India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వేములవాడ నియోజకవర్గం రుద్రంగి మండలంలో కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ మంగళవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు ఆయనకు బీజేపీ శ్రేణులు పుష్పగుచ్చాలు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మండలంలో నెలకొన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ సానుకూలంగా స్పందించి వీలైనంత త్వరలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగపూర్ గ్రామానికి చెందిన కూన పోచయ్య (45) ముల్కనూరు బస్టాండులో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. 3 రోజుల క్రితం పోచయ్య భార్య రేణుక పండగకు తల్లిగారింటికి వెళ్లగా.. మద్యం తాగుతూ అప్పటి నుంచి బస్టాండులోనే ఉంటున్నాడు. సోమవారం అతడి భార్య ఇంటికి తీసుకువెళ్లేందుకు బస్టాండ్ వద్దకు వచ్చింది. నీళ్లు తాగించి నిమ్మరసం కోసం పక్కకు రాగానే కిందకు ఒరిగి మృతి చెందాడు.
ఉమ్మడి KNR జిల్లాలో పట్టభద్రుల మండలి ఎన్నికల ప్రచార సందడి రోజురోజుకు పెరుగుతోంది. టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు క్షేత్ర స్థాయిలో ప్రచారం ముమ్మరం చేశారు. పట్టభద్రులను కలుస్తూ NOV 2021 వరకు డిగ్రీ పూర్తి చేసిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరుతున్నారు. సోమవారం నాటికి ఉమ్మడి జిల్లాలో 1,18,822 మంది దరఖాస్తు చేసుకున్నారు. కాగా దరఖాస్తుల స్వీకరణ రేపటితో ముగియనుంది. మరి మీరు అప్లై చేశారా? కామెంట్ చేయండి.
జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సోమవారం రూ.2,49,322 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,39,134, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.76,550, అన్నదానం రూ.33,638,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేశారు.
ధాన్యం కొనుగోళ్ల పరిశీలన కోసం, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రత్యేక అధికారిగా ఐఏఎస్ అధికారి ఆర్ వి కర్ణన్ నియమితులయ్యారు. జగిత్యాల, పెద్దపెల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేందుకు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించనున్నారు. రేపటి నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించనున్నారు.
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి కార్తీక మాస మొదటి సోమవారం పురస్కరించుకొని 76,329 మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ ఈవో కే.వినోద్ రెడ్డి తెలిపారు. అధికసంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. ధర్మదర్శనంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు.
తండ్రి ఫిర్యాదుతో కొడుకుకు చేసిన భూమి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ రెవెన్యూ అధికారులు రద్దు చేశారు. భీమదేవరపల్లి మండలం ముస్తఫాపూర్‌లో మద్దెల రాజకొంరయ్య 4.12 ఎకరాలు 2018లో కొడుకు రవికి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేశాడు. అతను తండ్రిని వదిలేయడంతో సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద పిటిషన్ ఫైల్ చేశారని భీమదేవరపల్లి తహశీల్దార్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. గిఫ్ట్ రిజిస్ట్రేషన్ రద్దుచేసి తిరిగి తండ్రికి భూమి పాస్‌బుక్ అందించారు.
కరీంనగర్ రైల్వే స్టేషన్లో అధికారుల నిర్లక్ష్యంతో అంధకారం నెలకొంది. ఆదివారం రాత్రి తిరుపతికి వెళ్లాల్సిన ప్రయాణికులు చీకట్లో పడరాని పాట్లు వడ్డారు. ఫ్లాట్‌ఫామ్‌కు కేవలం ఒక్కటే ఫ్లాడ్ లైట్ ఉండటంతో దూరంగా ఉన్న రైలు బోగీలోకి ఎక్కేందుకు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రైల్వే స్టేషన్‌లో ఆధునీకరణ పనుల్లో భాగంగా సరఫరా నిలిపివేశారు. దీంతో రైల్వే స్టేషన్ అంధకారం నెలకొనడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం రూ.3,62,638 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్ల అమ్మకం ద్వారా రూ.2,13,973, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.1,03,600, అన్నదానం రూ.45,065, వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రజలకు తెలియజేశారు.
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి కార్తీక మాసం ప్రారంభంలో 60,256 మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ ఈవో కే. వినోద్ రెడ్డి తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. ధర్మ దర్శనంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు.
Sorry, no posts matched your criteria.