India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హైడ్రాపై కొన్ని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని కమిషనర్ రంగనాథ్ ఖండించారు. ఎక్కడ కూల్చివేతలు జరిగినా హైడ్రాకు అంటగట్టి దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఇలాంటి వార్తలను నమ్మవద్దని ఆయన సూచించారు. పర్యావరణహిత నగర నిర్మాణమే లక్ష్యంగా తమ కృషి కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా గోల్కొండ కోట ముస్తాబైంది. ఉదయం 10 గంటలకు CM రేవంత్ రెడ్డి జెండా ఎగరేయనున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 6 గంటల నుంచే రాందేవ్‌గూడ-గోల్కొండ కోట రూట్‌లో వాహనాలను అనుమతించడం లేదు. మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. మరికాసేపట్లో CM కోటకు చేరుకోనున్నారు.
ఓ వైపు శరీరాన్ని మంటలు దహించివేస్తోన్న ఆ ఉద్యమకారుడి గొంతులో తెలంగాణ నినాదం ఆగలేదు. స్వరాష్ట్రం కోసం 2009 NOV 29న LBనగర్ చౌరస్తాలో శ్రీకాంతా చారి ఆత్మహుతితో ఉమ్మడి రాష్ట్రం ఉలిక్కిపడింది. గురిచేసింది. జనం ముందే ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ‘జై తెలంగాణ’ అంటూ 5 రోజులు మృత్యువుతో పోరాడాడు. స్వరాష్ట్రం కోసం పరితపించి, ప్రాణాలు విడిచిన శ్రీకాంతాచారి జయంతి నేడు.
అమరుడా నీకు జోహర్లు.
భారీ వర్షాల వల్ల మూసారాంబాగ్ బ్రిడ్జిపై వరద నీరు పారుతోంది. పోలీసులు ఈ వంతెనపై రాకపోకలను నిషేధించారు. అయితే, ఈ సమస్య దశాబ్దాలుగా ఉన్నప్పటికీ, దీనికి పరిష్కారం లభించలేదని వాహనదారులు వాపోతున్నారు. ఈ సమస్యను నివారించేందుకు 2023లో 6 లేన్ల వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసి, 2024లో పనులు ప్రారంభించారు. ఏడాదిలోగా పూర్తవుతుందని చెప్పినా ఇంకా పూర్తి కాలేదు. దీంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు.
స్వాత్రంత్ర్యం కోసం తిరుగుబాటు చేసిన తురుంఖాన్ అతడు. 1857లో చీదాఖాన్‌ను బంధి చేయడం సహించలేక తుర్రేబాజ్‌ఖాన్ బ్రిటిషర్లకు రెబల్ అయ్యాడు. సిపాయిల్లో తిరుగుబావుట ఎగరేసి 500 మందిని ఏకం చేశాడు. కోఠి బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి చేసి, వీరోచిత పోరాటం చేశాడు. జీర్ణించుకోలేని తెల్లోళ్లు అజ్ఞాతంలో ఉన్న తుర్రేబాజ్‌ను చంపేసి, కోఠిలో నగ్నంగా వేలాడదీశారు. కోఠి తుర్రేబాజ్‌ఖాన్ స్మారకం ఇందుకు సజీవ సాక్ష్యం.
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఆస్ట్రేలియాకు చెందిన వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీలు సంయుక్తంగా అందిస్తున్న డ్యుయల్ డిగ్రీ ప్రవేశాల కోసం ఈ నెల 18న కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ తెలిపారు. విశ్వవిద్యాలయం విడుదల చేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా ఇదివరకే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నీటి సాంకేతిక పరిజ్ఞాన కేంద్రం ఆడిటోరియంలో జరిగే కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించారు.
స్వాతంత్యోద్యమంలో స్వదేశీ ఉద్యమం ప్రధాన భూమిక పోషించింది. 1929 ఎప్రిల్ 7న సుల్తాన్‌బజార్‌లోని మహిళా సభకు గాంధీ మొదటిసారి వచ్చారు. విదేశీ వస్త్రాలు బహిష్కరించ తలపెట్టిన ఈ మహాకార్యంలో హిందుస్థాన్ అంతటికీ నూలు దుస్తులు HYD పంపీణీ చేయగలదని ప్రజలను ప్రోత్సహించారు. ‘వివేకవర్థినీ’లో జరిగిన ఈ ప్రోగ్రాంకు వామన్ నాయక్ అధ్యక్షత వహించారు. అనుకున్నట్లే HYD నూలు సరఫరా చేసి బ్రిటిషర్లకు నిద్రలేకుండా చేశారు.
గోల్కొండ కోటలో పంద్రాగస్టు రోజున స్పెషల్ మెడికల్ టీమ్‌ను ఏర్పాటు చేస్తున్నామని గోల్కొండ ఏరియా ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డా.శ్రీనివాసరావు తెలిపారు. ఎనిమిది మంది వైద్యులు, నర్సింగ్ సిబ్బందితో కూడిన ఈ టీం శుక్రవారం ఉదయం నుంచి ఒంటి గంట వరకు గోల్కొండ కోటలోని క్యాంప్‌లో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల వన్టైం పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ తదితర ఇయర్ వైజ్, సెమిస్టర్ వైజ్ కోర్సుల వన్‌టైమ్ ఛాన్స్ బ్యాక్‌లాగ్ పరీక్షలను వచ్చే నెల 9 నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో చూడొచ్చన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీసీఏ మేకప్ పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. బీసీఏ (సీబీసీఎస్) ఆరో సెమిస్టర్ మేకప్ పరీక్షా ఫీజును ఈ నెల 19వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని చెప్పారు. ఈ పరీక్షలను ఈ నెలలోనే నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు.
Sorry, no posts matched your criteria.