Karimnagar

News April 8, 2026

కరీంనగర్ డీఆర్డివో బదిలీ

image

కరీంనగర్ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి (DRDO) వి.శ్రీధర్ రాజన్న సిరిసిల్ల జిల్లాకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సిరిసిల్లలో పనిచేస్తున్న మచ్చ గీతను కరీంనగర్ జిల్లాకు కేటాయిస్తూ పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సంజయ్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా చేపట్టిన ఈ బదిలీల నేపథ్యంలో, అధికారులు వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించారు.

News April 8, 2026

కరీంనగర్: అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం: సీపీ గౌష్ ఆలం

image

కరీంనగర్ జిల్లాలో అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. మార్చిలో 120 కేసులు నమోదు చేసి, 139 వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ఏడాది మొత్తం 245 కేసులు, 357 వాహనాలు పట్టుబడ్డాయని వివరించారు. నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.

News April 8, 2026

KNR: శాతవాహన ఇంజినీరింగ్‌ కళాశాల ఏర్పాటుకు అడుగులు

image

హుస్నాబాద్‌ ప్రాంతీయ విద్యా విస్తరణలో భాగంగా రెవెన్యూ యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మాపూర్ సమీపంలోని సర్వే నంబరు 132/1లో 36 గుంటల భూమిని శాతవాహన సాంకేతిక కళాశాలకు కేటాయిస్తూ ఉత్తర్వులు రిజిస్ట్రార్‌కి పంపించారు. ఈ స్థలంలో నూతన విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్‌ కళాశాలను నిర్మించనున్నారు. దీంతో స్థానిక విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్య చేరువకానుంది.

News April 7, 2026

KNR: పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్

image

కరీంనగర్ నగరంలోని పలు 10వ తరగతి పరీక్ష కేంద్రాలను అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మంగళవారం తనిఖీ చేశారు. ఈ మేరకు ఆమె విద్యార్థులు పరీక్ష రాస్తున్న తీరును స్వయంగా పరిశీలించారు. పరీక్షల నిర్వహణ, విద్యార్థుల హాజరు అంశాలపై సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

News April 7, 2026

KNR: మారుతున్న జీవనశైలి.. పురోగతి వైపా? ప్రమాదం వైపా?

image

ఒకప్పుడు సూర్యోదయానికి ముందే నిద్రలేవడం, ఇంటి వద్ద వండిన స్వచ్ఛమైన ఆహారం తీసుకోవడం, శరీరానికి తగినంత శ్రమ కల్పించడం మన జీవనశైలిలో భాగంగా ఉండేవి. నేడు కాలం మారింది. సాంకేతికత పెరిగి ప్రపంచం అరచేతిలోకి వచ్చింది, అదే క్రమంలో మన ఆరోగ్యం చేజారిపోతోంది. ఉమ్మడి KNR జిల్లాలో గడిచిన దశాబ్ద కాలంలో మన అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. సౌకర్యాల వెనక పరుగెడుతూ ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నాం. నేడు వరల్డ్ హెల్త్ డే.

News April 7, 2026

KNR: 4వ తరగతి ప్రవేశానికి రాష్ట్రస్థాయి ఎంపిక పోటీలు

image

తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ KNR జిల్లా నుంచి ఎంపికైన విద్యార్థులకు ఈ నెల 27, 28 తేదీలలో రాష్ట్రస్థాయి పోటీలు హకీంపేటలో నిర్వహిస్తారని జిల్లా క్రీడాశాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఎంపికైన విద్యార్థులు 3వ తరగతి స్టడీ సర్టిఫికెట్, 5 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, కులం సర్టిఫికెట్, ఆధార్‌ కార్డుతో ఈ నెల 27న హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్లో రిపోర్ట్ చేయాలని, మరిన్ని వివరాలకు 9704061725 సంప్రదించాలన్నారు.

News April 7, 2026

కరీంనగర్: అగ్నిప్రమాదం.. తప్పిన ముప్పు

image

కరీంనగర్ నగరంలోని వర్క్‌షాప్ సమీపంలో ఉన్న సూర్యనగర్‌లో సోమవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఓ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఇంటి వైరింగ్, స్విచ్ బోర్డులు పూర్తిగా కాలిపోయాయి.

News April 6, 2026

KNR: ప్రజావాణి దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలి: కలెక్టర్

image

ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి నిర్వహించారు. అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మి కిరణ్, ఆర్డీవోలు రమేశ్ బాబు, మహేశ్వర్‌తో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. ప్రజావాణికి మొత్తం 233 దరఖాస్తులు వచ్చాయి.

News April 6, 2026

హుజురాబాద్, జమ్మికుంటలో పేలుడు పదార్థాల అక్రమ దందా!

image

హుజురాబాద్, జమ్మికుంట కేంద్రంగా అత్యంత ప్రమాదకర స్థాయిలో ఎక్స్ ప్లోజివ్స్ దందా కొనసాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఎక్స్‌ప్లోజివ్స్, డిటోనేటర్లను ఒకే వాహనంలో తరలిస్తూ వ్యాపారులు ప్రమాదకరంగా వ్యవహరిస్తున్నారు. స్వల్ప ఉష్ణోగ్రతలకే భారీ పేలుడు సంభవించే అవకాశం ఉన్నా, రద్దీప్రాంతాల గుండా ఈ అక్రమ దందా సాగుతోంది. ఏదైనా ప్రమాదం జరిగితే కిలోమీటర్ల మేర విధ్వంసం తప్పదని తెలిసినా.. అధికారులు పట్టించుకోవట్లేదు.

News April 6, 2026

కరీంనగర్: బీజేపీ నూతన అధ్యక్షుల నియామకం

image

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్, హుజురాబాద్ రూరల్, జమ్మికుంట రూరల్ మండల శాఖలకు నూతన అధ్యక్షులను నియమించినట్లు జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆదివారం ప్రకటన విడుదల చేశారు. తిమ్మాపూర్ మండల అధ్యక్షులుగా చింతం శ్రీనివాస్, హుజురాబాద్ రూరల్ అధ్యక్షులుగా పారిపల్లి కొండల్ రెడ్డి, జమ్మికుంట రూరల్ అధ్యక్షులుగా దొంతనవేణి రమేష్ ను నియమించారు. నూతన అధ్యక్షులను బీజేపీ నాయకులు, కార్యకర్తలు అభినందించారు.