India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సికింద్రాబాద్-నాగ్‌పూర్ మధ్య ఈ నెల 16 నుంచి వందేభారత్ రైలు పట్టాలెక్కనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం రామగుండం, కాజీపేట స్టేషన్లలోనే హాల్టింగ్ సౌకర్యం ఉంది. మంగళవారం మినహా నాగ్‌పూర్‌లో ఉ.5 గంటలకు బయల్దేరి మ.12.15 గం.కు ఈ రైలు సికింద్రాబాద్ చేరుతుంది. మ.ఒంటి గంటకు SCలో బయల్దేరి రాత్రి 8.20 గంటలకు నాగ్‌పూర్ చేరుతుంది.
ఈనెల 16న గణేష్ నిమజ్జనం ఉన్నందున జిల్లా వ్యాప్తంగా సోమవారం మద్యం దుకాణాలు, బార్లు మూతపడనున్నాయి. ఈ మేరకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఉత్తర్వులు జారీ చేశారు. శాంతియుత వాతావరణంలో నిమజ్జనం చేయాలన్న ఉద్దేశంతో మద్యం దుకాణాలు, బార్లు క్లోజ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మంగళవారం యథావిధిగా షాపులు తెరుచుకుంటాయి.
గణేశ్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండుగల నేపథ్యంలో శాంతి కమిటీ సభ్యులతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమన్వయ సమావేశం నిర్వహించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. గణేశ్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు. ఉత్సవ కమిటీ ప్రతినిధులు అధికారులకు, పోలీసులకు అన్నివిధాలుగా సహకరించాలని కోరారు.
పెద్దపల్లి జిల్లాలో ఈనెల 14న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన కు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన ధర్మారం మండలం నంది మేడారం పంప్ హౌస్ వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ను కలెక్టర్ కోయ శ్రీ హర్ష, రామగుండం సీపీ శ్రీనివాస్‌లతో కలిసి పరిశీలించారు. ఉపముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు.
రామగుండం MLA రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఈరోజు HYDలోని CM రేవంత్ రెడ్డి కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఇటీవల రామగుండంలో 1,800 మెగావాట్ల విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు శ్రీకారం చుట్టడంతో CMకు కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా రామగుండం మెడికల్ కాలేజీలో అదనంగా నర్సింగ్, పారా మెడికల్, ఫిజియోథెరపీ విభాగాలు ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి CM సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
రుణమాఫీ కాలేదని ఇటీవల జగిత్యాల జిల్లా భూషణరావుపేట చెందిన రైతు ఏనుగు సాగర్ రెడ్డి ఆత్మహత్యాయత్నం చేసుకోవడం రైతులతో పాటు అందరినీ తీవ్రంగా కలిచివేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రుణమాఫీ కానీ రైతులు వేల సంఖ్యలో ఉన్నారు. రుణమాఫీ కాక రైతులు ఆవేదనతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రెండు లక్షల పైన ఉన్న డబ్బులు కట్టాలా..? వద్దా…? కడితే.. ఎప్పుడు రుణమాఫీ చేస్తారో తెలియని పరిస్థితిలో రైతులు ఉన్నారు.
పెద్దపల్లి పట్టణంలో ఓ ప్రైవేట్ వైద్యుడిపై రోగి బంధువుల దాడి ఘటనను నిరసిస్తూ సాధారణ, అత్యవసర వైద్యసేవలు నిలిపివేస్తున్నామని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(IMA) ప్రతినిధులు ప్రకటించారు. వైద్యులపై దాడులు ఆపకుంటే పెద్దఎత్తున ఆందోళనలు తప్పవన్నారు. ఐఎమ్ఏ రాష్ట్ర అధ్యక్షుడు కాళీ ప్రసాద్ ఆధ్వర్యంలో వైద్య బృందం నేడు జిల్లాలో పర్యటించనుంది.
మొన్నటి వరకు శ్రావణమాసం, ప్రస్తుతం వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూరగాయలకు భారీగా డిమాండ్ పెరిగింది. దీంతో కూరగాయల రేట్లు భారీగానే పెరిగాయి. బెండకాయ కిలో రూ.60-70, సొరకాయ రూ.60, పచ్చిమిర్చి రూ.80, కొత్తిమీర ఏకంగా కిలో రూ.200 వరకు పలుకుతోంది. ఏ కూరగాయల ధరలు చూసినా మండిపోతున్నాయి. వర్షాల కారణంగా కూరగాయలు రావట్లేదని వ్యాపారస్థులు చెబుతున్నారు.
DY.CM భట్టి, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ జిల్లా పర్యటన షెడ్యూల్‌ను అధికారులు ఖరారు చేశారు. ఈనెల 14న ఉ.10.20 గం. నంది మేడారం హెలిప్యాడ్ చేరుకుంటారు. 10.45-11కు కటికనపల్లి సబ్ స్టేషన్ శంకుస్థాపన, 11.30-1PM స్థానిక కార్యక్రమాల్లో పాల్గొని ధర్మారం మార్కెట్ యార్డులో ప్రసంగిస్తారు. 2.15-2.30PM కాచాపూర్, 3-3:15PM రంగాపూర్ అభివృద్ధి కార్యక్రమాల్లో, 3:30-5PM PDPL పబ్లిక్ మీటింగులో పాల్గొంటారు.
సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గురువారం రూ.49,303 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.27,846, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.16,050, అన్నదానం రూ.5,407 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.
Sorry, no posts matched your criteria.