India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకులో అకౌంట్ ఉంటేనే మహాలక్ష్మి పథకం వస్తుందని వచ్చే అసత్య ప్రచారాలను నమ్మవద్దని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఈ అకౌంట్ ఉంటే మహాలక్ష్మి పథకం కింద రూ.2,500 జమ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వదంతులు నమ్మవద్దని, ఇది అసత్య ప్రచారమని కలెక్టర్ తెలిపారు. ఫేక్వ వార్తలను నమ్మవద్దని, ఇందులో ఎలాంటి వాస్తవం లేదని తెలిపారు.
కరీంనగర్ జిల్లాలో 9 మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం MPC, BiPC, MEC, CEC, HEC & వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశానికి ముస్లిం మైనారిటీ & క్రిస్టియన్ మైనారిటీలకు ఖాళీలు ఉన్నాయని, జిల్లా అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ అధికారి అనిల్ ప్రకాష్ తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ప్రవేశాలకు ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 0878-2957085 నంబర్లో సంప్రదించాలని పేర్కొన్నారు.
ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ మొదలైన అంశాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, టీం వర్క్, నాయకత్వ లక్షణాలు మొదలైన 21 శతాబ్దపు ఉద్యోగ నైపుణ్యాలను అందించడానికి మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ తో SRR ప్రభుత్వ కళాశాల ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం కళాశాలలో 12 రోజుల శిక్షణను ఆగష్టు 11వ తేది నుంచి విద్యార్థులకు అందిస్తారని కళాశాల ప్రిన్సిపల్ కే.రామకృష్ణ తెలిపారు.
అక్టోబర్ 12న జరగబోయే కరీంనగర్ హాఫ్ మారథాన్ 3వ ఎడిషన్ పోస్టర్ను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆవిష్కరించారు. గత రెండు సంవత్సరాలుగా నిర్వహించిన హాఫ్ మారథాన్లు విజవంతమయ్యాయని, ఈ సంవత్సరం కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ప్రజలకు ఆరోగ్యం పట్ల అవగాహన తీసుకువస్తున్న కరీంనగర్ రన్నర్స్ సైకిలిస్ట్ అసోసియేషన్ సభ్యులను అభినందించారు. ఇందులో 3, 5, 10, 21 కిలో మీటర్ల పరుగు ఉంటుంది.
స్థానిక SRR ప్రభుత్వ కళాశాలలోని వృక్షశాస్త్ర విభాగంలో MS స్వామినాథన్ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణ మాట్లాడుతూ.. 1960 కాలంలో భారతదేశం ఆహార భద్రత సమస్యతో పోరాడినప్పుడు భారతదేశానికి నేనున్నానని భారతదేశ ఆకలిని తీర్చిన ఘనుడు స్వామినాథన్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ నితిన్ పాఠక్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తదితరులున్నారు.
డిగ్రీ అడ్మిషన్లకు సంబంధించి దోస్త్ స్పెషల్ ఫేజ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయిందని SRR ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ కే.రామకృష్ణ తెలిపారు. స్పెషల్ ఫేజ్లో కేటాయింపు పొందిన విద్యార్థులు ఆగస్టు 8 లోపు తమ దోస్త్ వ్యక్తిగత లాగిన్ లో ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్ట్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలన్నారు. ఒరిజినల్ TC, ఇతర సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో కళాశాలకు వచ్చి సీటు కన్ఫర్మేషన్ చేసుకోవాలన్నారు.
తల్లిపాల వారోత్సవాల సందర్భంగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, మెప్మా సంయుక్త ఆధ్వర్యంలో KNR లోని కళాభారతిలో తల్లిపాల ప్రయోజనాలపై తల్లులు, స్వయం సహాయక సభ్యులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరై మాట్లాడుతూ.. తల్లిపాలు అమృతంతో సమానమని, ఇవి కేవలం బిడ్డ ఆకలి తీర్చడమే కాకుండా ఔషధంలా పనిచేస్తూ రోగనిరోధక శక్తిని పెంచుతాయని అన్నారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో దూరవిద్యలో మొదటి సంవత్సరం అడ్మిషన్ల కోసం జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమన్వయ కర్త రాజేంద్రం ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించారు. BA, బీకాం, బీఎస్సీ కోర్సులలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆన్ లైన్ ద్వారా ఆగస్టు 13 లోపు అప్లై చేసుకోవాలని తెలిపారు. ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు ట్యూషన్ ఫీజు చెల్లించాలని, వివరాల కోసం 7382929775 సంప్రదించాలన్నారు.
కొత్తపల్లి జ్యోతిరావుపూలే పాఠశాలలో ముందస్తు రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు ప్రిన్సిపల్ మహేష్ రాహుల్ తెలిపారు. రాఖి అనేది కేవలం అన్నా చెల్లెమ్మల బంధమే కాదని, ఇది పరస్పర గౌరవానికి, రక్షణకు, విశ్వాసానికి ప్రతీక అని చెప్పుకొచ్చారు. సమాజంలో మహిళలకు గౌరవం ఇవ్వడం, వారిని అన్ని రకాలుగా రక్షించడం ప్రతి మనిషి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు, తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి బుధవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. నిషేధిత భూముల జాబితాలోని భూములకు రిజిస్ట్రేషన్లు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఆ భూముల జాబితాను నవీకరించాలని, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, మున్సిపల్ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా చూడాలని ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.