Karimnagar

News October 16, 2024

నేడు కాళేశ్వరంలో కోజా గిరి పౌర్ణమి వేడుకలు

image

కాళేశ్వరంలోని కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం కోజా గిరి పౌర్ణమి సందర్భంగా ఆలయంలో రాత్రి 9 గం.ల నుంచి 11 గం.ల వరకు భజన ఉంటుందని ఈవో తెలిపారు. 11.30 గంటలకు కౌముది పూజ (పాలలో చంద్రుని) దర్శన కార్యక్రమం, అనంతరం తీర్థప్రసాద వితరణ నిర్వహించనునట్లు చెప్పారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

News October 16, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ కోరుట్లలో యువకుడి దారుణ హత్య. @ గొల్లపల్లి మండలంలో తండ్రిని హత్య చేసిన తనయుడికి జీవిత ఖైదు. @ ఎల్లారెడ్డిపేట మండలంలో కారు, బైకు డీ.. ఒకరికి తీవ్ర గాయాలు. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో డీఎస్సీ సెలెక్టెడ్ అభ్యర్థులకు పాఠశాలల కేటాయింపు. @ రాయికల్ మండలంలో ఎస్సీ, ఎస్టీ కేసుపై డీఎస్పిీ విచారణ. @ బీజేపీలో చేరిన మెట్ పల్లి వైద్యుడు ముత్యాల వెంకటరెడ్డి.

News October 15, 2024

కరీంనగర్: 1,36,781 విద్యార్థులకు రాగి జావ

image

దసరా సెలవుల అనంతరం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పాఠశాలల్లో విద్యార్థులకు రాగి జావ అందించారు. సెలవుల అనంతరం ప్రభుత్వ పాఠశాలలో జావ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 1,36,781 మంది విద్యార్థులకు పంపిణీ చేశారు. కాగా పిల్లలకు పోషకాహారం అందించేందుకు అమలు చేస్తున్న పీఎం పోషణ్ కార్యక్రమంలో భాగంగా రాగి జావ అందిస్తున్నారు.

News October 15, 2024

దసరా.. కరీంనగర్ జిల్లాలో రూ.166 కోట్ల మద్యం తాగేశారు!

image

KNR జిల్లా వ్యాప్తంగా దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.166 కోట్ల మద్యం విక్రయించినట్లు అధికారులు తెలిపారు. గతేడాది రూ.139 కోట్ల మద్యం విక్రయించినట్లు పేర్కొన్నారు. KNR జిల్లాలో రూ.46 కోట్లు, PDPL రూ.39 కోట్లు, JGTL రూ.41 కోట్లు, SRCL జిల్లాలో రూ.34 కోట్ల మద్యం వ్యాపారం జరిగిందన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ.27 కోట్ల వ్యాపారం అధికంగా జరిగినట్లు పేర్కొన్నారు.

News October 15, 2024

జగిత్యాల: అర్దరాత్రి దారుణ హత్య

image

జగిత్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కోరుట్ల పట్టణంలో యువకుడు హత్యకు గురయ్యాడు. స్థానికుల ప్రకారం.. పట్టణంలోని ప్రకాశం రోడ్డుకు చెందిన బోయిని సాగర్(33) అనే యువకుడిపై సోమవారం అర్దరాత్రి దుండగులు కత్తితో దాడి చేశారు. తీవ్ర గాయాలైన సాగర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి సీఐ సురేశ్ బాబు, ఎస్సై శ్రీకాంత్ చేరుకొని హత్యకు గల కారణాలపై విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News October 15, 2024

KNR: మంత్రగాళ్లు జాగ్రత్త.. కట్లకుంటలో వెలిసిన పోస్టర్

image

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని కట్లకుంట గ్రామంలో మంత్రగాళ్లను హెచ్చరిస్తూ ఓ పోస్టర్ సంచలనం సృష్టిస్తోంది. గ్రామ కూడలిలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్ అతికించారు. తమ సంస్థకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఒక్కొక్కరిని చంపబోతున్నామని, ముందుగా గచ్చునూతి వద్ద గల ఇద్దరితో మొదలుపెట్టి ఇతర వీధుల్లో ఉన్నవారిని హతమార్చుతామని హెచ్చరించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్‌గా మారింది.

News October 14, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సోమవారం రూ.1,23,033 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.67,998, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.40,890, అన్నదానం రూ.14,145 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.

News October 14, 2024

రాయికల్ మండల వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

image

జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని పలు గ్రామాల్లో నేడు ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు జరిగాయి. తొమ్మిది రోజులు వివిధ రూపాల్లో బతుకమ్మను కొలిచి ఆడి పాడి నేడు మహిళలు, యువతులు తీరొక్క పూలతో చేసిన బతుకమ్మలను పేర్చి వాటి చుట్టూ తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడుతూ సందడి చేశారు. బతుకమ్మ పాటలకు అనుగుణంగా నృత్యాలు చేశారు. అనంతరం వాటిని డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకెళ్లి వాగులు, చెరువులలో నిమజ్జనం చేశారు.

News October 14, 2024

కరీంనగర్: ముమ్మరంగా రేషన్ కార్డుల సవరణ!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అధికారులు రేషన్ కార్డులలో లోపాలను సవరిస్తున్నారు. అనర్హులను తొలగించేందుకు చేపట్టిన ప్రక్రియ వేగంగా సాగుతోంది. మరణించినవారు, వివాహమై అత్తింటికి వెళ్లిన మహిళలు తదితరులను తొలగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో గత 9 నెలల వ్యవధిలోనే 1,186 రేషన్ కార్డులను రద్దు చేసి 5,819 మంది లబ్ధిదారుల పేర్లు తొలగించారు.

News October 14, 2024

తప్పనిసరిగా చేతులను శుభ్రంగా కడుక్కోవాలి: KNR కలెక్టర్

image

ప్రతినిత్యం తప్పనిసరిగా చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని, తద్వారా చేతుల అపరిశుభ్రత వల్ల వచ్చే అనేక వ్యాధులను దూరం చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ పమేల సత్పతి సూచించారు. అక్టోబర్ 15న ప్రపంచ చేతుల శుభ్రత దినోత్సవం సందర్భంగా యూనిసెఫ్ ఆధ్వర్యంలో రూపొందించిన ‘బ్యానర్’ను ఆమె ఆవిష్కరించారు. ‘ఆరోగ్య భద్రత’ అంశాన్ని విస్తృత ప్రచారం చేయాలని అన్ని శాఖల అధికారులకు సూచించారు.