India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తార్నాకలోని టీజీఎస్ఆర్టీసీ ఆసుపత్రిలో గుండె సంబంధిత చికిత్సలకు క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమర్జెన్సీ కేర్ యూనిట్ ప్రారంభమైంది. ఈ సేవలను సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ శుక్రవారం ప్రారంభించారు. ఫ్యాక్ట్స్ ఫౌండేషన్, అశోక్ లేలాండ్, నిర్మాన్ డాట్ ఓఆర్‌జీ సంస్థల సాయంతో ఈ విభాగాలు ఏర్పాటు అయ్యాయి. క్యాథ్ ల్యాబ్‌తో ఉద్యోగులకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి.
ఎన్నికలు వస్తే అధికార, ప్రతిపక్షాల మధ్య హడావిడి అంతా ఇంతా కాదు. అదేంటోగాని మన HYDలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. అందుకేనేమో ఈసారి MLC ఎన్నికల్లో INC, BRS దూరంగా ఉంటున్నాయి. ఇక గెలుపు కష్టమని తెలిసినా BJP డేర్ చేసింది. అభ్యర్థిని బరిలో నిలిపి బలం కూడబెట్టే ప్రయత్నం చేస్తోంది. సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న MIM గెలుపు ధీమాతో ఉంది. రాష్ట్ర రాజకీయాలను శాసించే INC, BRS ఈ ఎన్నికపై నోరు మెదపకపోవడం గమనార్హం.
చారిత్రక సంపదకు పుట్టినిల్లు మన HYD. నగర నిర్మాణ చిహ్నానికి చార్మినార్, 12వ శతాబ్దంలో నిర్మించిన గోల్కొండ కోట, రాజభవనాలకు కేరాఫ్‌గా చౌమహల్లా ప్యాలెస్, మాల్వాల ప్యాలెస్ ఉన్నాయి. కళా ప్రపంచంలో సాలార్‌జంగ్ మ్యూజియం ఓ మాస్టర్ పీస్. ట్యాంక్‌బండ్, కుతుబ్ షాహీ టూంబ్స్ మక్కా మసీద్, తారామతి బరాదారి, తోలి(డమ్రి) మసీద్, పైగా టూంబ్స్, స్పానీష్ మసీద్ నగర వారసత్వ సంపదకు ఆనవాళ్లు. నేడు World Heritage Day
వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా హైదరాబాద్ వాసులకు శుభవార్త. శుక్రవారం గోల్కొండ ఫోర్ట్‌లోకి ఫ్రీ ఎంట్రీ ఉంటుందని సీనియర్ పరిరక్షణ అధికారి మల్లేశం వెల్లడించారు. ప్రతి యేటా ఈ రోజు ఉచితంగా కోటను సందర్శనకు అనుమతి ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని చారిత్రక కట్టడాలకు ఈ వెసులుబాటు కల్పించారు. నగరవాసులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని గోల్కొండ కోట అధికారులు సూచిస్తున్నారు.
SHARE IT
అమర్నాథ్ యాత్రకు వెళ్లే వారికి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఫిట్నెస్ సర్టిఫికెట్లను ఉచితంగా జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 21 నుంచి సోమ, బుధ, శుక్రవారాల్లో ఉ.10:30 గంటలకు ప్రధాన భవనం, మెడికల్ రికార్డ్స్ డిపార్ట్‌మెంట్‌లో ఈ సర్టిఫికెట్ పొందవచ్చు. దరఖాస్తుతో పాటు రక్త పరీక్షలు, ఛాతి ఎక్స్‌రే, బ్లడ్ గ్రూపు పరీక్షల రిపోర్ట్‌లను తీసుకురావాలని తెలిపారు.
HYD ప్రజలకు రాచకొండ పోలీసులు కీలక సూచనలు చేశారు. వేసవితాపాన్ని తట్టుకోలేక తలుపులు తీసి వరండాల్లో, స్లాబ్‌పైన పడుకోకూడదని హెచ్చరించారు. ఒకవేళ పడుకోవాల్సి వస్తే ఇంట్లో ఒక్కరైనా పడుకునేలా చూసుకోవాలని, మీ ఆభరణాలను సురక్షిత ప్రదేశంలో భద్రపరుచుకోవాలని, దొంగల ముఠాలు ఇదే అవకాశంగా తీసుకుని దోచేస్తారని వివరించారు. అపరిచితులను గుర్తిస్తే 100, 112, 8712662111 కాల్ చేయాలని సూచించారు.
కోఠిలోని TGMSIDC కార్యాలయంలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు. సరైన కారణాలు లేకుండా సిజేరియన్ డెలివరీలు చేస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ దవాఖాన్లలో నార్మల్ డెలివరీల సంఖ్య పెంచాలని, నర్సులకు మిడ్‌వైఫరీ శిక్షణ ఇవ్వాలని సూచించారు. వేసవిలో గర్భిణులు, బాలింతల కోసం ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేయాలని చెప్పారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల (బీహెచ్ఎంసీటీ, బీసీటీసీఏ) పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కోర్సుల 2, 4, 6వ సెమిస్టర్ మెయిన్, బ్యాక్‌లాగ్, మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ సప్లమెంటరీ పరీక్షా ఫీజును ఈనెల 28వ తేదీలోగా సంబంధిత కళాశాలలో చెల్లించాలని చెప్పారు. ఈ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఓయూ పరిధిలో MBA ఇంటర్నల్ పరీక్షలు 21వ తేదిన నిర్వహించనున్నట్లు బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం హెడ్ ప్రొఫెసర్ జహంగీర్ తెలిపారు. MBA నాలుగో సెమిస్టర్ రెండో ఇంటర్నల్ పరీక్షలను 26వ తేదీలోగా, రోజుకు రెండుకు మించకుండా నిర్వహించాలని కళాశాలల నిర్వహకులకు సూచించారు. ఇంటర్నల్ పరీక్షలకు నూతన విధానాన్ని రూపొందించినట్లు చెప్పారు. యాజమాన్యాలకు ఏవైనా సందేహాలు ఉంటే తమను సంప్రదించాలన్నారు.
బషీర్‌బాగ్‌లోని SCERT కార్యాలయంలో తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ ఆధ్వర్యంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020పై సెమినార్ జరిగింది. కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రొ.హరగోపాల్, ప్రొ.శాంత సిన్హా, ప్రొ.రామ మేల్కొటి, ప్రొ.కోదండరాం తదితరులు పాల్గొని వ్యాసాలు సమర్పించారు.
Sorry, no posts matched your criteria.