India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపల్ పరిధిలోని లక్ష్మీ నరసింహ ఆన్‌లైన్ సెంటర్ యజమాని దసరా పండుగను పురస్కరించుకుని వెరైటీ లక్కీ డ్రా ఏర్పాటు చేశాడు. రూ.50 చెల్లించి టోకెన్ తీసుకోవాలని, లక్కీ డ్రా అక్టోబర్ 12న ఉ.9 గంటలకు తీయనున్నట్లు తెలిపారు. ఇందులో మొదటి బహుమతి మేకపోతు, రెండవ బహుమతి కింగ్‌ఫిషర్ బీర్ కాటన్, మూడో బహుమతి కోడిపుంజు అని ఐదు బహుమతులు ఏర్పాటు చేశారు. ఈ ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి మూలమలుపు వద్ద ఓ డీసీఎం వ్యాను టైర్లు ఊడిపోగా.. పెను ప్రమాదం తప్పింది. కామారెడ్డికి చెందిన ఆయిల్ లోడుతో వ్యాన్ జగిత్యాలకు వెళుతోంది. రాగట్లపల్లి మూలమలుపు వద్దకు రాగానే డివైడర్‌కు తగిలిన డీసీఎం వ్యాన్ వెనుక టైర్లు ఊడిపోయి ఓ వైపు ఒరగడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ అప్రమత్తతో డీసీఎం వేగాన్ని అదుపు చేసి చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.
మానకొండూర్ ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు తిమ్మాపూర్ మండలం పోరండ్లలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ చింతల లక్ష్మారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. వారితో పాటు ఉపాధ్యాక్షుడు నీలం సుదర్శన్, నాయకులు గొల్ల లక్ష్మణ్, గడ్డం రమేష్, బొజ్జ పర్శయ్య తదితరులున్నారు.
మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు గత ప్రభుత్వం అమలు చేసిన ఉచిత చేపల పంపిణీ కరీంనగర్ జిల్లాలో ఇప్పటి వరకు జరగకపోవడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. వానాకాలం పూర్తి అవుతున్నప్పటికీ చేప పిల్లల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో అయోమయంలో పడ్డారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 13,456 హెక్టార్లలో 1,008 చెరువులు, కుంటలు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి.
రామగుండంలోని NTPC విద్యుత్ పరిశ్రమకు 2024కు గాను ఎకనామిక్ టైమ్స్ ఎనర్జీ లీడర్షిప్‌కు సంబంధించిన రెండు అవార్డులు దక్కాయి. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ మాజీ పవర్ కార్యదర్శి అనిల్ రజ్దాన్ చేతుల మీదుగా సంస్థ ED కేదార్ రంజన్ పాండు అవార్డును అందుకున్నారు. అంతే కాకుండా పవర్ విభాగంలో ఎనర్జీ కంపెనీ అవార్డును సాధించింది. ఈ సందర్భంగా అధికారులు హర్షం వ్యక్తం చేశారు.
కరీంనగర్ జిల్లాలో రుణమాఫీ కాని రైతులు ఆందోళన చెందుతున్నారు. రూ.2 లక్షల లోపు రుణం తీసుకొని పలు కారణాలతో మాఫీ కాని రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అధికారులేమో సరైన సమాధానం ఇవ్వడం లేదని వాపోతున్నారు. కాగా అర్హులను గుర్తించేందుకు చేపట్టిన సర్వేలో భాగంగా ఇప్పటివరకు 12 వేలకు పైగా రైతు కుటుంబ సభ్యుల నిర్ధారణ పూర్తయినట్లు జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మి తెలిపారు.
జిల్లాలోని అన్ని విద్యార్థి వసతి గృహాలను హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. SC, ST, BC, మైనారిటీ, సోషల్ వెల్ఫేర్ హాస్టల్ అధికారులు, మండల విద్యాధికారులతో కలెక్టరేట్‌లో ఆమె సమావేశమయ్యారు. హాస్టల్‌లో రాత్రి నిద్ర చేయాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. మండల విద్యాధికారులు, మండల ప్రత్యేక అధికారులు హాస్టళ్ళను సందర్శించాలన్నారు.
మహాత్మ జ్యోతిరావు పులే ప్రజాభవన్‌లో రేపు గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల కోసం “ప్రవాసి ప్రజావాణి” కి ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ తెలిపారు. గల్ఫ్ సమస్యలు ఏమున్నా పరిష్కారం కోసం ప్రవాసి ప్రజావాణి ప్రత్యేక కౌంటర్‌ను ఉపయోగించుకోవాలన్నారు. జ్యోతిరావు పూలే భవన్లో ప్రతి బుధ, శుక్రవారంలో ప్రవాసి ప్రజావాణి కౌంటర్ ఉంటుందని పేర్కొన్నారు.
తను రాజకీయ నాయకుడిగా రాలేదని, ఊరి మనవడిగా వచ్చానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామంలో గురువారం తన అమ్మమ్మ-తాతయ్య జోగినిపల్లి లక్ష్మీబాయి-కేశవరావు స్మారకార్థం సొంత ఖర్చులతో నిర్మించిన ప్రాథమిక పాఠశాలను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. తన అనుబంధాన్ని పాత జ్ఞాపకాలను గుర్తు చేశారు.
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం జ్వలించిన నిప్పుకణిక ఐలమ్మ అని కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి నివాళులర్పించారు. తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత..
తెలంగాణ తెగువకు చిరునామాగా నిలిచిన వీర వనిత అన్నారు. మహిళా లోకానికి స్ఫూర్తి ప్రదాత, సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ అని కొనియాడారు.
Sorry, no posts matched your criteria.