేశాడు. కేసు నమోదైంది.
వచ్చే నెల 9 నుంచి డిగ్రీ వన్ టైం ఛాన్స్ పరీక్షలు ప్రారంభంకానున్నట్లు అధికారులు తెలిపారు. 2000 సంవత్సరం నుంచి 2015 వరకు ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలో వివిధ డిగ్రీ కోర్సుల్లో చదివి ఫెయిల్ అయిన విద్యార్థులు వన్ టైం ఛాన్స్ పరీక్షకు అర్హులన్నారు. ఓయూ క్యాంపస్ ఎగ్జామినేషన్ బ్రాంచ్‌లో వన్ టైం ఛాన్స్ పరీక్షకు ఫీజులు చెల్లించవచ్చని కంట్రోలర్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు.
ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఈడీ మయాంక్ మిట్టల్ పాల్గొని ఉద్యోగులతో మాదక ద్రవ్యాల నివారణపై ప్రతిజ్ఞ చేయించారు. మత్తుపదార్థాల వినియోగం తీవ్రమైన సామాజిక, మానసిక, శారీరక సమస్యలకు దారితీస్తుందని ఆయన హెచ్చరించారు. దీనిని ఎదుర్కోవడానికి ప్రతిఒక్కరూ చైతన్యంతో ముందుకురావాలని, మత్తుపదార్థాల నుంచి దూరంగా ఉండి సమాజానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు.
Sorry, no posts matched your criteria.