Karimnagar

News February 6, 2025

కరీంనగర్‌లో రేపు జాబ్ మేళా..!

image

కరీంనగర్‌లోని స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల(ఆటానమస్)లో శుక్రవారం జాబ్ మేళా జరగనుందని ప్రిన్సిపల్ ప్రొ.డీ.వరలక్ష్మీ తెలిపారు. ఈ ఉద్యోగ మేళా ఉదయం 9గంటలకు ప్రారంభమవుతుందని.. ఈ అవకాశాన్ని స్థానికంగా ఉండే ప్రతి నిరుద్యోగి సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ జాబ్ డ్రైవ్‌లో పలు ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని చెప్పారు. ఇంటర్వ్యూకి అవసరమయ్యే అన్ని డాక్యుమెంట్స్‌ను వెంట తెచ్చుకోవాలన్నారు.

News February 5, 2025

KNR: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఒక నామినేషన్

image

మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బుధవారం ఒక నామినేషన్ దాఖలు అయింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం దేవునిగూడకు చెందిన గవ్వల శ్రీకాంత్ నామినేషన్ వేశారు. మొత్తంగా 05.02.2025 వరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి నలుగురు, గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ స్థానానికి 9 మంది నామినేషన్ వేశారు.

News February 5, 2025

KNR: బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డికి బీ ఫాం అందజేత

image

కరీంనగర్, NZBD, ADLBD, MDK పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డికి బీఫాంను బుధవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అందజేశారు. తనపై పార్టీ నమ్మకంతో టికెట్ ఇచ్చినందుకు బీజేపీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అంజిరెడ్డి తరఫున బీ ఫాంను ఆయన కుమార్తె తీసుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

News February 5, 2025

కరీంనగర్: జర్నలిస్టుల టీయూడబ్ల్యూజే-ఐజేయూ జిల్లా శాఖ 2025 డైరీ ఆవిష్కరణ

image

తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం టీయూడబ్ల్యూజే (ఐజేయూ) కరీంనగర్ జిల్లా శాఖ ముద్రించిన 2025 డైరీని స్థానిక యూనియన్ కార్యాలయం ప్రెస్ భవన్ లో ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యులు నగునూరి శేఖర్ ఆవిష్కరించారు. జిల్లా శాఖ అధ్యక్ష, కార్యదర్శులు గాండ్ల శ్రీనివాస్ కొయ్యడ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. అందరికీ ఉపయోగపడే విధంగా డైరీని ముద్రించామని తెలిపారు.

News February 5, 2025

రామడుగు: పోలీస్ స్టేషన్‌లో తీన్మార్ మల్లన్న‌పై ఫిర్యాదు

image

తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ గత కొద్ది రోజుల క్రితం రెడ్డిలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బుధవారం రామడుగు మండలంలోని గోపాల్ రావు పేట వీరాంజనేయ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ రెడ్డి, రెడ్డి సంఘం సభ్యులు పాల్గొన్నారు.

News February 5, 2025

జగిత్యాల: శ్వేత యాక్సిడెంట్ ఘటన.. అమ్మ కోసం 100 కిలోమీటర్లు!

image

చిల్వకోడూరు వద్ద నిన్న కారు, బైక్‌ను ఢీకొన్న ఘటనలో SIశ్వేతతోపాటు <<15356623>>బ్యాంకు ఉద్యోగి నరేశ్(28)<<>> చనిపోయిన విషయం తెలిసిందే. కాగా నరేశ్‌ది నిరుపేద కుటుంబం. అతడి అన్న ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లగా అనారోగ్యంతో బాధపడుతున్న అమ్మకు తోడుగా నరేశ్ ఉండేందుకు నిత్యం సుమారు 100కిలోమీటర్లు బైక్‌పై ప్రయాణిస్తున్నారు.రోజులానే విధులకు వెళ్లిన కొడుకు విగతజీవిగా రావడంతో ఆ తల్లి బోరున విలపించడం స్థానికులను కంటతడి పెట్టించింది.

News February 5, 2025

సిరిసిల్ల: సీఎం నోట ‘KTR ఆత్మహత్య’.. మీ కామెంట్?

image

అసెంబ్లీలో కాంగ్రెస్, BRS మధ్య రాజకీయం వేడెక్కింది. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయని కొందరు మాట్లాడుతున్నారని, అలాంటివేమీ రావని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘KTR ఏమైనా ఆత్మహత్య చేసుకుంటారా.. సిరిసిల్లకు ఉపఎన్నిక రావడానికి?’ అని అన్నారు. ఉప ఎన్నికలు వస్తాయని KTR చేస్తున్న వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తాము ఎన్నికల కోసం కులగణన చేయలేదని, ప్రజల అభివృద్ధి కోసమే చేశామని స్పష్టం చేశారు.

News February 5, 2025

జగిత్యాల: కానిస్టేబుల్ నుంచి ఎస్ఐగా

image

మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ శ్వేత మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా, 2018లో సిరిసిల్ల జిల్లాలో పోలీసు కానిస్టేబుల్‌గా జీవితం మొదలు పెట్టారు. అనంతరం 2020లో జగిత్యాల జిల్లాలోని పెగడపల్లిలో ఎస్ఐగా పనిచేశారు. అనంతరం కథలాపూర్, వెల్గటూర్, కోరుట్లలో కూడా పనిచేశారు. ప్రస్తుతం డీసీఆర్బీ ఎస్ఐగా ఉన్నారు. ఆమె మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News February 4, 2025

KNR: అధికారుల సెలవు దరఖాస్తుకు ప్రత్యేక పోర్టల్

image

వివిధ ప్రభుత్వ శాఖల్లో అధికారులు, ఉద్యోగుల సెలవు దరఖాస్తు, మంజూరు విధానం ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందించింది. టీం ఇండియా సంస్థ సీఈవో చైతన్య ఆధ్వర్యంలో ఈ లీవ్ మేనేజ్మెంట్ పోర్టల్ సాఫ్ట్‌వేర్ తయారుచేసి మంగళవారం జిల్లా కలెక్టర్‌కు అందించారు. పేపర్‌వర్క్ తగ్గించేందుకు, సెలవు మంజూరులో పారదర్శకతకు ఈ పోర్టల్ రూపొందించినట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు.

News February 4, 2025

జగిత్యాల: SI శ్వేత మృతి బాధాకరం: ఎస్‌పీ

image

JGTL గొల్లపల్లి చిల్వకోడూరు వద్ద కారు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో జగిత్యాల జిల్లా పోలీస్ DCRBలో పనిచేస్తున్న ఎస్ఐ కొక్కుల శ్వేత మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎస్ఐ శ్వేత మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించగా ఆమె కుటుంబ సభ్యులను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎస్ఐ శ్వేత మృతి చాలా బాధాకరమని తెలిపారు. శ్వేత మృతి పట్ల పోలీస్ అధికారులు సంతాపం తెలియజేశారు.

error: Content is protected !!