Khammam

News March 19, 2026

ఖమ్మం జిల్లాలో రహదారుల విస్తరణకు రూ.594 కోట్లు

image

ఖమ్మం జిల్లాలో గురువారం 5 కీలక రహదారుల విస్తరణకు రూ.594 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చొరవతో వైరా-జగ్గయ్యపేట, మధిర-తూటికుంట్ల, మధిర-ఎర్రుపాలెం, ఖమ్మం-బోనకల్ మార్గాలు 4 లైన్లుగా అభివృద్ధి కానున్నాయి. గ్రామాలు-పట్టణాల మధ్య కనెక్టివిటీ మెరుగై రవాణా సౌకర్యాలు పెరగడంతో రైతులు, వ్యాపారులకు ప్రయోజనం కలుగనుంది.

News March 19, 2026

ఇంటి ముంగిటకే వైద్యం: డీఎంహెచ్‌ఓ రామారావు

image

ఖమ్మం జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 20 స్పెషలిస్ట్ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ డి. రామారావు తెలిపారు. ఈ నెల 31 వరకు శిబిరాలు కొనసాగనున్నాయని చెప్పారు. స్త్రీ, శిశు, కంటి వైద్య నిపుణులు ఉచిత సేవలు అందిస్తారని, ఇప్పటివరకు 9 శిబిరాలు పూర్తయ్యాయన్నారు. మిగిలిన శిబిరాల్లో పరీక్షలు, మందులు ఉచితంగా అందజేస్తామని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు.

News March 19, 2026

ఖమ్మం: ఉద్యోగం లేని వారికి మంచి ఛాన్స్

image

ఖమ్మం జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత స్వయం ఉపాధి శిక్షణ ఇవ్వనున్నట్లు DYSO సునీల్ రెడ్డి తెలిపారు. కంప్యూటర్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో 3 నెలల శిక్షణకు దరఖాస్తులు కోరుతున్నారు. ఆసక్తి గలవారు ఆధార్, విద్యార్హత పత్రాలతో నేరుగా కార్యాలయంలో సంప్రదించాలని, వివరాలకు 99482 07271 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.

News March 19, 2026

రైలు ఢీకొని వృద్ధుడి మృతి

image

పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఓ వృద్ధుడుమృతి చెందాడు. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం బోనకల్లు-చింతకాని రైల్వే స్టేషన్ల మధ్య చోటుచేసుకుంది. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న జీఆర్‌పీ ఎస్‌ఐ వెంకటేశ్వరరావు ఘటనాస్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. మృతుడిని గుర్తించిన వారు 96529 39431 నంబరుకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

News March 18, 2026

ఎస్సీ యాక్షన్ ప్లాన్‌ను పకడ్బందీగా అమలు చేయాలి: అదనపు కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో 2025-26 ఎస్సీ యాక్షన్ ప్లాన్ కింద మంజూరైన 540 యూనిట్లను పారదర్శకంగా పంపిణీ చేయాలని అదనపు కలెక్టర్ పి.శ్రీజ అధికారులను ఆదేశించారు. రూ.5.16 కోట్లతో ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ పంప్ సెట్లు, ఉపాధి శిక్షణ అందించనున్నట్లు ఆమె తెలిపారు. అర్హులు మార్చి 24లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన వారికి ఏప్రిల్ నాటికి యూనిట్లు గ్రౌండింగ్ చేయాలని స్పష్టం చేశారు.

News March 18, 2026

ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా పదో తరగతి హిందీ పరీక్ష

image

ఖమ్మం జిల్లావ్యాప్తంగా పదో తరగతి హిందీ పరీక్ష బుధవారం ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 16,990 మంది విద్యార్థులకు గానూ 16,972 మంది హాజరయ్యారని, 99.89 శాతం హాజరు నమోదైనట్లు డీఈవో చైతన్య జైనీ తెలిపారు. పరీక్షా కేంద్రాలను డీఈవోతో పాటు ఏసీజీఈ, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ముమ్మరంగా తనిఖీ చేశాయి. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని, నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.

News March 18, 2026

ఖమ్మం: రేషన్ బియ్యం పంపిణీపై అదనపు కలెక్టర్ సమీక్ష

image

ఖమ్మం జిల్లాలోని బఫర్ గోదాముల నుంచి రేషన్ బియ్యం పంపిణీ తీరుపై అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్ నుంచి జూన్ 2026 వరకు మూడు నెలల కోటాను ఒకేసారి లబ్ధిదారులకు అందించాలన్న కేంద్ర ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం 12 గోదాములకు ఇన్‌చార్జిలను నియమించి, సకాలంలో సరఫరా జరిగేలా చూడాలన్నారు.

News March 18, 2026

ఖమ్మం: నీటి ఎద్దడిపై అధికారుల ‘యాక్షన్ ప్లాన్’

image

ఖమ్మం జిల్లాలో వేసవి తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. సమస్యాత్మకమైన 18 గ్రామాలను గుర్తించి, అక్కడ ట్యాంకర్లు లేదా ప్రైవేట్ వనరుల ద్వారా నీటి సరఫరాకు ప్రణాళికలు సిద్ధం చేశారు. తాగునీటి సమస్యల ఫిర్యాదుల కోసం 1916 టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చామని, మరమ్మతుల కోసం సుమారు రూ.90 లక్షలు ఖర్చవుతుందని ఈఈ పుష్పలత తెలిపారు.

News March 18, 2026

క్యాన్సర్ రహిత సమాజమే లక్ష్యం: ఖమ్మం DMHO

image

హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయించుకోవడం ద్వారా సర్వైకల్ (గర్భాశయ) క్యాన్సర్ ముప్పును ముందస్తుగానే నివారించవచ్చని DMHO రామారావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 14-15 ఏళ్ల బాలికలకు ఈ టీకా వేస్తున్నామని, ఈ నెల 8న ప్రారంభమైన ఈ కార్యక్రమంలో 16వ తారీకు వరకు 1300 మందికి వ్యాక్సిన్ అందించామని వెల్లడించారు.

News March 17, 2026

నాలుగేళ్లలో ఫసల్ బీమా క్లెయిమ్‌లు: కేంద్రం

image

దేశవ్యాప్తంగా పంట నష్టపోయిన రైతులకు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా కల్పిస్తున్న ఆర్థిక భరోసాపై ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి లిఖితపూర్వక సమాధానమిస్తూ.. నాలుగేళ్లలో ఈ పథకం ద్వారా భారీ స్థాయిలో క్లెయిమ్‌లు చెల్లించినట్లు వెల్లడించారు. రైతులకు ఈ పథకం ఒక రక్షణ కవచంలా పనిచేస్తోందన్నారు.