Khammam

News March 21, 2026

మధిర: 9 పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు రంగం సిద్ధం

image

మధిర నియోజకవర్గంలో రానున్న విద్యా సంవత్సరం నుంచి 5 మండలాల్లో 9 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేయనున్నారు. ప్రతి పాఠశాలలో 800–1000 మంది విద్యార్థులు చదివేలా ప్రణాళిక రూపొందించారు. ఎర్రుపాలెం, మధిర, బోనకల్, చింతకాని, ముదిగొండ మండలాల్లో ఈ స్కూల్స్ ఏర్పాటవుతాయి. ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు బోధన అందించనున్నారు. విద్యార్థులను సమీప గ్రామాల నుంచి రవాణా ద్వారా తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.

News March 20, 2026

ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఖమ్మం జిల్లాలోని అర్హులైన షెడ్యూల్డ్ కులాల (SC) యువతీ యువకులకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంఘం కార్యనిర్వాహక సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు.అర్హులైన ఎస్సీ నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు www.tgobmms.cgg.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.

News March 20, 2026

తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ డిజైన్లపై కలెక్టర్ సమీక్ష

image

ఖమ్మం జిల్లాలో 9 ప్రభుత్వ పాఠశాలలను ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’గా అభివృద్ధి చేసేందుకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సమీక్ష నిర్వహించారు. నాబార్డ్ నిధులతో జీ+1 పద్ధతిలో తరగతి గదులు, ల్యాబ్స్, డైనింగ్ హాల్స్ వంటి అత్యాధునిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. నాణ్యమైన మెటీరియల్‌తో అత్యుత్తమ డిజైన్లు రూపొందించాలని, ప్రతి గదిలో గాలి, వెలుతురు ఉండేలా ప్లాన్ సిద్ధం చేయాలని ఆయన సూచించారు.

News March 20, 2026

రంజాన్‌కు పటిష్ట భద్రత: సీపీ సునీల్‌ దత్

image

ఖమ్మం: రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని కమిషనరేట్ పరిధిలో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు సీపీ సునీల్ దత్ తెలిపారు. శుక్రవారం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి గోళ్లగూడెం ఈద్గాను సందర్శించారు. సామూహిక ప్రార్థనల నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ వసతులు, బందోబస్తుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈద్గా నిర్వాహకులతో మాట్లాడి సౌకర్యాలను సమీక్షించారు.

News March 20, 2026

విద్యుత్ సిబ్బంది భద్రతకు ‘ఎల్సీ యాప్’ కవచం

image

ఖమ్మం: విద్యుత్ క్షేత్రస్థాయి సిబ్బంది ప్రాణరక్షణ కోసం ప్రవేశపెట్టిన ‘ఎల్సీ యాప్’ విప్లవాత్మక మార్పు అని ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి కొనియాడారు. లైన్ క్లియర్ (ఎల్సీ) అనుమతులు ఇకపై పూర్తిగా డిజిటల్ పద్ధతిలోనే జారీ అవుతాయన్నారు. దీనివల్ల పొరపాటున తప్పుడు ఫీడర్లను ఎంపిక చేసే అవకాశం ఉండదని, ప్రమాదాలకు తావుండదని పేర్కొన్నారు. ఈ విధానం వల్ల విద్యుత్ ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయని వివరించారు.

News March 20, 2026

మండిపోతున్న ఎండలు.. చుక్కల్లో నిమ్మ ధర!

image

జిల్లాలో భానుడి భగభగలకు తోడు నిమ్మ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఎండాకాలం ప్రారంభం కావడంతో నిమ్మకాయలకు గిరాకీ పెరిగి, ధరలు సామాన్యుడికి భారంగా మారాయి. గతంలో డజను రూ. 20-30 పలికిన ధర.. ప్రస్తుతం ఏకంగా రూ. 80-100కు చేరింది. బహిరంగ మార్కెట్లో ఒక్కో కాయ రూ. 7 నుంచి రూ. 10 వరకు విక్రయిస్తున్నారు. పెరిగిన ధరలతో వినియోగదారులు, హోటల్‌ నిర్వాహకులు బెంబేలెత్తుతున్నారు.

News March 20, 2026

పర్యాటకానికి ‘బడ్జెట్’ ఊతం ఇచ్చేనా?

image

రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యాటక రంగానికి మహర్దశ పడుతుందని జిల్లా వాసులు ఆశిస్తున్నారు. పాలేరు నుంచి పర్ణశాల వరకు పర్యాటక కారిడార్ అభివృద్ధికి, భద్రాద్రి, జమలాపురం వంటి పుణ్యక్షేత్రాల ఆధునీకరణకు సుమారు రూ. 500 కోట్లు అవసరమని అంచనా. రాబోయే గోదావరి పుష్కరాల దృష్ట్యా ఇప్పుడే నిధులు కేటాయిస్తేనే ఘాట్లు, రహదారుల పనులు సకాలంలో పూర్తవుతాయి.

News March 19, 2026

ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ నూతన కార్యవర్గం ఖరారు

image

ఖమ్మం DCC నూతన కార్యవర్గాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ ప్రకటించారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా కసరత్తు చేసిన పీసీసీ.. జిల్లాలోని కీలక నేతలందరికీ ప్రాధాన్యత ఇస్తూ సమతుల్యమైన కమిటీని వెల్లడించింది. ఈ నూతన కార్యవర్గంలో 11 మంది ఉపాధ్యక్షులు, 22 మంది ప్రధాన కార్యదర్శులు, 26 మంది కార్యదర్శులకు చోటు కల్పించారు. వీరితో పాటు 5 మంది అధికార ప్రతినిధులు, 15 మంది కార్యనిర్వాహక సభ్యులను నియమించారు.

News March 19, 2026

ఖమ్మం జిల్లాలో రహదారుల విస్తరణకు రూ.594 కోట్లు

image

ఖమ్మం జిల్లాలో గురువారం 5 కీలక రహదారుల విస్తరణకు రూ.594 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చొరవతో వైరా-జగ్గయ్యపేట, మధిర-తూటికుంట్ల, మధిర-ఎర్రుపాలెం, ఖమ్మం-బోనకల్ మార్గాలు 4 లైన్లుగా అభివృద్ధి కానున్నాయి. గ్రామాలు-పట్టణాల మధ్య కనెక్టివిటీ మెరుగై రవాణా సౌకర్యాలు పెరగడంతో రైతులు, వ్యాపారులకు ప్రయోజనం కలుగనుంది.

News March 19, 2026

ఖమ్మం జిల్లాలో రహదారుల విస్తరణకు రూ.594 కోట్లు

image

ఖమ్మం జిల్లాలో గురువారం 5 కీలక రహదారుల విస్తరణకు రూ.594 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చొరవతో వైరా-జగ్గయ్యపేట, మధిర-తూటికుంట్ల, మధిర-ఎర్రుపాలెం, ఖమ్మం-బోనకల్ మార్గాలు 4 లైన్లుగా అభివృద్ధి కానున్నాయి. గ్రామాలు-పట్టణాల మధ్య కనెక్టివిటీ మెరుగై రవాణా సౌకర్యాలు పెరగడంతో రైతులు, వ్యాపారులకు ప్రయోజనం కలుగనుంది.