India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మనస్తాపంతో ఇంటర్ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. పోలీసుల వివరాలు.. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్(M) కూనారం వాసి ప్రసన్నకుమార్ HNKలోని ఓ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. సెలవులకు ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో తాను హాస్టల్‌కు వెళ్లనని చెప్పాడు. దీంతో తల్లిదండ్రులు మందలించగా సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సంక్రాంతి, కనుమ సందర్భంగా మీ వాకిట్లో వేసిన మీ ముగ్గులనూ Way2Newsలో చూడాలనుకుంటే 7331149141 నంబర్‌కు వాట్సాప్ చేయండి. నోట్: ఫొటో, మీ పేరు, గ్రామం, మండలం, జిల్లా పేర్లు కచ్చితంగా పంపగలరు. పండుగను ప్రతిబింబించే ముగ్గులు మాత్రమే (వాట్సాప్ పోస్టు) పబ్లిష్ అవుతాయి.
అనారోగ్యంతో మృతి చెందిన మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయ నాయకులు మంద జగన్నాథం పార్థివదేహాన్ని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సందర్శించారు. ఈ సందర్భంగా పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. జగన్నాథం ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.
నిన్న జరిగిన ఉనిక పుస్తక ఆవిష్కరణలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు ఒకే వేదికను పంచుకున్నారు. అయితే ఈ వేదికపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ ఎంపీగా విద్యాసాగర్ రావును నేను ఓడిస్తే.. నన్ను వినోద్ కుమార్ ఓడించాడు. మా ఇద్దరినీ బండి సంజయ్ ఓడించాడని అన్నారు. దీంతో సభలో ఒక్కసారిగా నవ్వులు పూశాయి. ఏది ఏమైనా కరీంనగర్ జిల్లాకు వన్నె తెచ్చిన మహనీయుడు విద్యాసాగర్ రావు అన్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో పిల్లలపై భోగి పండ్లు పోస్తారు. వీటిని ఎందుకు పోస్తారో తెలుసా..? రేగు పండ్లనే భోగి పండ్లుగా పిలుస్తారు. వీటికి అర్కఫలం అనే పేరు ఉంది. అర్కుడు అంటే సూర్యుడు అని అర్థం. సూర్యుడు ఉత్తరాయణం వైపు మళ్లే సమయం కాబట్టి ఆయన కరుణాకటాక్షాలు పిల్లలపై ఉండాలనే ఉద్దేశంతో పోస్తారు. వీటిని ఐదేళ్ల లోపు పిల్లల తలపై పోస్తే ఆయురారోగ్యాలతో ఉంటారని నమ్మకం.
ఈనెల 26 నుంచి రైతు భరోసా పథకం ప్రారంభమవుతుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు తెలిపారు. భరోసా, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల ప్రక్రియపై ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ విప్‌లు, తదితర ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.
కోనరావుపేట మండలం ఓ గ్రామానికి చెందిన ఓ చిన్నారిపై అదే గ్రామానికి చెందిన వృద్ధుడు లైగింక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో పోలీసులు అతడిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి తెలిపారు. గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేస్తున్న మహిళ భర్త ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిపారు. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
సంక్రాంతి పండగ నేపథ్యంలో.. కరీంనగర్ పట్టణంలోని శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని కళాశాలలకు సెలవులు ప్రకటించారు. యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీజీ, బీఈడీ, ఫార్మసీ, ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలకు నేటి నుంచి ఈ నెల 15 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించినట్లు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు తిరిగి 16 నుంచి తరగతులకు హాజరు కావాలన్నారు.
జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం రూ.2,22,830 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,07,530, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.70,770, అన్నదానం రూ.44,530 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ కేంద్రమంత్రి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు (సాగర్ జీ) ఆత్మకథను ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. సాగర్ జీ ఆత్మకథ పుస్తకం ఉనికను ఆదివారం ఆవిష్కరించారు. తెలంగాణ ఉనికిని దేశ స్థాయిలో చాటిన కొద్ది మంది ప్రముఖుల్లో CH.విద్యాసాగర్ రావు ఒకరని, ఆయన ఆత్మ కథను ఆవిష్కరించడం ఆనందంగా ఉందని సీఎం తెలిపారు.
Sorry, no posts matched your criteria.