India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి KNR జిల్లా వ్యాప్తంగా దీపావళి వేడుకలు గురువారం ఘనంగా జరగగా.. పలుచోట్ల నేడు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో PDPL జిల్లాలోని పలు చోట్ల వేడుకలను నేడు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మహిళలు గ్రామ దేవత పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి కేదారేశ్వర నోమును పవిత్రంగా నోముకుంటారు. స్వాతి నక్షత్రం రావడంతో పెద్ద ఎత్తున నోములు నోముకుంటున్నారు. మరి దీపావళిని మీరు ఎలా జరుపుకున్నారు?
డీఎస్సీలో ఎంపిక కాలేదని నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. SI కృష్ణారెడ్డి వివరాలు.. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుగ్గిళ్ల గ్రామానికి చెందిన సోము శంకర్(33) పీజీ వరకు చదువుకున్నాడు. ఇటీవల DSC రాయగా ఎంపిక కాకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
బీర్పూర్ మండలం రేకులపల్లి గ్రామంలో లిఫ్ట్ ఇరిగేషన్‌కు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో ప్రత్యామ్నాయ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని కోరుతూ MLC జీవన్ రెడ్డి కలెక్టర్‌కు లేఖ రాశారు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో సాగు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని, రైతులు ఈ విషయాన్ని ఎమ్మెల్సీ దృష్టికి తీసుకువెళ్లగా.. కలెక్టర్, ఇరిగేషన్ అధికారులకు లేఖ రాసి సాగు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి గురువారం దీపావళి సందర్భంగా 17,815 మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ ఈవో కె.వినోద్ రెడ్డి తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. ధర్మ దర్శనంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు.
జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ కొండగట్టు ఆంజనేయ దేవస్థానంలో గురువారం దీపావళి వేడుకలు ఆలయ అధికారులు, అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానంలో దీపకాంతులతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
దీపావళి సందర్భంగా కరీంనగర్ పట్టణంలోని శ్రీ మహాశక్తి దేవాలయంలోని గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ లక్ష్మీగణపతి, శ్రీ అనంతనాగేంద్ర స్వామి, శ్రీ మహాదుర్గ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి అమ్మవార్ల ప్రత్యేక అలంకరణ మహాహారతి కార్యక్రమాలు నిర్వహించారు. దీపావళి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
దీపావళిని సాధారణంగా ఇంట్లో అందరితో కలిసి టపాసులు కాల్చుతూ జరుపుకుంటారు. కానీ, మన కరీంనగర్ జిల్లాలో మాత్రం దాదాపు 6 దశాబ్ధాల నుంచి శ్మశాన వాటికలో జరుకుంటున్నారు. అదెక్కడో కాదండోయ్! నగరంలోని కార్ఖనగడ్డ వద్ద గల హిందూ శ్మశాన వాటికలో. ఓ సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు మరణించిన తమ బంధువుల సమాధుల వద్ద నైవేద్యాలు, కొవ్వొత్తులు వెలిగించి, పిండివంటలు పెట్టి టపాసులు కాలుస్తూ దీపావళిని ఘనంగా జరుపుకుంటారు.
నేడు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా సర్దార్ వల్లభాయ్ చౌక్ ఢిల్లీ వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా న్యూ ఢిల్లీలోని పటేల్ చౌక్ వద్ద నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ దంకర్, కేంద్ర మంత్రులు పలువురు ఎంపీలు ఉన్నారు.
కార్తీక మాసం పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం సోమ, మంగళవారాల్లో వేములవాడ నుంచి వరంగల్‌కు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు కరీంనగర్ RM సుచరిత తెలిపారు. శని, ఆదివారాల్లో వరంగల్ నుంచి వేములవాడకు సర్వీసులు నడుపుతామని పేర్కొన్నారు. శబరిమలకు వెళ్లే భక్తులకు, అరుణాచలగిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామన్నారు.
KNR జిల్లా చొప్పదండి MLA మేడిపల్లి సత్యంను ఫోన్, వాట్సాప్‌లో బెదిరించిన వ్యక్తిపై బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ ద్వారా లుక్‌అవుట్ సర్కులర్ జారీ చేసినట్లు కరీంనగర్ రూరల్ ఏసీపీ వెంకటరమణ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. MLA సత్యంకు సెప్టెంబర్ 28న మధ్యాహ్నం రాత్రి సమయాల్లో వాట్సాప్ ద్వారా నిందితుడు ఫోన్ చేశాడు. ఈ క్రమంలో తనకు రూ.20 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశాడు. కాగా, కేసు నమోదైంది.
Sorry, no posts matched your criteria.