Hyderabad

News August 11, 2025

నాలా ఆక్ర‌మ‌ణ‌ల‌పైనే హైడ్రాకి ఫిర్యాదులు

image

వ‌ర్షాల వేళ నాలాల ఆక్ర‌మ‌ణ‌ల‌పై హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సోమ‌వారం హైడ్రా ప్ర‌జావాణికి మొత్తం 51 ఫిర్యాదులు వచ్చాయని హైడ్రా అద‌న‌పు క‌మిష‌న‌ర్ అశోక్ కుమార్ తెలిపారు. ఫిర్యాదుల‌ను ప‌రిశీలించిన ఆయన అందులో 70 శాతం వ‌ర‌కూ నాలా ఆక్ర‌మ‌ణ‌ల‌పైనే ఉన్నాయన్నారు. సంబంధిత అధికారుల‌కు వాటి ప‌రిష్కార బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు.

News August 11, 2025

HYD: డా.నమ్రత ఆస్తులపై దర్యాప్తు సంస్థ నిఘా

image

సృష్టి ఫెర్టిలిటీ డా.నమ్రతకు ఉచ్చు బిగిస్తోంది. ఆమె బ్యాంక్ అకౌంట్లు, బినామీ అకౌంట్లు, ఆస్తులపై దర్యాప్తు బృందం రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పేరుతో అక్రమ సరోగసీ, IVF, శిశువుల అక్రమ రవాణా చేసి నమ్రత రూ. కోట్లు సంపాదించినట్లు సమాచారం. ఆమె ఆస్తులు, ఆర్థిక మూలాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ నిఘా పెట్టింది.

News August 11, 2025

మలక్‌పేట్‌లో ఎమర్జెన్సీ U TURN

image

కుండపోత వర్షాల నేపథ్యంలో ట్రాఫిక్ సౌకర్యాలను సౌత్ ఈస్ట్ ట్రాఫిక్ డీసీపీ వెంకటేశ్వర్లు వెల్డించారు. మలక్‌పేట్ రైల్వే అండర్‌బ్రిడ్జ్ వద్ద రోడ్డు నీటమునిగితే ప్రత్యామ్నాయంగా వాహనదారులు వెళ్లేందుకు కొత్త U టర్న్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సౌకర్యం మెట్రో రైల్ డిపార్ట్‌మెంట్, GHMC సహకారంతో అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. దీన్ని కేవలం RUB రోడ్డు మునిగినప్పుడు మాత్రమే ఓపెన్ చేస్తామని స్పష్టంచేశారు.

News August 11, 2025

పేట్ లవర్స్‌కి జీహెచ్ఎంసీ GOOD NEWS

image

‘బీ ఏ హీరో.. దత్తత తీసుకోండి షాపింగ్ వద్దు’ నినాదంతో బంజారాహిల్స్ రోడ్ నం.1లోని జలగం వెంగల్రావుపార్క్‌లో ఈ నెల 17న ఉ.6 నుంచి 10 వరకు ఇండీ కుక్కపిల్లల ప్రత్యేక దత్తత మేళాను జీహెచ్ఎంసీ నిర్వహించనుంది. దత్తతకు వచ్చే పెట్ లవర్స్ కోసం డీవార్మింగ్, టీకాలు వేసిన ఆరోగ్యకరమైన ఫ్రెండ్లీ పప్పీలను మేళాలో ప్రదర్శనగా ఉంచుతారంది. దత్తత పూర్తిగా ఉచితం.. కావలసింది మీ ప్రేమే అంటోంది.

