Karimnagar

News September 18, 2024

నేడు జమ్మికుంటకు మహేశ్ గౌడ్‌

image

రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి, హుస్నాబాద్ MLA పొన్నం ప్రభాకర్ హనుమకొండ, జమ్మికుంట పట్టణాల్లో పర్యటించనున్నట్లు తన వ్యక్తిగత సహాయకులు తెలిపారు. టిపిసిసి అధ్యక్షులు మహేశ్ గౌడ్‌తో కలిసి 12 గంటలకు భద్రకాళి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 2 గంటలకు అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించే ధర్నాలో పాల్గొంటారు. 3 గంటలకు సమ్మిరెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు.

News September 18, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మంగళవారం రూ.1,45,150 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,02,082, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.29,750, అన్నదానం రూ.13,318,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.

News September 18, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ కథలాపూర్ మండల కేంద్రంలో నిలిపి ఉన్న బైక్ నుండి లక్ష 68 వేల నగదు చోరీ. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రజా పాలన దినోత్సవం. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విశ్వకర్మ జయంతి. @ జగిత్యాల, కోరుట్ల పట్టణాలలో వైభవంగా కొనసాగుతున్న గణేష్ నిమజ్జన వేడుకలు. @ జగిత్యాల, కోరుట్ల గణేష్ నిమజ్జన వేడుకలను పర్యవేక్షించిన కలెక్టర్ సత్యప్రసాద్.

News September 17, 2024

ప్రజా పాలన దినోత్సవంలో మంత్రి పొన్నం

image

ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, హుస్నాబాద్ MLA పొన్నం ప్రభాకర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి,
సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

News September 17, 2024

KNR: అనుమానాస్పద స్థితిలో సింగరేణి ఉద్యోగి మృతి

image

గోదావరిఖని జీఎం కాలనీ సింగరేణి కార్మికుడు హరినాథ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కుటుంబీకుల వివరాల ప్రకారం.. నెల రోజుల్లో రిటైర్డ్ కానున్న జీడీకే-1 ఇంక్లైన్‌కి చెందిన బానోతు హరినాథ్ సింగ్ తన క్వార్టర్లో మృతి చెందాడు. అయితే మృతుడి మెడపై గాయాలు ఉండటంతో.. అతడు ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఎవరైనా హత్య చేసి ఉంటారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News September 17, 2024

కరీంనగర్ జిల్లాలో కొనసాగుతున్న నిమజ్జనం

image

మానకొండూరు, చింతకుంట కెనాల్, కొత్తపల్లి పెద్ద చెరువులో గణేశ్ నిమజ్జన ఏర్పాట్లు చేయగా, మానకొండూరులో తెల్లవారుజాము వరకు నిమజ్జనం ఉత్సవాలు జరిగాయి. నిన్న మధ్యాహ్నం ప్రారంభమైన వినాయక నిమజ్జనం ఉత్సవాలు.. ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కరీంనగర్ నియోజకవర్గం నుంచి కాకుండా తిమ్మాపూర్ మానకొండూర్, చొప్పదండి నియోజకవర్గాల ప్రతిష్టించిన విగ్రహాలు మానకొండూర్ చెరువులోనే నిమజ్జనం చేశారు.

News September 17, 2024

KNR: ఒకేరోజు పోరులో 11 మంది అమరులయ్యారు!

image

వెట్టిచాకిరి, బానిసత్వానికి నిరసనగా పోరాటం చేసిన కమ్యూనిస్టు యోధుడు బద్దం ఎల్లారెడ్డి SRCL జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపెల్లివాసి. ఈ పోరులో గ్రామానికి చెందిన 11 మంది ఒకేరోజు అమరులయ్యారు. వీరి పేర్లతో గాలిపెల్లిలో శిలాఫలకం కూడా ఏర్పాటు చేశారు. 1951లో జరిగిన తొలి ఎన్నికల్లో KNR పార్లమెంట స్థానం నుంచి ఎల్లారెడ్డి విజయం సాధించారు. 1958లో బుగ్గారం, 1972లో ఇందుర్తి నుంచి MLA అయ్యారు. 1979లో మరణించారు.

News September 17, 2024

నిమజ్జన ప్రాంతాలను పర్యవేక్షించిన KNR కలెక్టర్

image

మానకొండూర్, కొత్తపల్లి, చింతకుంటలో గణేశ్ నిమజ్జన ప్రాంతాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సోమవారం రాత్రి పరిశీలించారు. ఇప్పటివరకు నిమజ్జనం అయిన విగ్రహాల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. వైద్య శిబిరం, సీసీ కెమెరాలను పరిశీలించారు. నిమజ్జనం ప్రశాంతంగా జరగడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమం పూర్తయ్యే వరకు అధికారులు క్షేత్రస్థాయిలోనే ఉండాలని ఆదేశించారు.

News September 17, 2024

కరీంనగర్‌లో జాతీయ జెండా ఆవిష్కరించనున్న మంత్రి

image

తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా కరీంనగర్‌లో మంత్రి శ్రీధర్ బాబు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. నేడు ఉదయం 10 గంటలకు జరిగే ఈ వేడుకలకు పోలీస్ పరేడ్ గ్రౌండ్ సిద్ధమైంది. ముందుగా అమరవీరుల స్తూపం వద్ద మంత్రి నివాళులు అర్పించి తర్వాత జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

News September 17, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సోమవారం రూ.1,53,203 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్ల అమ్మకం ద్వారా రూ.78,346, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.50,200, అన్నదానం రూ.24,657,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేశారు.