India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సైదాపూర్ మండలం ఆరెపల్లి గ్రామనికి చెందిన బూర్గుల అభిరామ్ పుట్టెడు దు:ఖంలోనూ ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష రాశాడు. అభిరామ్ తండ్రి రాజేశ్వర్రావు మృతిచెందగా తండ్రి మృతదేహం ఇంటిదగ్గర ఉండగానే పరీక్ష రాసొచ్చి అనంతరం తండ్రి అంత్యక్రియలు నిర్వహించారు. తండ్రి చితికి అభిరామ్ నిప్పంటించాడు. విద్యార్థిని బంధువులు, గ్రామస్థులు ఆవేదన చెందారు.
ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లలో జమ్మికుంట మున్సిపాలిటీ 100% లక్ష్యాన్ని సాధించి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ అయాజ్ మాట్లాడుతూ.. ఈ ఘనత ప్రజల సహకారంతోనే సాధ్యమైందని.. అధికారులు, సిబ్బంది ముందుగా కార్యచరణ రూపొందించుకొని సమర్థవంతంగా పనిచేయడంతోనే ఈ లక్ష్యాన్ని సాధించామన్నారు. జమ్మికుంట మున్సిపాలిటీ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తామన్నారు.
మాదకద్రవ్యాల నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, యువత మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మత్తుపదార్థాల నిర్మూలనలో భాగంగా పోలీస్, ఎక్సైజ్ సహా వివిధశాఖల అధికారులతో బుధవారం ఆమె సమన్వయ సమావేశం నిర్వహించారు. కళాశాలలో వివిధ వసతి గృహాలను సందర్శించాలన్నారు. అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసే విద్యార్థులు పెడదోవ పట్టకుండా చూడాలని ఆదేశించారు.
కరీంనగర్ జిల్లాలో నిర్వహిస్తున్న ఇంటర్ పరీక్షల్లో భాగంగా సెకండ్ ఇయర్ ఫిజిక్స్ పేపర్ 2, ఎకనామిక్స్ పేపర్ 2లో నలుగురు విద్యార్థులు డీబార్ అయినట్లు జిల్లా విద్యాధికారులు తెలిపారు. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలకు 15,965 మంది విద్యార్థులకు గాను 15,563 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. పరీక్షలకు 402 మంది విద్యార్థులు హాజరు కాలేదని తెలిపారు.
కొత్తపల్లి మండల శివారులో ఈనెల 15న వెంకటమ్మ అనే వృద్ధురాలు హత్యకు గురైన విషయం తెలిసిందే. వెంకటమ్మను హత్య చేసిన మనవడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వెంకటమ్మకు కొడుకులు లేకపోవడంతో బిడ్డ కొడుకుని దత్తతకు తీసుకుని వివాహం జరిపించింది. వెంకటమ్మ వద్ద ఉన్న డబ్బు, బంగారం కోసం తరచూ ఇబ్బందులు పెట్టడంతో బంధువుల ఇంటి వద్ద ఉంటోంది. LIC డబ్బులు వచ్చాయని పిలిపించి హత్యచేసి పారిపోగా పోలీసులు అరెస్టు చేశారు
కరీంనగర్ టౌన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గోపతి నరేందర్కు రాష్ట్ర ప్రభుత్వం ఏఎస్పీగా పదోన్నతి కల్పించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు విడుదల అయ్యాయి. పదోన్నతిపై ఆయనను హైదరాబాదులోని డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు. ఈ సందర్భంగా నరేందర్ కు కమిషనరేట్ పోలీస్ అధికారులు, సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.
ఉద్యోగులు ప్రభుత్వం అందిస్తున్న శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని, తద్వారా నైపుణ్య అభివృద్ధిని పెంపొందించుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కలెక్టరేట్లో నిర్వహిస్తున్న డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం పరిధిలోని ప్రాంతీయ శిక్షణ కేంద్రాన్ని ఆధునికరించారు. ఆధునికరించిన ఈ ప్రాంతీయ శిక్షణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం ప్రారంభించారు.
నీటిసంపులో పడి బాలుడు మృతిచెందిన ఘటన సైదాపూర్ మండలం బొమ్మకల్లో చోటుచేసుకుంది. స్థానికులు వివరాలిలా.. గ్రామానికి చెందిన ఎలబొయిన సురేశ్-చైతన్యల కుమారుడు ప్రజ్ఞాన్ (2) నీటిసంపులో పడి చనిపోయాడు. రోజువారీలానే పిల్లాడిని ఇంటి వరండాలో ఆడుకోవడానికి వదిలేశారు. ఎంత సేపయినా బాలుడి ఆచూకీ కన్పించకపోవడంతో చుట్టుపక్కల వారి ఇంట్లో వెతికారు. అయినా కన్పించకపోవడంతో సంపులో వెతగ్గా బాలుడి మృతదేహం లభ్యమైంది.
టీబీ వ్యాధి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని, అనుమానం ఉన్న వారంతా TBపరీక్ష చేయించుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జాతీయ TBనిర్మూలన కార్యక్రమంలో భాగంగా మెట్రోసెమ్ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన TB వ్యాధిగ్రస్థులకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి టీబీ తొందరగా వ్యాపిస్తుందని, అందువల్ల సమతుల పోషకాహారం తీసుకోవాలని సూచించారు.
శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామానికి చెందిన చల్లూరి రాజకుమార్ ఇటీవల వెలువడిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ -2 ఫలితాల్లో మంచిమార్కులు సాధించి ఉద్యోగానికి ఎంపికయ్యాడు. రాష్ట్రస్థాయిలో 18వ ర్యాంకు సాధించాడు. చల్లూరి సాయిలు, కేతమ్మల కుమారుడైన రాజకుమార్.. ఇన్నాళ్లు ఎంతో కష్టపడి చదివి తన కళ నెరవేర్చుకున్నారు. గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు రాజకుమార్కు అభినందనలు తెలిపారు.
Sorry, no posts matched your criteria.