India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమంలో భాగంగా కొనరావుపేట మండలం మరిమడ్ల గ్రామంలో ఏకలవ్య మోడల్ స్కూల్లో గురువారం స్వచ్ఛ ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఈ గ్యాలరీలో పాఠశాల విద్యార్థులు తయారుచేసిన సింగిల్ యూస్ ప్లాస్టిక్, ప్లాస్టిక్ బాటిల్స్, పేపర్‌తో తయారు చేసిన వస్తువులను ప్రదర్శించారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. స్కూలు ఆవరణలో కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ మొక్క నాటారు.
పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. కొత్తపల్లి గ్రామంలో కలవెని రాజేశం అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కొత్తపల్లి-కొలనూరు మధ్యగల రహదారిపై గురువారం హత్య చేశారు. రాజేశం గతంలో రైల్వే శాఖలో పనిచేసి ఇటీవలే రిటైర్మెంట్ అయినట్లు సమాచారం. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రామగుండం సింగరేణి సంస్థ OCP-5లో ఓవర్ బర్డెన్ వెలికి తీసే ఓ ప్రైవేట్ కంపెనీ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. గత రెండు రోజుల నుంచి భూ నిర్వాసితులకు పటేల్ కంపెనీలో 80% మంది స్థానికులకు ఉపాధి కల్పించాలని ఆందోళన చేపట్టి పనులను నిలిపివేశారు. దీంతో ప్రాజెక్టులో ఓబీ వెలికితీత పనులకు బ్రేక్ పడింది. ఈ సంఘటనపై సింగరేణి యాజమాన్యం స్పందించాలని భూనిర్వాసితులు కోరుతున్నారు.
కోనరావుపేట మండలం మర్రిమడ్ల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సందర్శించారు. గురువారం ఈ సందర్భంగా విద్యార్థులు, టీచర్లతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన భోజనం, బోధనను అందించాలని అధికారులకు సూచించారు. పాఠశాల ఆవరణలో మొక్కను నాటారు.
కరీంనగర్ జిల్లాలోని శాతవాహన యూనివర్సిటీ పరిధిలో నిర్వహించే LLB మూడు, నాలుగో సెమిస్టర్ల సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 25 నుంచి ప్రారంభమవుతున్నట్లు SU పరీక్షల నియంత్రణ అధికారి డా. శ్రీరంగ ప్రసాద్ తెలిపారు. వర్సిటీలోని కామర్స్, బిజినెస్ కళాశాలలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని కోర్టుల్లో ఈ నెల 29న నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్టు డిస్ట్రిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ వెంకటేశ్ తెలిపారు. జిల్లా కోర్టు ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. లోక్ అదాలత్ ద్వారా రాజీ పడదగిన క్రిమినల్, సివిల్, కుటుంబ తగాదాలకు సంబంధించిన కేసులు ఇరువర్గాల సమ్మతితో పరిష్కరించుకోవచ్చని తెలిపారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
@ కోనరావుపేట మండలంలో ఏకలవ్య మోడల్ స్కూల్ ను తనిఖీ చేసిన సిరిసిల్ల కలెక్టర్. @ బీర్పూర్ మండలంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపుల సీజ్. @ ఎల్లారెడ్డిపేట మండలంలో గణేష్ నిమజ్జన ఊరేగింపులో ట్రాక్టర్ కిందపడి యువకుడి మృతి. @ ఇండియన్ ఐకాన్ అవార్డు అందుకున్న కరీంనగర్ జిల్లా వాసి. @ ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ వర్తింపచేయాలని జగిత్యాల కలెక్టర్ కు బిఆర్ఎస్ నాయకులు వినతి.
నిర్దేశించిన గడువులోగా ఖరీఫ్ 2023-24, రబీ సీజన్‌లకు సంబంధించి పెండింగ్ రైస్ డెలివరీని తప్పనిసరిగా పూర్తి చేయాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష మిల్లర్లను ఆదేశించారు. అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్‌తో కలిసి జిల్లాలోని రైస్ మిల్లర్లు, సంభందిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైస్ డెలివరీ ఆలస్యం చేస్తున్న రైస్ మిల్లులను అధికారులు క్షేత్ర స్థాయిలో తనిఖీ చేయాలని సూచించారు.
గంజాయి, మాదక ద్రవ్యాల వినియోగం నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో వర్చువల్ నార్కో సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు మిషన్ పరివర్తన్‌లో భాగంగా గంజాయి, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించాలన్నారు.
సిరిసిల్ల జిల్లాలో పత్తి పంట సాగు చేసిన రైతులు తెల్లబోతున్నారు. ఇటీవల తుఫాను ప్రభావంతో కురిసిన అధిక వర్గాలు పత్తి రైతులను పరేషాన్ చేస్తున్నాయి. భారీ వర్షాలతో పంట దెబ్బతిని దిగుబడిపై ప్రభావం చూపింది. మరోవైపు తెగుళ్లు మొదలు కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆకులకు తెగుళ్లు సోకి ఎర్ర రంగులోకి మారుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. కాగా, జిల్లాలో 49,332 ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు.
Sorry, no posts matched your criteria.