News August 11, 2025

ALERT: HYDలో భారీ వర్షాలు కురిసే అవకాశం

image

HYDలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. నిన్న పలు చోట్ల 12 సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదు అయింది. రానున్న రోజుల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని HYD వాతావరణశాఖ తెలిపింది. ఆగస్టు 13వ తేదీ నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే 13వ తేదీ నుంచి 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

News August 11, 2025

‘సృష్టి’ అంతు తేల్చనున్న ప్రభుత్వం.. త్వరలో SIT?

image

సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ముసుగులో డా.నమ్రత సాగించిన అక్రమ శిశు విక్రయాల కేసును తొందరగా తేల్చాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే విచారణను వేగవంతం చేసేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ (SIT) ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. సీనియర్ అధికారి పర్యవేక్షణలో ఏసీపీ, పలువురు ఇన్‌స్పెక్టర్లను సిట్‌లో భాగం చేయనున్నట్లు వార్తల వస్తున్నాయి. నెట్ వర్క్ మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది సిట్ తేల్చనుంది.

News August 11, 2025

హజ్‌యాత్ర: సీనియర్ సిటిజన్స్, ఉద్యోగులకు కొత్త ప్యాకేజీ

image

2026లో హజ్ యాత్రకు వెళ్లే సీనియర్ సిటిజన్లకు హజ్ కమిటీ కొత్త ప్యాకేజీ ప్రకటించింది. సాధారణంగా ఈ యాత్ర 42 రోజుల పాటు ఉంటుంది. అయితే వృద్ధులు, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేకంగా 20 రోజుల హజ్ యాత్ర చేపట్టనుంది. ఇది కోరుకున్న వారికి మాత్రమేనని స్పష్టం చేసింది. ఈ షార్ట్‌టర్మ్ యాత్రకు ఎంత మొత్తం ఖర్చవుతుందనేది త్వరలో చెబుతామని హజ్ కమిటీ కమిటీ ఈవో సాజిద్ అలీ తెలిపారు.

News August 11, 2025

నాంపల్లి: హజ్ యాత్రకు వేలల్లో దరఖాస్తులు

image

వచ్చే ఏడాది హజ్ యాత్రకు వెళ్లేందుకు 11,414 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలంగాణ హజ్ కమిటీ తెలిపింది. హజ్ యాత్రకు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 7న గడువు ముగిసింది. 2, 3 రోజుల్లో డ్రా తీసి యాత్రికులను ఎంపిక చేయనున్నారు. యాత్రకు ఎంపికైన వారు మొదటి విడతలో రూ.1.5 లక్షలు చెల్లించేందుకు సిద్ధంగా ఉండాలని కమిటీ పేర్కొంది.

News August 11, 2025

HYD: ట్రాన్స్‌జెండర్లకు గుడ్‌న్యూస్.. ఉచితంగా డిగ్రీ కోర్సు

image

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్‌జెండర్లకు ఉచిత డిగ్రీ కోర్సు అందివ్వనున్నట్లు వీసీ ప్రొ.ఘంటా చక్రపాణి తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఇది అమలు చేస్తామన్నారు. ఇంటర్ తత్సమాన విద్యార్హత కలిగిన ట్రాన్స్ జెండర్లు కేవలం రిజిస్ట్రేషన్ ఫీజు రూ.500 చెల్లిస్తే చాలు, స్టడీమెటీరియల్ అందించి చదివిస్తామని తెలిపారు. ట్రాన్స్‌జెండర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

News August 11, 2025

సీఎం పర్యటనతో హైడ్రా అలర్ట్

image

CM రేవంత్ రెడ్డి అమీర్‌పేట, బల్కంపేట ప్రాంతాల్లో పర్యటించి, వరద పరిస్థితిని పరిశీలించడంతో హైడ్రా అలెర్ట్ అయింది. ఇక్కడ శాశ్వత పరిష్కారం చూపేందుకు నడుం బిగించింది. షార్ట్, మీడియం, లాంగ్ టర్మ్ విధానాలు అవలంబించి ఉపశమనం కల్పించనుంది. ఇకముందు వరద సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టనుంది. అమీర్‌పేట నుంచి వెంగళరావునగర్ వరకు హైడ్రా అధికారులు స్టడీ చేయనున్నారు.