Karimnagar

News August 11, 2024

మెట్‌పల్లి: గురుకులంలో బయటపడుతున్న పాములు

image

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల ఆవరణలో ముళ్లపొదలు, శిథిల భవనాలను కూల్చివేయడం, మురికి కుంటను పూడ్చే క్రమంలో పాములు బయటకు వస్తున్నాయి. శనివారం కొన్ని పాములు బయటకు రాగా అందులో నాలుగింటిని చంపేశారు. ఇంకా పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని బయటపడే అవకాశం ఉందంటున్నారు. ఇలా పాములు కనిపిస్తుండటంతో విద్యార్థులు పాము కాటుతోనే ప్రమాదానికి గురయ్యారని భావిస్తున్నారు.

News August 11, 2024

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి 3,583 క్యూసెక్కుల వరద నీరు

image

ఎగువ కురుస్తున్న వర్షాలకు శ్రీరామ్ ప్రాజెక్టులో భారీగా నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు సామర్థ్యం 1091 అడుగులు, 80.5 టీఎంసీలు ఉండగా నిన్న తగ్గు ముఖం పట్టిన ఇన్‌ఫ్లో ప్రస్తుతం ప్రాజెక్టులో 3,583 క్యూసెక్కులకు చేరుకుంది. అవుట్ ఫ్లో 3,583 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం ఉదయం 6 గంటల వరకు ప్రాజెక్టులో 47.25 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వివిధ అవసరాల కోసం ప్రాజెక్ట్ నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

News August 11, 2024

తిరుమల శ్రీవారి సేవలో గెల్లు శ్రీనివాస్ యాదవ్

image

ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి తిరుమల శ్రీ స్వామి వారిని రాష్ట్ర టూరిజం సంస్థ మాజీ ఛైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

News August 11, 2024

సిరిసిల్ల: యూట్యూబ్‌లో నెమలి కూరపై వీడియో! వైరల్

image

ఓ యూట్యూబర్ చేసిన వీడియో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తంగళ్లపల్లికి చెందిన ప్రణయ్‌కుమార్ కొద్ది రోజులుగా యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ‘నెమలి కూర సంప్రదాయ పద్ధతిలో ఎలా వండాలి’ అంటూ ఛానల్‌లో పెట్టిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అంతేకాదు, అడవిపంది కూర వండటం గురించి వీడియో సైతం ఛానల్‌లో ఉండటం గమనార్హం. దీంతో అతడిపై అధికారులు చర్యలు తీసుకోవాలంటూ జంతు ప్రేమికులు మండిపడుతున్నారు.

News August 11, 2024

GREAT.. పెద్దపల్లి జిల్లా యువతికి మూడు ప్రభుత్వ ఉద్యోగాలు

image

పెద్దపల్లి జిల్లా పెద్దబొంకూరు గ్రామానికి చెందిన పాంచాల వెంకటేశ్వర్లు-వసంత కుమార్తె మౌనిక మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ప్రతిభ చాటింది. నూతనంగా వెలువడిన TGPSC ఫలితాల్లో పంచాయతీరాజ్ శాఖలో AEE, AE, గ్రూప్-4 ఉద్యోగాలకు ఎంపికైంది. పెద్దబొంకూరు ZPHSలో పదో తరగతి వరకు చదువుకున్న మౌనిక NZB ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా, WGL KUలో బీటెక్, జేఎన్టీయూహెచ్‌లో ఎంటెక్ పూర్తిచేసింది.

News August 11, 2024

BREAKING.. KNR: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

పెద్దపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. గోదావరిఖని పట్టన శివారు గంగానగర్ రాజీవ్ రహదారిపై అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల ప్రకారం.. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి వన్ టౌన్ పోలీసులు చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

News August 11, 2024

KNR: 1.68 లక్షల కేసులు, రూ.3.92 కోట్ల జరిమానా

image

ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం, నిర్లక్ష్యం కారణంగా పోలీసులు వాహనదారులకు భారీగా జరిమానాలు విధించారు. KNR కమిషనరేట్ పరిధిలో 7నెలల్లో 1.68 లక్షల కేసులు, రూ.3.92 కోట్ల జరిమానా విధించారు. 2023లో 56మంది మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పడ్డుబడ్డారు. ఈ ఏడాది జులై 31వరకు వాహనాలు నడుపుతూ 87మంది మైనర్లు పట్టుబడటంతో వాహన చట్టం 181కింద వీరికి రూ.43వేల జరిమానా విధించారు. వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు.

News August 11, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

జగిత్యాల జిల్లాలోని సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శనివారం రూ.3,83,554 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,86,401, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.1,54,995, అన్నదానం రూ.42,158,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేశారు.

News August 10, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ కోరుట్లలో హిందూ సంఘాల భారీ ర్యాలీ. @ వేములవాడలో గురుకుల మహిళ కళాశాలను తనిఖీ చేసిన ప్రభుత్వ విప్, కలెక్టర్. @ జగిత్యాలలో జంతు సంరక్షణ కేంద్రం ప్రారంభం. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ చొప్పదండి మండలంలో లారీ డ్రైవర్ ఆత్మహత్య. @ మెట్పల్లి మండలంలో వృద్ధురాలిపై వీధి కుక్క దాడి. @ జగిత్యాల రూరల్ మండలంలో కొండచిలువ పట్టివేత. @ సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న సిరిసిల్ల ఎస్పీ.

News August 10, 2024

ఖైరతాబాద్‌కు ఉపఎన్నిక వస్తే మనదే గెలుపు: KTR

image

ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తుందని, బీఆర్ఎస్‌ను గెలిపించేందుకు నేతలు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గ నేతలతో ఆయన సమావేశమై దిశానిర్దేశం చేశారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ నియోజకవర్గానికి తప్పనిసరిగా ఉప ఎన్నిక వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకోసం కార్యకర్తలు సమాయత్తం కావాలని సూచించారు. మీ కామెంట్?