India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరికొద్ది రోజుల్లో దసరా పండుగ సందడి మొదలు కానుంది. ఏటా దసరా పండుగకు మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వ్యాపారులు మద్యం వ్యాపార లక్ష్యం ముందుగానే నిర్దేశించారు. ఉమ్మడి జిల్లా మద్యం వ్యాపార లక్ష్యం రూ.165 కోట్లుగా నిర్దేశించారు. కాగా, అక్టోబరు 12న దసరా పండుగ జరగనుంది.
కరీంనగర్ నగరంలోని మంకమ్మతోటకు చెందిన 9వ తరగతి విద్యార్థులు గొప్ప మనసు చాటుకున్నారు. పుప్పాల రిషికేష్, గంగిపల్లి రక్షిత్, నేరేడుకొమ్మ చంద్ర సాయి, కోతిరెడ్డి అనిరుధ్‌రెడ్డి మిత్రులు కలిసి కాలనీలో మొదటిసారి వినాయకుడిని ప్రతిష్ఠించారు. 9 రోజులు భక్తి శ్రద్ధలతో పూజించి, నిమజ్జనం చేశారు. అయితే చందా ద్వారా వచ్చిన డబ్బులు మిగిలాయి. వాటితో 32 మంది పేద విద్యార్థులకు స్టేషనరీ పంపిణీ చేశారు.
జవహర్ నవోదయ విద్యాలయంలో ప్రవేశాల దరఖాస్తు గడువు అక్టోబర్ 7 వరకు పొడిగించినట్టు చొప్పదండి నవోదయ పాఠశాల ప్రిన్సిపల్ మంగతాయారు తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదే విధంగా 8, 9వ తేదీల్లో దరఖాస్తుదారులు మార్పులు, చేర్పులు చేసుకునేందుకు అవకాశం ఉన్నట్లు చెప్పారు.
కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో రానున్న 5 రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు జగిత్యాల పరిశోధన స్థానం సహ పరిశోధన డైరెక్టర్ డా.శ్రీనివాస్ తెలిపారు. 22-24 డిగ్రీల కనిష్ఠ, 33-34 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. ముఖ్యంగా రైతులు, ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండొద్దన్నారు.
కరీంనగర్ SU పీజీ ఫలితాలు విడుదలయ్యాయి. జులై, ఆగస్టులో నిర్వహించిన ఇంగ్లిష్, ఉర్దూ, తెలుగు, ఎకనామిక్స్, సోషియాలజీ, ఎంఎస్‌డబ్ల్యూ, బాటనీ, జువాలజీ తదితర విభాగాల్లో 2, 4వ సెమిస్టర్ ఫలితాలు రిలీజ్ చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డా.శ్రీరంగప్రసాద్ తెలిపారు. https://satavahana.ac.in/ ఫలితాలు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు.
@ హుజురాబాద్ మండలంలో పిడుగుపాటుతో పశువుల కాపరి మృతి. @ ఎల్లారెడ్డిపేట మండలంలో బస్సు దిగుతుండగా గుండెపోటుతో వ్యక్తి మృతి. @ సైదాపూర్ మండలంలో 18 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత. @ గొల్లపల్లి మండలంలో అంగన్వాడి కేంద్రమును, కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్. @ మల్యాల మండలంలో రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు. @ జాతీయస్థాయి ట్రెక్కింగ్ శిబిరానికి ఎంపికైన జగిత్యాల విద్యార్థిని.
ఓటర్ నమోదు కార్యక్రమం కట్టుదిట్టంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. ఇంటింటి సర్వేలో ఆధార్ నంబర్ సేకరణ తప్పనిసరి కాదని, ఓటర్లు ఇష్టం ఉంటే ఇవ్వవచ్చన్నారు. సెప్టెంబర్ 28 నాటికి ఇంటింటి సర్వే వంద శాంతం పూర్తి చేయాలని సూచించారు. కాన్ఫరెన్స్‌లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లు తదితరులున్నారు.
సింగరేణి సంస్థ లాభాల జోష్‌లో ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో అధిక లాభాలు సాధించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించగా.. రూ.2,388.50 కోట్ల లాభాలు సాధించింది. అయితే, గతంలో కన్నా ఈసారి 1 శాతం పెంచి 33 శాతం కార్మికుల వాటాగా చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో పాటు దసరా బోనస్ కూడా ప్రకటించడంతో గోదావరిఖని కార్మికుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.
కరీంనగర్ జిల్లాలో శిశు మరణాలు విపరీతంగా పెరుగుతున్నాయి. గర్భిణులకు పౌష్టికాహారంపై అవగాహన లోపమే కారణమని వైద్యులు చెబుతున్నారు. జిల్లాలో రెండేళ్లలో 519 మంది శిశువులు మరణించారు. గర్భిణులు 9 నెలల పాటు పౌష్టికాహారం తీసుకుంటూ, ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే వైద్యులు సమయపాలన పాటించకపోవడంతో కొన్ని చోట్ల ఇబ్బందులు వస్తున్నాయనే ఆరోపణలున్నాయి.
కన్న కూతురి కష్టాలను తట్టుకోలేక ఓ తండ్రి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. రాచర్ల బొప్పాపూర్‌కు చెందిన శ్రీనివాస్(50) కూతురు రమ్యను 11 ఏళ్లక్రితం సిరిసిల్ల రాజునగర్‌కు చెందిన శ్రీకాంత్‌తో పెళ్లి చేశాడు. తన కూతురిని అల్లుడు చిత్ర హింసలు పెడుతున్నాడని తీవ్ర మనస్తాపానికి గురై వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
Sorry, no posts matched your criteria.