India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గోదావరిఖని పవర్ హౌస్‌కాలనీకి చెందిన చుంచు ప్రత్యూష(26) ఆత్మహత్య చేసుకుంది. PG పూర్తిచేసిన ప్రత్యూష కొద్ది రోజులుగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. అయితే, ఇటీవల వెలువడ్డ గ్రూప్స్ ఫలితాల్లో ఉద్యోగం సాధించలేకపోవడంతో మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో బుధవారం ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. యువతి తండ్రి విఠల్ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ భూమేష్ తెలిపారు.
కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈనెల 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఓపెన్ ఇంటర్, ఎస్ఎస్సీ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సిహెచ్ విఎస్ జనార్దన్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. 26 ఏప్రిల్ నుంచి మే 5వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణ మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం ఐదున్నర వరకు ఉంటుందని పేర్కొన్నారు.
సన్నబియ్యం పంపిణీపై ప్రజల నుంచి మంచి స్పందన ఉందని, ప్రజలందరూ సంతోషంగా సన్నబియ్యం తీసుకుంటున్నారని కరీంనగర్ జిల్లా పౌరసరఫరాల అధికారి గట్టు నరసింగ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలను ఆందోళనకు గురిచేసి సమాజంలో అశాంతి సృష్టించాలనే దురుద్దేశంతో కొంతమంది సన్నబియ్యం ప్లాస్టిక్ అని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారని తెలిపారు. సంబంధిత సామాజిక మాధ్యమాల అకౌంట్ హోల్డర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అదేవిధంగా ఉమ్మడి KNR జిల్లా వ్యాప్తంగా ఎన్నో పర్యాటక ప్రదేశాలున్నాయి. రామగిరి ఖిల్లా, JGTL ఖిల్లా, ధూళికట్ట బౌద్ద స్తూపం, మానేర్ డ్యామ్, ఎలంగందుల ఖిల్లా, జింకలపార్కు, నగునూరు కోట, KNR కేబుల్ బ్రిడ్జి, పురావస్తు ప్రదర్శనశాల, నాగులపేట సైఫన్, మొలంగూరు ఖిల్లా, ఉజ్వలపార్కు, డీర్ పార్కు నాంపల్లి, అలాగే గోదావరినదిపై కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, రామగుండంలోని రాముని గుండాలు సందర్శకులకు చూడదగినవి.
ఏప్రిల్, మే నెలలో వేసవి సెలవుల్లో సందర్శించడానికి ఉమ్మడి KNR జిల్లాలో సుందరమైన <<16117241>>పర్యాటక<<>> ప్రాంతాలు, ఆలయాలు అందుబాటులో ఉన్నాయి. వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, ఇల్లందకుంట రామాలయం, ఓదెల మల్లికార్జనస్వామి, నాంపల్లి నరసింహస్వామి, కాళేశ్వరం, కోటి లింగాల, కొత్తకొండ వీరభధ్రస్వామి, పెంబట్ల దుబ్బ రాజేశ్వరస్వామి, రాయికల్‌లోని కేశవనాథ పంచముఖ లింగేశ్వర త్రికూట ఆలయాలు ఉన్నాయి.
జమ్మికుంట పట్టణానికి చెందిన 9వ తరగతి చదువుతున్న జోయల్ మెక్‌కు గిన్నిస్ బుక్‌లో అరుదైన గౌరవం దక్కింది. డిసెంబర్ 1, 2024లో పియానో వాయించే పోటీల్లో పాల్గొని ప్రపంచ స్థాయిలో మ్యూజిక్ ప్రదర్శనలు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో స్థానం పొందాడు. కీబోర్డ్ సంగీత కళాకారుల బృందం గంటలో 1046 వీడియోలు అప్లోడ్ చేసి స్థానం సాధించారు. జోయల్ మెక్‌ను స్కూల్ కరస్పాండెంట్ సునీల్ కుమార్, తల్లిదండ్రులు అభినందించారు.
వేసవి సెలవుల దృష్ట్యా ఇంటికి తాళం వేసి వెళ్లేవారు, అలాగే బస్సుల్లో ప్రయాణించేవారు అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ సీపీ గౌస్ ఆలం ఐపీఎస్ తెలిపారు. ఊరెళ్లేవారు ఇంట్లోని బంగారు ఆభరణాలు, నగదును బ్యాంక్ లాకర్‌లో భద్రపరుచుకోవాలని లేదా సురక్షితంగా తమ వెంట దాచుకోవాలని సూచించారు. ఊరికి వెళ్లే ముందు చుట్టుపక్కల నమ్మకస్తులకు, స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలన్నారు.
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. రామడుగు మండల కేంద్రంలోని తాటి వనం వద్ద మోచ భూమయ్య మంగళవారం రాత్రి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
కరీంనగర్ జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా గంగాధర, చిగురుమామిడి, రామడుగు మండలాల్లో 42.2°C నమోదు కాగా, శంకరపట్నం 41.8, గన్నేరువరం 41.7, జమ్మికుంట 41.4, మానకొండూర్ 40.9, కరీంనగర్ రూరల్, చొప్పదండి 40.7, తిమ్మాపూర్ 40.4, వీణవంక 40.3, కరీంనగర్ 40.2, హుజూరాబాద్ 40.0, కొత్తపల్లి 39.9, సైదాపూర్ 39.6, ఇల్లందకుంట 39.1°C గా నమోదైంది.
బతుకుదెరువు కోసం గల్ఫ్‌కి వెళ్లిన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. శుక్రవారం దుబాయ్‌లో జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేట చెందిన స్వర్గం శ్రీనివాస్ చంద్రయ్య పాకిస్తానీ చేతిలో హత్యకు గురయ్యాడు. శ్రీనివాస్‌కు భార్య, పిల్లలు ఉన్నారు. కుటుంబ పోషణ కోసం గల్ఫ్ వెళ్లిన శ్రీనివాస్ ఇలా హత్యకు గురవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Sorry, no posts matched your criteria.