India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హైదరాబాద్‌లో విదేశీ సిగరెట్ల గుట్టును కమిషనర్ టాస్క్‌ఫోర్స్, సౌత్ వెస్ట్ జోన్, హాబీబ్ నగర్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో రట్టు చేశారు. రూ.20 లక్షల విలువైన విదేశీ సిగరేట్స్, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. అఫ్సల్ నగర్, అగపురా రోడ్డులో ఓ గోదాంలో విదేశీ సిగరేట్స్ నిల్వ ఉంచారు. ఈ మేరకు నిందితులు ఇమ్రాన్, ఆయుబ్‌ను అరెస్ట్ చేశారు.
ఎనిమిదేళ్ల మైనర్ బాలికను మాయమాటలతో ఆశచూపి, అపహరించి లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆటో డ్రైవర్ షేక్ జావీద్(27) దోషి అని తేలడంతో అతడిపై అత్యాచారం, పోక్సో చట్ట ప్రకారం కేసు నమోదైంది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ న్యాయమూర్తి నిందితుడికి జీవిత ఖైదు, రూ.25వేల జరిమానా, బాధితురాలకి రూ.10లక్షల నష్టపరిహారం అందించాలని తీర్పునిచ్చింది.
మధ్యప్రదేశ్ జబల్‌పూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు హైదరాబాద్ వాసులు మృతిచెందడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశామన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులను అక్కడి ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని, సహాయక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
ప్రయాగ్ రాజ్ వెళ్లి వస్తుండగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదం విషాదం నింపింది.ఘటనలో HYD నాచారం కార్తికేయ నగర్ ప్రాంతానికి చెందిన 1.శశికాంత్(38),2.మల్లారెడ్డి (60), 3.రవి రాంపల్లి (56), 4.రాజు నాచారం ఎర్రకుంట, 5.సంతోష్ (47), 6.ఆనంద్ రెడ్డి ముసారంబాగ్,7.టీవీ ప్రసాద్ నాచారం గోకుల్ నగర్ మృత్యువాత పడ్డారు.కాగా.. ప్రమాద ఘటనలో 8.నవీన్ చారి,9.బాలకృష్ణకు స్వల్ప గాయాల పాలై ప్రాణాలతో బయటపడ్డారు.
జబల్‌పూర్‌లో జరిగిన రోడ్డుప్రమాద ఘటనలో ఏడుగురు హైదరాబాద్ వ్యక్తులు మృతిచెందిన ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన సమాచారం తెలిసిన వెంటనే.. మధ్యప్రదేశ్ ప్రభుత్వ అధికారులతో మాట్లాడి.. మృతుల కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయ, సహకారాలను అందించాలని కోరినట్లు తెలిపారు. గాయపడిన ఇద్దరికి సరైన చికిత్స అందించాలని సూచించామన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ దూర విద్యా కేంద్రమైన ప్రొఫెసర్ జి.రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (పీజీఆర్ఆర్సీడీఈ)లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఏటా రెండు దఫాలుగా ప్రవేశాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా రెండో దఫా మార్చి 31వ తేదీ వరకు ప్రవేశాలు నిర్వహిస్తున్నామన్నారు. వివరాలకు 040-27097177, 040-27098350 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
HYD కూకట్‌పల్లిలో PS పరిధిలో ఈరోజు దారుణం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. స్థానిక రాజీవ్ గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న అబ్దుల్ రహీం అనే వ్యక్తి తన భార్య నసీమా బేగంను బండ రాయితో మోది దారుణంగా చంపేశాడు. భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఇంట్లోనే ఆమెను హత్య చేశాడు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ సమీపంలో రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో హైదరాబాద్‌లోని నాచారానికి చెందిన వారు మృతి చెందడంతో సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులకు ఆదేశించారు.
ప్రైవేటు బస్‌ల ఆగడాలు ప్రయాణికులకు నరకంగా మారింది. వేలకు వేలు టిక్కెట్ల రూపంలో వసూలు చేసి మధ్యలోనే బస్ చెడిపోయిందని తీవ్ర ఆలస్యం చేస్తున్నట్లు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. కనీసం మరో బస్ ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయడం లేదని ట్రావెల్స్ ఆఫీస్‌కి కాల్ చేస్తే రెస్పాన్స్ లేదంటున్నారు. తాజాగా విజయవాడ జాతీయ రహదారిపై శివారు ప్రాంతంలో ప్రయాణికులకు ఇలాంటి అనుభవమే ఎదురై తీవ్ర ఇబ్బంది పడ్డట్లు తెలిపారు.
మూసీ నది అభివృద్ధి సంస్థకు రూ.37.50 కోట్లు కేటాయిస్తూ పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. మూసీ ప్రక్షాళన అభివృద్ధిలో భాగంగా నిర్వాసితులను తరలించేందుకు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మొత్తం 1,500 కుటుంబాలను గుర్తించారు. ఒక్కో కుటుంబానికి రూ.25,000 అందించనున్నట్లు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.