Karimnagar

News March 12, 2025

తెలంగాణ బడ్జెట్.. కరీంనగర్‌కు ఏం కావాలంటే..!

image

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలోని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. దళిత బంధు రెండో విడత నిధులు విడుదల చేయాలని, వేసవిలో సాగు, తాగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు. కల్వల ప్రాజెక్టుకు నిధులు కేటాయించి పూర్తి చేయాలని, అలాగే జిల్లాలో పెండింగ్‌లో ఇతర పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.

News March 12, 2025

కరీంనగర్: వేర్వేరు కారణాలతో ముగ్గురి సూసైడ్

image

కరీంనగర్ జిల్లాలో వేర్వేరు కారణాలతో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలిలా.. సైదాపూర్ మండలం వెంకటేశ్వర్లపల్లికి చెందిన కరుణాకర్ మనస్తాపంతో పురుగు మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. హుస్నాబాద్ మండడం మహ్మాదాపూర్‌కి చెందిన నర్సింహాచాలి ఆనారోగ్యంతో ఉరేసుకున్నాడు. మానకొండూర్ మండలం పోచంపల్లికి చెందిన అంజయ్య మానసిక స్థితి సరిగా లేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

News March 12, 2025

సైదాపూర్: గ్రూప్-2 RESULT.. యువకుడికి 70వ ర్యాంక్

image

సైదాపూర్ మండలం ఎక్లాస్‌పూర్‌కి చెందిన సంతపురి నిఖిల్ రెడ్డి గ్రూప్-2 ఫలితాల్లో సత్తా చాటాడు. మంగళవారం ప్రకటించిన ఫలితాల్లో రాష్ట్రంలో 70వ ర్యాంకు సాధించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. నిఖిల్ రెడ్డి గతంలో గ్రూప్-4లో 7వ ర్యాంకు సాధించి ప్రస్తుతం కరీంనగర్ డీటీఓ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నాడు.

News March 12, 2025

గ్రూప్-2లో ఎక్లాస్‌పూర్ వాసీకి 70వ ర్యాంక్

image

సైదాపూర్ మండలం ఎక్లాస్‌పూర్‌కి చెందిన సంతపురి నిఖిల్ రెడ్డి గ్రూప్-2లో 70వ ర్యాంకు సాధించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. నిఖిల్ రెడ్డి హుజూరాబాద్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకున్నారు. ఇంటర్మీడియట్ హైదరాబాదులోని నారాయణ జూనియర్ కళాశాలలో చదివారు. గతంలో గ్రూప్-4లో 7వ ర్యాంకు సాధించి ప్రస్తుతం కరీంనగర్ డీటీవో కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నారు.

News March 12, 2025

కరీంనగర్: మూడురోజులు ఫ్లెక్సీ షాపులు బంద్

image

కరీంనగర్‌లోని ఫ్లెక్సీ ప్రింటింగ్ షాపులు మూడురోజుల బంద్‌కు పిలుపునిచ్చినట్లు ఫ్లెక్సీ ప్రింటింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు మనోహర్ తెలిపారు. GST పెంపు ధరలు, ముడి సరుకులు, ట్రాన్స్‌పోర్ట్ ధరలు అధికంగా పెరగడం వలన పాత ధరల్లో తాము పనులు చేయలేక సతమతమవుతున్నామన్నారు. సభ్యులందరూ కలిసి ఒక ధరను నిర్ణయించి వాటిని అమలు చేసే ప్రయత్నంలో భాగంగా 12, 13, 14వ తేదీల్లో బంద్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.

News March 12, 2025

KNR: మహిళా ఉద్యోగులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి: కలెక్టర్

image

ఇంటి పనులతో పాటు ఉద్యోగ బాధ్యతలోనూ కీలకపాత్ర పోషిస్తున్న మహిళ ఉద్యోగులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. వైజాగ్ ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో టీఎన్జీవో భవన్‌లో ఆరోగ్య మహిళా కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొని మాట్లాడారు. మహిళలు కుటుంబ పనులతో పాటు ఉద్యోగాలలో బిజీగా ఉంటారన్నారు. వారు ప్రతి ఆరునెలలకు ఒకసారి వైద్యపరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

News March 11, 2025

హుజూరాబాద్: జ్వరంతో పదోతరగతి విద్యార్థిని మృతి

image

హుజూరాబాద్ మండలం చెల్పూర్‌కు చెందిన బండారి రమ్య జ్వరంతో బాధపడుతూ ఈరోజు మృతి చెందినట్లు తెలిపారు. రమ్య గ్రామంలోని పాఠశాలలో పదోతరగతి చదువుతోంది. అయితే ఆమెకు వారం రోజుల క్రితం జ్వరం రాగా హనుమకొండలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఈ క్రమంలో మంగళవారం జ్వరం తీవ్రతరం కావడంతో మృతిచెందిందని తల్లిదండ్రులు తెలిపారు.

News March 11, 2025

గంగారం మృతికి కేంద్రమంత్రి బండి సంజయ్ సంతాపం

image

రాజన్న సిరిసిల్ల జిల్లా TGSP 17వ బెటాలియన్ కమాండెంట్ గంగారాం మృతిపట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదవశాత్తు అయిన లిఫ్టులో పడి మృతి చెందడం బాధాకరమని అన్నారు. గంగారాం కుటుంబ సభ్యులకు బండి సంజయ్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గంగారాం ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలిగించాలని అన్నారు.

News March 11, 2025

కరీంనగర్: మనం ప్రమాదకరమైన గాలిపీలుస్తున్నాం..!

image

కర్బన ఉద్గారాలతో గాలి నాణ్యత తగ్గి, భిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడి ప్రజలు ఉక్కరిబిక్కిరి అవుతున్నారు. గాలి నాణ్యత విలువ 0-50 ఉంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. 51-100ఉంటే పర్వాలేదని, 101-150 ఉంటే పెద్దలూ, పిల్లల్లో ఊపిరితిత్తులు, ఇతర వ్యాధులు రావొచ్చని హెచ్చరిస్తున్నారు. 201-300 ఉంటే అందరికి వచ్చే ప్రమాదముంది. కరీంనగర్‌లో గాలినాణ్యత విలువ 104గా ఉంది. ఇప్పటికైనా మనం మారాల్సిన అవసరముంది. ఏమంటారు!

News March 10, 2025

కరీంనగర్: జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన సీపీ

image

కరీంనగర్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన గౌస్ ఆలం కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని మర్యాదపూర్వకంగా కలిశారు. కరీంనగర్ కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి పూల మొక్కను అందజేశారు. అనంతరం కరీంనగర్ జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు అధికారులు చర్చించారు.

error: Content is protected !!