India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గ్రేటర్ పరిధిలో చెరువులను సుందరీకరణ పేరుతో సంస్థలు కార్పొరేట్ సామాజిక బాధ్యత ముసుగులో అక్రమాలకు తెరతీశాయి. శేరిలింగంపల్లి, గండిపేట్ మండలాల్లో చెరువులను సంరక్షిస్తామని కొన్ని రియల్ సంస్థలు జీహెచ్ఎంసీ, ఇరిగేషన్ అధికారులతో ఒప్పందాలు కుదుర్చుకొని బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్‌లను ఆక్రమించుకుంటున్నాయి. స్థానికంగా నిర్మించిన బహుళ అంతస్తుల నిర్మాణ వ్యర్ధాలను చెరువులో కలుపుతున్నాయి.
విమానంలో ఓ ప్రయాణికురాలిని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. సిబ్బంది తెలిపిన వివరాలు.. కేరళకు చెందిన సోషమ్మ(89) బుధవారం కొచ్చి నుంచి ఓ విమాన సర్వీస్‌లో అమెరికాకు బయలుదేదారు. ప్రయాణంలో సోషమ్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన పైలట్.. శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. సోషమ్మను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
రాచకొండలో 19 మంది ఇన్‌స్పెక్టర్లు, 10 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వెయిటింగ్‌లో ఉన్న ఆరుగురు ఇన్‌స్పెక్టర్లకు పోస్టింగ్ కల్పించారు. ఉప్పల్ డీఐగా రామలింగారెడ్డిని, పహడీ షరీఫ్ డీఐగా దేవేందర్, మాడ్గుల సీఐగా జగదీష్, ఎల్బీనగర్ సీఐగా వినోద్ కుమార్, తదితరులకు పోస్టింగ్ ఇచ్చారు.
ఓయూలో ఇటీవల జరిగిన క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో ఎంబీఏ, టెక్నాలజీ మేనేజ్‌మెంట్ విద్యార్థులు 17 మందికి HDFC బ్యాంక్ కొలువులు ఇచ్చింది. రూ.8 లక్షల నుంచి రూ.23 లక్షల మధ్య వార్షిక వేతనంతో ఈ నియామకాలు జరిగాయి. MBA కళాశాలలో నాలుగో సెమిస్టర్ చదువుతున్న 120 మంది విద్యార్థుల్లో 109 మందికి వేర్వేరు కంపెనీలు నియామక పత్రాలు అందించనున్నాయి.
ఓయూ పరిధిలో జరగనున్న పీజీ రెగ్యులర్ కోర్సుల పరీక్షలు వచ్చేనెల 19కి వాయిదా వేశారు. మొదట ప్రకటించిన సెప్టెంబర్ 4 నుంచి ప్రారంభం కావాల్సిన పీజీ కోర్సుల 2, 4వ సెమిస్టర్ పరీక్షలను యుజిసి నెట్, టిఎస్ సెట్ పరీక్షల కారణంగా వాయిదా వేసినట్లు అధికారులు పేర్కొన్నారు. పూర్తి వివరాలను ఉస్మానియా వెబ్ సైట్లో చూడవచ్చన్నారు.
HYDలోని అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ, కాకతీయ వర్సిటీలో దూర విద్యలో ప్రవేశాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఆగస్టు 31న ఈ గడువు పూర్తి కానుంది. డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు, పీజీలో ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ, ఎంబీఏ కోర్సులతో పాటు పీజీ డిప్లొమాలో బీఎల్‌ఐఎస్సీ, ఎంఎల్‌ఐఎస్సీ, కోర్సులు ఉన్నట్లు ప్రొఫెసర్ కోటేశ్వరరావులు, డా.వీరన్న తెలిపారు.
మీర్‌పేట్ కార్పొరేషన్ పరిధిలోని చందనం చెరువు, మంత్రాల చెరువు, పెద్ద చెరువు మూడు చెరువులు కబ్జాకు గురయ్యాయని స్థానికులు ఇచ్చిన పిర్యాదు మేరకు బుధవారం స్థానిక అధికారులతో కలిసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువులను పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువులను ఆక్రమించి ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మించిన అక్రమ నిర్మాణాలు ఫంక్షన్ హాల్, షాపింగ్ కాంప్లెక్స్‌లను ఆయన పరిశీలించారు.
రాష్ట్రంలోనే అత్యధికంగా HYD జిల్లాలో MSME యూనిట్లు ఉన్నాయి. జిల్లాలో 1,68,077 MSMEలు ఉంటే.. ఇందులో 1,33,937 యూనిట్లు సర్వీస్ విభాగంలో ఉన్నాయి. మిగతా 34,140 యూనిట్లు ఉత్పత్తి రంగంలో ఉన్నాయి. ఇందులో సూక్ష్మ సంస్థలు అత్యధికంగా 1,56,642 యూనిట్లు పనిచేస్తున్నాయి. చిన్న తరహావి 9,813, మధ్య తరహావి 1,622 దాకా ఉన్నాయని అధికారులు తెలిపారు.
బేగంబజార్‌లో దుకాణాలు, వాణిజ్య సముదాయాలకు అవసరమైన స్థలాలకు డిమాండ్ విపరీతంగా ఉంటోంది. కొన్నిచోట్ల భూమి అందుబాటులో లేకపోవడంతో పాత భవనాలను కూల్చి కొత్త వాటిని నిర్మిస్తుండటం గమనార్హం. ఇటీవల ఫీల్ఖానాలోని 101 గజాల స్థలం రూ.10 కోట్లకు అమ్ముడుపోయింది. తద్వారా తెలంగాణలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా బేగంబజార్ నిలిచిందని స్థిరాస్తి రంగ నిపుణులు చెబుతున్నారు.
టీజీఎస్ఆర్టీసీలో కొలువుల భర్తీకి మరో రెండు, మూడు వారాల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కొత్త బస్సుల కొనుగోలు, ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే తొలి దశలో 3,035 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నిర్ణయించామని, సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనికి ఆమోదం తెలిపారన్నారు.
Sorry, no posts matched your criteria.