India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కరీంనగర్ జిల్లా లో నిర్వహిస్తున్న ఇంటర్ ఎగ్జామ్‌లో భాగంగా ఫస్టియర్ ఇంగ్లీష్ పేపర్ వన్ ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా విద్యాధికారులు తెలిపారు. ఇంటర్ పరీక్షలకు 18222 మంది విద్యార్థులకు 17767 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. పరీక్షలకు 455 మంది విద్యార్థులు హాజరు కాలేదని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ ఉన్నాతాధికారులను బదిలీ చేసింది. కరీంనగర్ కొత్త పోలీస్ కమిషనర్‌గా గౌస్ ఆలం బదిలీపై వచ్చారు. ప్రస్తుతం ఈయన ఆదిలాబాద్ జిల్లా ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుత కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి స్థానంలో ఈయన విధులు నిర్వహించనున్నారు.
జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం నాగునుర్ గ్రామంలో శుక్రవారం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాజ్యాంగ నిర్మాత బీఆర్.అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేయడం స్థానికంగా ఆందోళన కలిగించింది. ఈ విషయమై దళిత సంఘాల నేతలు స్పందిస్తూ.. ఇది దేశాన్ని, యావత్ సమాజాన్ని అవమానించడమేనని ఆగ్రహం చేశారు. పోలీసులు వెంటనే స్పందించి నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని, దేశ ద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.
KNR జిల్లాలో అసాధారణ వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. వేసవి నేపథ్యంలో ఎండలు మండుతున్నప్పటికీ, రాత్రి సమయంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీంతో జిల్లాలో పగలు అత్యధిక ఉష్ణోగ్రతలు, రాత్రి అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. గడచిన 24 గంటల్లో కరీంనగర్ జిల్లా కేంద్రంలో 36.1℃ గరిష్ట నమోదు కాగా, శంకరపట్నం మండలం కొత్తగట్టు 13.6°C అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయింది. ఈ పరిస్థితిపై మీ కామెంట్..?
కరీంనగర్ జిల్లాలో ఓ పెళ్లి ఊరేగింపులో కారు బీభత్సం సృష్టించగా పలువురు గాయపడ్డారు. శంకరపట్నం మండలం మెట్టుపల్లిలో జరిగిన ఈ ఘటనలో గాయపడ్డ వారిని ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనలో బాకారపు ఉమ అనే మహిళ తీవ్రంగా గాయపడగా మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందారు. ఈ కారు బీభత్సంతో గ్రామంలో దాదాపు 20 కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన వడ్డెర కార్మికుడు గుండెపోటుతో మృతి చెందాడు. కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన దుండగుల కనకయ్య(50) అనే కార్మికుడు బావుసాయి పేట గ్రామ శివారులో బండలు కొట్టడానికి వెళ్ళాడు. ఆ క్రమంలో ఛాతిలో నొప్పి రావడంతో సిరిసిల్లలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య కనకవ్వ, ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.
2005 నుంచి దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిపై పలు జిల్లాల్లో 36 కేసులు నమోదయ్యాయని ఏసీపీ గజ్జి కృష్ణ తెలిపారు. ఏసీపీ వివరాలిలా.. భూపాలపల్లి(D) మల్హర్‌రావు(M) రెడ్డిపల్లెకు చెందిన బోరిగం సంపత్ జల్సాలకు అలవాటు పడి చోరీలు చేస్తున్నాడు. ఇటీవల పెద్దపల్లి(D) కాల్వ శ్రీరాంపూర్(M) చిన్నరాతులపల్లిలో శాంతమ్మ ఇంట్లో బంగారం అపహరించగా, విచారణ జరిపి, అతని వద్ద నుంచి రూ.15.47 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు.
మంథని మండలం బిట్టుపల్లి గ్రామ మూల మలుపు వద్ద రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందారు. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి చెట్టును ఢీకొట్టారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందా మరొకరికి గాయాలయ్యాయి. మృతిని పేరు ఉదయ్‌గా గుర్తించారు. గాయాలైన వ్యక్తిని అంబులెన్స్‌లో మంథని హాస్పిటల్‌కి తరలించారు. హైదరాబాద్ (గచ్చిబౌలి) నుంచి రెండు బైక్‌లపై నలుగురు యువకులు ఖమ్మంపల్లిలో స్నేహితుని వివాహానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
కరీంనగర్ పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయిందని BRS ఎమ్మెల్సీ కవిత అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు బీసీయేతర అభ్యర్థులను బరిలోకి దింపాయని, పార్టీలపరంగా, సిద్ధాంతపరంగా ఓట్లు చీలాయన్నారు. కాబట్టి పోటీలో ఉన్న బీసీ అభ్యర్థి హరికృష్ణ గెలవలేదని ఆమె అన్నారు. బీసీ రిజర్వేషన్లు ఉంటే ఆ స్థానంలో కచ్చితంగా అన్ని పార్టీలు బీసీకే టికెట్ ఇచ్చేవని వ్యాఖ్యానించారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఉండాలన్నారు.
KNR-ADB-NZB-MDK పట్టభద్రుల MLC ఎన్నికల్లో BJP అభ్యర్థి అంజిరెడ్డి 5,106 ఓట్ల మెజార్టీతో గెలవగా ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. 2వ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి, 3వ స్థానంలో BSPఅభ్యర్థి ప్రసన్న హరికృష్ణ నిలిచారు. ఎలా ఓడిపోయామని అటు నరేందర్ రెడ్డి, ఇటు హరికృష్ణ శ్రేణులతో సమాలోచనలు చేస్తున్నారు. చెల్లని ఓట్లు 28,686 రాగా తమ ఓటమికి ఇదే ప్రధాన కారణమని ఆ పార్టీలు నేతలంటున్నారు.
Sorry, no posts matched your criteria.