India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మంత్రి పొన్నం ప్రభాకర్‌పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కరీంనగర్ వన్ టౌన్ పోలీసులకు యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ కాంగ్రెస్ నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చనిపోయారని సోషల్ మీడియాలో పెట్టి దుష్ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్కు చెందిన గీతారెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఖరీఫ్ 2025-26 సీజన్లో జిల్లా వ్యాప్తంగా 325 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు సివిల్ సప్లై కార్పొరేషన్ మేనేజర్ నర్సింగరావు ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ ఏజెన్సీల ద్వారా ఈసారి సుమారు 30 లక్షల క్వింటాళ్ల వరిధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశముందని అంచనా వేశామని ఆయన పేర్కొన్నారు. అందుకు తగ్గట్లు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు నర్సింగరావు చెప్పారు.

కరీంనగర్ జిల్లా కేంద్రంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బాలికలు సానుభూతితో కాకుండా పట్టుదల, నైపుణ్యంతో విజయం సాధించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవ కార్యక్రమం బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించారు. కష్టపడి చదివితేనే విజయం సాధించవచ్చన్నారు. బాలికలు వివిధ రంగాల్లో నైపుణ్యం సాధించి ధైర్యంగా ముందడుగు వేయాలని కలెక్టర్ కోరారు.

తల్లిదండ్రులు లేని అనాథగా మిగిలాడు చొప్పదండి మండలం రాగంపేటకు చెందిన దీకొండ స్వాద్విన్ కుమార్. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న బాలుడి తల్లి మూడేళ్ల క్రితం ఊపిరితిత్తుల వ్యాధితో మరణించగా తండ్రి ఆదివారం గుండెపోటుతో దూరమయ్యాడు. ఈ క్రమంలో బాలుడి దయనీయ స్థితిని చూసిన రాగంపేట గ్రామస్థులు కంటతడి పెడుతూ.. ప్రభుత్వం, స్వచ్ఛంద సేవా సంస్థలు అతడిని చేరదీసి చదివించాలని కోరుతున్నారు.

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు కరీంనగర్ సీపీ గౌష్ ఆలం తెలిపారు. రాష్ట్ర DGP ఆదేశాల మేరకు విధి నిర్వహణలో ప్రాణాలను త్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సేవలను, త్యాగాలను స్మరించుకుంటూ ఈనెల 20 నుంచి 31 వరకు ‘పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల’ను ఘనంగా నిర్వహించనున్నట్లు సీపీ పేర్కొన్నారు.

ధాన్యం కొనుగోళ్లపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఇతర శాఖల ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ పమెలా సత్పతితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ వానాకాలంలో 2.75 లక్షల ఎకరాల్లో వరి సాగు అయిందని, 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడిని అంచనా వేస్తున్నామని తెలిపారు. 325 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు.

గుండెపోటు సమయంలో అవలంబించవలసిన CPR(కార్డియో పల్మనరీ రెసీసీకేషన్) పద్ధతిపై ప్రతిఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఈనెల 13 నుంచి 17 వరకు CPR అవగాహన వారోత్సవాల సందర్భంగా KNR ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్య సిబ్బందికి సీపీఆర్‌పై శిక్షణ నిర్వహిస్తున్నారు. బుధవారం కలెక్టర్ హాజరై మాట్లాడారు. గుండెపోటు సంభవించిన సమయంలో మొదటి కొన్ని గోల్డెన్ సెకండ్లు వృథా చేయవద్దన్నారు.

KNR కలెక్టరేట్ ముందు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీ.ఆర్.గవాయ్‌పై బూటు విసిరిన ఘటనకు నిరసనగా అంబేద్కర్ వాదులు దీక్ష చేపట్టారు. తలారి సుధాకర్, కునమల్ల చంద్రయ్య సహా పలువురు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. సుప్రీం కోర్టులో రాకేశ్ కిషోర్ చేసిన ఈ చర్యను వారు తీవ్రంగా ఖండించారు. న్యాయవ్యవస్థ గౌరవాన్ని కాపాడాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు

135 రోజుల తర్వాత కూడా తన ఫిర్యాదుపై తుది నివేదిక ఇవ్వకపోవడంతో బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. 2024 డిసెంబర్ 23న ప్రజావాణిలో ఫేక్ సర్టిఫికెట్తో జాబ్ చేస్తున్నాడని వీఆర్ఏపై ఫిర్యాదు చేసిన బాధితుడికి, కలెక్టర్ 2025 ఏప్రిల్ 25న హుజురాబాద్ ఆర్డిఓను 15రోజులలో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఆర్డీఓ మూడు సార్లు నోటీసులు జారీ చేసి, సెప్టెంబర్ 12న విచారణ పూర్తి చేసిన తుది నివేదిక అందించలేదని వాపోయాడు.

స్థానిక ప్రభుత్వ మహిళా కళాశాలలో ప్రిన్సిపల్ డా.వరలక్ష్మి అధ్యక్షతన భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న నషాముక్త్ భారత్, కుశాల్ భారత్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం అందరూ కృషి చేయాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో NSS ప్రోగ్రాం ఆఫీసర్లు డా.మొగిలి, డా.లక్ష్మణరావు, పెద్ది స్వరూప, డా.స్రవంతి, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.