India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా హోలీ వేడుకలు ∆} వైరా పర్ణశాలలో ప్రత్యేక పూజలు ∆} వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల పర్యటన ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎమ్మార్పీఎస్ నాయకులు నిరసన కార్యక్రమం ∆} మధిర మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం.
ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రెండేళ్ల కాల పరిమితితో మందులు, శస్త్ర చికిత్స వినియోగ వస్తువులు, ప్రయోగశాల రసాయనాలు, ఆర్థో ఇంప్లాంట్లు, క్యాత్-ల్యాబ్ ఇంప్లాంట్ల కోసం టెండర్లు కోరుతున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్.కిరణ్ కుమార్ తెలిపారు. ఆసక్తి గల ఏజెన్సీలు మార్చి 20 లోగా టెండర్ ఫారాలు తీసుకొని, దరఖాస్తులను ఏప్రిల్ 11 సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాల్సి ఉంటుందని వెల్లడించారు.
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శనివారం(రేపటి) నుంచి ఒంటిపూట బడులు మొదలుకానున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒకటో తరగతి నుంచి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఒక్కపూట తరగతులను నిర్వహించనున్నారు. జిల్లాలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, మోడల్స్ స్కూల్స్, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒంటి పూట బడులు పక్కాగా అమలు చేయాలని అధికారులు ఆదేశించారు.
హోలీ సందర్భంగా ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ ఆంక్షలు అమలులో వుంటాయని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. హోలీ పండుగ వేడులను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. రోడ్లపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించినా, వాహనాలపై గుంపులు గుంపులుగా తిరుగుతూ.. పరిచయం లేని వ్యక్తులపై రంగులు చల్లితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఖమ్మం జిల్లాలో సాగు, తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. గురువారం పాలేరు జలాశయాన్ని సందర్శించి, జలాశయం నీటిమట్టం వివరాలను నీటిపారుదల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పంటల పరిస్థితిపై వ్యవసాయ శాఖ అధికారులను ఆరా తీశారు.
ఖమ్మం జిల్లాలో గురువారం ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవిబాబు తెలిపారు. జనరల్ కోర్సుల్లో 15,880 మందికి గాను 15,489 మంది, అలాగే ఒకేషనల్ కోర్సుల్లో 2,379 మంది విద్యార్థులకు గాను 2,186 మంది విద్యార్థులు హాజరయినట్లు చెప్పారు. రెండు కోర్సులకు గాను 584 మంది గైర్హాజరయ్యారన్నారు. అటు జిల్లాలో ఇవాళ ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని పేర్కొన్నారు.
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం యడవల్లిలో కొంతకాలంగా లివర్ వ్యాధితో బాధపడుతున్న BRS నాయకుడు చేరుకుపల్లి భిక్షం రెండో కుమార్తె చేరుకుపల్లి శిరీష(23) శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడి ఈరోజు మృతిచెందిందని కుటుంబసభ్యులు తెలిపారు. ఆమె మృతితో తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రులయ్యారు. గ్రామస్థులు ఆమె అకాల మరణంపై విచారం వ్యక్తం చేశారు. శిరీష మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
టీజీఎస్ ఆర్టీసీ ఖమ్మం రీజియన్ డిప్యూటీ ఆర్ఎంలుగా విధులు నిర్వహిస్తున్న జి.ఎన్.పవిత్ర, భవానీ ప్రసాద్‌ను బదిలీ చేస్తూ సంస్థ వైస్ ఛైర్మన్, ఎండీ సజ్జనార్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. భవానీ ప్రసాద్‌ను మహబూబ్‌నగర్‌కు, జీ.ఎన్.పవిత్రను షాద్‌నగర్‌కు బదిలీ చేశారు. కాగా, వీరి స్థానంలో ఇంకా ఎవరినీ నియమించలేదు.
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఏప్రిల్ 6, 7 తేదీల్లో జరిగే కళ్యాణం, మహా పట్టాభిషేకం ఉత్సవాలకు బుధవారం నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులో ఉంటాయని ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. htts://bhadradritemple.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా భక్తులు టికెట్లు బుక్ చేసుకోవచ్చని చెప్పారు. ఈనెల 20వ తేదీ ఉదయం 11 నుంచి ఏప్రిల్ 6వ తేదీ ఉదయం 6 గంటల వరకు తానీషా కళ్యాణ మండపంలో టికెట్లు పొందాలని సూచించారు.
∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటన ∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు ∆} ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} సత్తుపల్లిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} నేలకొండపల్లిలో ఎమ్మార్పీఎస్ నిరసన కార్యక్రమం
Sorry, no posts matched your criteria.