India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

స్థానిక సంస్థల ఓటర్ల జాబితాకు సంబంధించి జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి రేపు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు పోలింగ్ స్టేషన్ల జాబితాపై సమీక్షించనున్నారు. జిల్లా స్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులు రేపు సాయంత్రం 4.30 గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో హాజరుకావాలని కలెక్టర్ కోరారు.

2025-26 విద్యాసంవత్సరంలో నవంబరు 23న నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇన్‌ఛార్జి డీఈవో, అదనపు కలెక్టర్ పి.శ్రీజ తెలిపారు. పరీక్షలు ఉదయం 9:30గంటల నుంచి మధ్యాహ్నం 12:30గంటల వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరీక్ష రుసుం ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులకు రూ.50 ఆన్ లైన్‌లో చెల్లించాలని సూచించారు.

సాంకేతికత ఎంత అందుబాటులో ఉన్నా, తరగతి గదుల్లో ఉపాధ్యాయుల పాత్ర చాలా ముఖ్యమని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఒక ఉపాధ్యాయుడికి విద్యార్థి జీవితాన్ని పూర్తిగా మార్చే సామర్థ్యం ఉంటుందని పేర్కొన్నారు. టీచర్స్ డే సందర్భంగా శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి, అదనపు కలెక్టర్లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించారు.

ఖమ్మం జిల్లాను పర్యాటక రంగంలో ఉన్నతంగా అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.
శనివారం ఖమ్మం ఖిల్లా రోప్ వే నిర్మాణ ప్రాంతం, జాఫర్ బావి మరింత సుందరీకరణ కోసం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి క్షేత్ర స్థాయిలో సందర్శించి, చేపట్టాల్సిన పనుల గురించి పరిశీలించారు. అనంతరం రోప్ వే నిర్మాణ సంస్థకు పలు సూచనలు చేశారు.

ఖమ్మం నగరంలో శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాల కోసం ప్రభుత్వ యంత్రాంగం నిమగ్నమైంది. ప్రభుత్వ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఊరేగింపులు జరిగే ప్రాంతాల్లో ప్రత్యేక పోలీస్ బృందాలను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. శాంతిభద్రతల పరిరక్షణకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు సీపీ సునీల్ దత్ తెలిపారు.

తొమ్మిది రోజుల పాటు భక్తుల పూజలు అందుకున్న గణనాథుడు నేడు నిమజ్జనానికి సిద్ధమయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిమజ్జన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఖమ్మం నగరంలో మున్నేరు వద్ద, భద్రాచలంలో గోదావరి వద్ద అధికారులు నిమజ్జన ఏర్పాట్లు చేశారు. భద్రత కోసం సీసీ కెమెరాలు, క్రేన్లు, గజఈతగాళ్లతో పాటు భారీగా పోలీసులు మోహరించారు.

వేంసూరు మండలంలో జరిగిన గణేశ్ నిమజ్జన ఊరేగింపులో అపశ్రుతి చోటుచేసుకుంది. గురువారం అర్ధరాత్రి వి.వెంకటాపురం గ్రామంలో నిమజ్జనానికి వెళ్తుండగా ట్రాక్టర్ పైనుంచి షేక్ రషీద్ (20) అనే యువకుడు కిందపడి మృతి చెందాడు. ట్రాక్టర్ నడుపుతున్న రషీద్ స్నేహితుడికి డ్రైవింగ్ ఇచ్చి పక్కన కూర్చున్నాడు. ప్రమాదవశాత్తు కిందపడి తీవ్ర గాయాలు కావడంతో చనిపోయాడు.

గణేశ్ విగ్రహాల నిమజ్జనోత్సవ కార్యక్రమాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. ప్రతి విభాగం సమన్వయంతో ముందస్తు చర్యలు తీసుకోవాలని, శాంతి భద్రతల పరిరక్షణకు కఠినమైన పర్యవేక్షణ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. డీజేలకు అనుమతి లేదని, నిర్దేశించిన సమయంలోనే విగ్రహాలను నిమజ్జనం చేయాలని ప్రత్యేకంగా సూచించారు.

ఖమ్మం జిల్లా ఆస్పత్రిలో సదరం క్యాంపుల్లో అవినీతి జరుగుతోందని బాధితుడు ఫిర్యాదు చేశారు. సదరం విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది బయటి వ్యక్తులతో కలిసి దివ్యాంగుల ధ్రువీకరణ పత్రాలకు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. శాశ్వత ధ్రువీకరణ పత్రానికి రూ.50 వేలు, ఐదేళ్ల సర్టిఫికేట్‌కు రూ.30 వేలు డిమాండ్ చేస్తున్నారని బాధితుడు శ్రీను గురువారం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నరేందర్‌కు ఫిర్యాదు చేశారు.

గణేష్ విగ్రహాల శోభాయాత్ర, నిమజ్జనాన్ని పురస్కరించుకొని ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం విక్రయాలపై సీపీ సునీల్ దత్ ఆంక్షలు విధించారు. సెప్టెంబర్ 6 ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 7 ఉదయం 6 గంటల వరకు వైన్ షాపులు, బార్ & రెస్టారెంట్లు, క్లబ్‌లు, హోటళ్లు మూసివేయాలని ఆదేశించారు. నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రజలు సహకరించాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Sorry, no posts matched your criteria.