India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఖమ్మం జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ (TGSC CDC) 2025-26 వార్షిక ప్రణాళిక ఖరారైంది. మొత్తం 540 మంది లబ్ధిదారులకు రూ. 516.43 లక్షల సబ్సిడీ కేటాయించారు. ఇందులో 256 మందికి ఈవీ టూ వీలర్లు, 128 మందికి ఈవీ త్రీ వీలర్లు మంజూరు చేయనున్నారు. సోలార్ పంపుసెట్లు, ఉపాధి శిక్షణలకు కూడా నిధులు కేటాయించారు. యూనిట్‌ను బట్టి 60 నుంచి 100 శాతం వరకు సబ్సిడీ ఉంటుందని అధికారులు వెల్లడించారు.

ప్రకృతి విపత్తులో భారీ వర్షాలు, ఈదురు గాలులు, సాంకేతిక కారణాలతో విద్యుత్ సరఫరాలో ఏర్పడే అంతరాయాలను తగ్గించి వినియోగదారులకు త్వరితగతిన సేవలు అందించేందుకు ఎమర్జెన్సీ రీస్టోరేషన్ టీం వాహనాలను ఏర్పాటు చేశారు. ప్రతి డివిజన్, సబ్ డివిజన్‌లో వినియోగిస్తున్నామని ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి తెలిపారు. సమస్య ఏర్పడిన ప్రాంతానికి ప్రత్యేక బృందాన్ని వెంటనే పంపించి వేగంగా పరిష్కరిస్తున్నామని చెప్పారు.

జిల్లాలో పదో తరగతి ఆంగ్ల పరీక్ష సోమవారం ప్రశాంతంగా ముగిసింది. 99.89 శాతం హాజరు నమోదైనట్లు డీఈఓ చైతన్య జైని తెలిపారు. బోనకల్ జెడ్పీహెచ్ఎస్ కేంద్రంలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఇన్విజిలేటర్‌ను తక్షణమే విధుల నుంచి రిలీవ్ చేసినట్లు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 16,918 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని వివరించారు.

ఖమ్మం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీజ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. సత్తుపల్లి, కామేపల్లి, తిరుమలాయపాలెం తదితర ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు భూమి, వైద్యం, పింఛన్ సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి అర్జీలకు ప్రాధాన్యతనిచ్చి సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

ఆత్కూరు సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజ్‌లో జరిగిన అగ్నిప్రమాద స్థలాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదివారం పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంటల వల్ల జరిగిన ఆస్తి, పంట నష్టంపై పూర్తి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట పలువురు రెవెన్యూ, అగ్నిమాపక శాఖ అధికారులు ఉన్నారు.

ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ వైద్యంపై పర్యవేక్షణ లోపం గర్భిణులను ప్రైవేటు బాట పట్టిస్తోంది. గత ఏడాది సర్కారు ఆస్పత్రుల్లో కేవలం 6,316కాన్పులే జరగగా, ప్రైవేటులో ఆ సంఖ్య 7,789కి చేరడం గమనార్హం. వీటిలో అధిక శాతం సిజేరియన్లే కావడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణ ప్రసవాలు పెంచాలని కలెక్టర్ ఆదేశిస్తున్నా, క్షేత్రస్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యం వల్ల పరిస్థితిలో మార్పు రావడం లేదు. దీంతో పేదలకు వైద్యభారం తప్పడం లేదు.

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా శనివారం పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. సీపీ సునీల్ దత్ ఆదేశాల మేరకు బ్యాంకులు, ఏటీఎంలు, ప్రధాన కూడళ్ల వద్ద పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. ఇసుక, గంజాయి, రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవడమే లక్ష్యంగా వాహన సోదాలు నిర్వహించారు. రాత్రి వేళల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను సీజ్ చేశారు.
Sorry, no posts matched your criteria.