India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దీపావళి పర్వదినం సందర్భంగా సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు ఈనెల 25న బోనస్ రూ.93,750 చెల్లించేందుకు సింగరేణి యాజమాన్యం నిర్ణయించిందని గుర్తింపు కార్మిక సంఘం(AITUC) అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సీతారామయ్య, కొరిమి రాజ్ కుమార్ తెలిపారు. ఈనెల 31న దీపావళి పండుగ ఉన్నందున సింగరేణిలో కార్మికులకు బోనస్ చెల్లించాలని గుర్తింపు సంఘం యాజమాన్యాన్ని కోరిన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
ఒకప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గ్రామాల్లో ప్రతి ఇంట్లో కాడెడ్లు, కర్ర నాగళ్ళతో కర్షక లోగిళ్లు కళకళలాడేవి. ప్రస్తుతం వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగిపోవడంతో కాడెద్దులు కనుమరుగవుతున్నాయి. అడపాదడపా అక్కడక్కడ మాత్రమే కనిపిస్తున్నాయి. రైతుల ఇళ్లలో పాడి కళ తప్పింది. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం నిలబడదు అని నానుడి ఉండేది. నేటి యాంత్రిక జీవనంలో యంత్రాలతో పాటు రైతు జీవితం కళ తప్పింది.
@ సిరిసిల్లలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్. @ శంకరపట్నం మండలంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు. @ కాటారం పిహెచ్సి వైద్యుని విధులకు ఆటంకం కలిగించిన వారిపై కేసు నమోదు.@ జగిత్యాల జిల్లాలో భూసేకరణ సర్వే ను పరిశీలించిన కలెక్టర్. @ మల్లాపూర్ మండలంలో హత్యకు పాల్పడిన నిందితుల అరెస్ట్.
రామగుండం రైల్వేస్టేషన్ వద్ద ట్రైన్లోనే ఓ మహిళకు 108 సిబ్బంది డెలివరీ చేశారు. ఆగ్రా నుంచి కరీంనగర్‌కు ఏపీ ఎక్స్‌ప్రెస్ రైలులో స్వాతి, ఆమె కుటుంబసభ్యులు ప్రయాణిస్తున్నారు. మందమర్రిలో పురిటి నొప్పులు రావడంతో రామగుండం 108 సిబ్బందికి సమాచారం అందించారు. డెలివరీ అనంతరం స్వాతితో పాటు పుట్టిన పసి బిడ్డను మెరుగైన వైద్యం కోసం గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
హైదరాబాద్ జినోమ్ వ్యాలీలో బయోప్రాసెస్ డిజైన్ సెంటర్ ఏర్పాటుకు థెర్మో ఫిషర్ సైంటిఫిక్ సంస్థ సంసిద్ధమైంది. ఈ సందర్భంగా బుధవారం మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో సచివాలయంలో థెర్మో ఫిషర్ సంస్థ అధికారికంగా ఎంవోయూ కుదుర్చుకుంది. ఔషధ, లైఫ్ సైన్సెస్ రంగానికి ప్రయోగశాల పరికరాలు, రీఏజెంట్స్ సరఫరాలో థెర్మో ఫిషర్ దిగ్గజ సంస్థ. 10 వేల చదరపు అడుగుల్లో డిజైన్ సెంటర్, 2025 మొదటి త్రైమాసికంలో ప్రారంభం కానుంది.
పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. బుధవారం ఆయన రామగిరి మండలంలోని బేగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో స్కావెంజర్‌ను ఏర్పాటు చేసుకున్నారో లేదో అడిగి తెలుసుకున్నారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులకు సూచించారు. మన ఊరు మన బడి కార్యక్రమం పనులను పరిశీలించారు.
అయోధ్యలో శ్రీ మహానారాయణ దివ్య రుద్ర సహిత శత సహస్ర చండీ విశ్వశాంతి మహా యాగాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ సభ్యుడు, TTD మాజీ ఈఓ LV.సుబ్రమణ్యం తెలిపిన విషయం తెలిసిందే. కాగా గతంలో ఈ యాగం NOV 2 నుంచి అని ప్రకటించగా తేదీలను పోస్ట్ పోన్ చేశారు. NOV 18 నుంచి JAN 1 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పాల్గొనే వారు తమ పేరును నమోదు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు సెల్: 7780252277 సంప్రదించాలన్నారు.
MLC జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు, జాబితాపురం గ్రామ మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డి మంగళవారం ఉదయం హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గంగారెడ్డి పార్థివ దేహానికి MLC జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి అనంతరం గంగారెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్నారు. కాగా, గంగారెడ్డి హత్యతో జగిత్యాల ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
@ ఎల్లారెడ్డిపేట మండలంలో బాలుడిపై వీధి కుక్క దాడి.
@ జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్‌లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరుడి దారుణ హత్య.
@ కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు మాతృ వియోగం.
@ మెట్పల్లి మండలంలో రహదారి పనులను పర్యవేక్షించిన కలెక్టర్ సత్యప్రసాద్.
@ కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ.
@ వేములవాడలో బైకులను ఢీ కొట్టిన కారు.. ఇద్దరికి గాయాలు.
సాధారణంగా ఒక మండలంలో ఒకటి లేదా రెండు రైల్వే స్టేషన్లు ఉంటాయి. ఇందుకు భిన్నంగా పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో మూడు రైల్వే స్టేషన్లు ఉన్నాయి. కాజీపేట-బలర్ష మధ్య మార్గంలో పోత్కపల్లి, ఓదెల, కొలనూర్ సుమారు 25 కీలో మీటర్ల పొడవైన రైల్వే ట్రాక్ ఉంది. ఓదెలలో ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ సౌకర్యం కల్పిస్తే జిల్లాలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరుగుతుంది.
Sorry, no posts matched your criteria.