India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
KNR బస్టాండ్ ఆవరణలో KNR బస్టాండ్ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్‌గా (ATM) ఎల్.మల్లేశం పదవి బాధ్యతలు స్వీకరించారు. వీరు గతంలో గ్రేటర్ హైదరాబాద్ జోన్ లో ATM షెడ్యూల్స్ లో పని చేసి బదిలీపై వచ్చారు. పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం KNR జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పగిడిమర్రి సొలొమాన్, KNR RM బి.రాజు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.
నాణ్యమైన ఉన్నత విద్యతోనే విద్యార్థులు మంచి ఉద్యోగాలను సాధించగలరని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శాతవాహన విశ్వవిద్యాలయంలో బాలికల హాస్టల్ భవన నిర్మాణ శంకుస్థాపనలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఉపాధి అవకాశాలను కల్పిస్తోందని, విశ్వవిద్యాలయాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరిస్తేనే నాణ్యమైన విద్య అందుతుందని చెప్పారు.
లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ స్పష్టం చేశారు. డిస్ట్రిక్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. లింగ నిర్ధారణ నిషేధ చట్టం-1996 ప్రకారం, గర్భస్థ శిశువు ఆడ లేదా మగ అని చెప్పడం నేరమని తెలిపారు. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని బి.అర్చన ఎంపికైంది. ఈనెల 14న కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించిన సబ్ జూనియర్స్ బాలికల సెలెక్షన్ ట్రయల్స్‌లో ఆమె ప్రతిభ కనబరిచి ఈ అవకాశం దక్కించుకున్నట్లు పీఈటీ ఆడెపు శ్రీనివాస్ తెలిపారు. ఈ పోటీలు సెప్టెంబర్ 25 నుంచి 28 వరకు నిజామాబాద్ జిల్లా ముప్కాల్‌లో జరగనున్నాయి.
తమిళనాడులో జరిగిన సైబర్ మోసంపై కరీంనగర్లో విచారణ కొనసాగుతుంది. అక్కడి వేలూరు డీఎస్పీ లోకేశ్వరం ఆధ్వర్యంలో KNRకు చేరుకున్న పోలీసులు నగరంలోని 1 టౌన్, 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కిసాన్ నగర్‌కు చెందిన బండి కుమార్, ఎండీ అన్వర్, దూలం నరేష్‌తోపాటు పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నేరం రుజువైతే వీరిని అరెస్టు చేసే అవకాశం ఉంది. కాగా, రూ.కోట్లలో మోసం జరిగినట్లు సమాచారం.
కరోనా సమయంలో నిలిపివేసిన ముంబై టు(లోకమాన్య తిలక్ టర్మినస్) కరీంనగర్ రైలును అధికారులు పునః ప్రారంభించారు. వారానికి ఒకసారి ముంబై నుంచి కరీంనగర్‌కు ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు బుధవారం ఉదయం 10 గంటలకు కరీంనగర్ రైల్వే స్టేషన్‌కు చేరుకొంటుందని, అదేరోజు సాయంత్రం 5.30 గంటలకు కరీంనగర్ టు ముంబై బయలుదేరుతుందని KNR రైల్వే స్టేషన్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ భాన్ చందర్ తెలిపారు.
కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు కేవలం రూ.110 చెల్లించి లేబర్ కార్డు పొందవచ్చని, దీంతో హెల్త్ స్క్రీనింగ్ కార్డు కూడా లభిస్తుందని హుజురాబాద్ అసిస్టెంట్ లేబర్ అధికారిణి చందన తెలిపారు. ఈ కార్డుతో ఏటా ఉచితంగా రక్తపరీక్షలు చేయించుకోవచ్చని చెప్పారు. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.6 లక్షలు, సాధారణ మరణానికి రూ.1.30 లక్షలు, కూతురు వివాహానికి రూ.30 వేలు ఆర్థిక సహాయం అందుతుందని ఆమె వివరించారు.
కరీంనగర్ పట్టణానికి చెందిన ప్రముఖ డాక్టర్ రోహిత్ రెడ్డి, గౌతమి రెడ్డి దంపతులు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఈ చేరిక జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, గంగుల కమలాకర్ పాల్గొన్నారు. డాక్టర్ దంపతుల చేరిక పార్టీకి బలాన్ని ఇస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.
ఈ రోజు కరీంనగర్ జిల్లాలో తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల ఐకాస ఆధ్వర్యంలో గ్రామపాలన అధికారుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి TGRSA చైర్మన్ లచ్చిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామపాలన అధికారులు ప్రజలను మన కుటుంబ సభ్యుల లాగా భావించి వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు.
కరీంనగర్ జిల్లా పర్యటనకు మరికాసేపట్లో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ రానున్నారు. LMD కాలనీలో బ్యూటీషియన్, జ్యూట్ బ్యాగ్స్ టైలరింగ్, ఎలక్ట్రికల్ ఆటో డ్రైవింగ్‌లో శిక్షణ పొందిన మహిళలకు మానకొండూర్ MLA కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి వీరు సర్టిఫికెట్లు ప్రదానం చేయనున్నారు. అనంతరం కరీంనగర్‌లోని మహాత్మ జ్యోతిరావు పూలే గ్రౌండ్లో జరిగే బతకమ్మ వేడుకల్లో పాల్గొననున్నారు.
Sorry, no posts matched your criteria.