Khammam

News August 25, 2025

ప్రతి గణేష్ మండపానికి ఉచిత విద్యుత్: జిల్లా కలెక్టర్

image

ప్రతి గణేష్ మండపానికి లైన్‌మెన్ ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇస్తారని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. సోమవారం గణేష్ ఉత్సవాల నిర్వహణ, నిమజ్జన ఏర్పాట్లపై సీపీ సునీల్ దత్, అదనపు కలెక్టర్ శ్రీజ, కల్లూరు డివిజన్ సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్‌తో కలిసి సమావేశం నిర్వహించారు. జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా వైభవోపేతంగా జరగాలని అధికారులను ఆదేశించారు.

News August 25, 2025

39 మంది కానిస్టేబుళ్లకు ఉద్యోగోన్నతులు.. సీపీ అభినందన

image

ఖమ్మం జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న 39 మంది కానిస్టేబుళ్లు హెడ్ కానిస్టేబుల్స్‌గా పదోన్నతి పొందారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ స్వయంగా వారికి ఉద్యోగోన్నతుల చిహ్నాన్ని అలంకరించి అభినందించారు. కానిస్టేబుళ్లు విధి నిర్వహణలో చూపిన క్రమశిక్షణ, నిబద్ధత, సేవాస్ఫూర్తికి గుర్తింపుగా ఈ పదోన్నతి లభించిందని అన్నారు. ఉద్యోగోన్నతి పొందిన వారు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆయన ఆకాంక్షించారు.

News August 25, 2025

KMM: ఉపాధ్యాయ పదోన్నతుల జాబితా సిద్ధం

image

ఖమ్మం జిల్లాలో ఎస్టీల నుంచి ఎస్ఏ(స్కూల్ అసిస్టెంట్లు)లుగా పదోన్నతి పొందే వారి జాబితాను విద్యాశాఖ సిద్ధం చేసింది. ఈ మేరకు జిల్లాలో 1: 3 నిష్పత్తిలో సుమారు 600 మంది ఎస్టీలు ఉండగా 1:1 నిష్పత్తిలో వివిధ సబ్జెక్ట్‌లు సంబంధించి 207 మందితో తుది జాబితా తయారు చేశారు. కాగా ఈరోజు ఈ 207 మందికి వెబ్ ఆప్షన్లు మొదలుకానున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.

News August 25, 2025

ఖమ్మం: వేధిస్తున్నాడని భర్తని చితకబాదిన భార్య

image

మద్యం తాగి భర్త వేధిస్తున్నాడని భార్య చితకబాదిన ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. వీఎంబంజర్ గ్రామానికి చెందిన పర్వతం గంగరాజు, లక్ష్మికి 25 ఏళ్ల కిందట వివాహమైంది. భర్త రోజూ తాగి లక్ష్మిని వేధిస్తున్నాడు. వేధింపులు తాళలేక లక్ష్మి ఆదివారం భర్తను చితకబాదింది. గంగరాజుకు గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News August 25, 2025

ఖమ్మంలో మట్టి గణపయ్య విగ్రహాలు పంపిణీ

image

ఖమ్మం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు నుంచి గణపయ్య ఉచిత విగ్రహాల పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు కమిషనర్ 8 వేల మట్టి విగ్రహాలను కేఎంసీకి తెప్పించారు. ఆదివారం రాత్రికి విగ్రహాలు కేఎంసీకి చేరుకున్నాయి. అన్ని ప్రాంతాల్లో వీటిని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నగరం నగరంలో మట్టి విగ్రహాలు ఏర్పాటు చేసి పర్యావరణం పరిరక్షణ కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని మున్సిపల్ అధికారులు కోరారు.

News August 25, 2025

ఖమ్మం: ఈ నెల 30 చివరి తేదీ..!

image

డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్లు పొందడానికి ఈనెల 30 వరకు గడువు ఉందని ప్రాంతీయ అధ్యయన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ గుగులోతు వీరన్న తెలిపారు. ఆదివారం ఎస్ఆర్అండ్‌బీజీఎన్ఆర్ కళాశాలలో జరిగిన ఉమ్మడి ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అతి తక్కువ ఫీజులతో బీఏ, బీకాం, బీఎస్సీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

News August 24, 2025

ఖమ్మం: ట్రాక్టర్‌ రోటవేటర్‌ కిందపడి బాలుడు మృతి

image

కూసుమంచి మండలం కొత్తతండాలో విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ క్షేత్రంలో తండ్రి రాంబాబు ట్రాక్టర్‌తో దుక్కి దున్నుతుండగా దానిపై కూర్చున్న ఆరేళ్ల బాలుడు భువనేశ్వర్‌ ప్రమాదవశాత్తు రోటవేటర్‌లో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. కళ్లెదుటే కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. దీంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.

News August 24, 2025

చరిత్ర కలిగిన నేలకొండపల్లికి పుర హోదా దక్కేనా?

image

ఖమ్మం జిల్లాలో ఘన చరిత్ర కలిగిన నేలకొండపల్లి మండల కేంద్రం నేటికీ మున్సిపాలిటీకి అవకాశం ఉన్నప్పటికీ గ్రామ పంచాయతీగానే కొనసాగుతుంది. మున్సిపాలిటీగా రూపాంతరం చెందితే కేంద్ర నిధులు కూడా వచ్చే అవకాశం ఉందని మహనీయులు చరిత్ర కలిగిన నేలకొండపల్లి స్వరూపం పూర్తిగా మారే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. మున్సిపాలిటీ చేయాలన్న ఆలోచన పాలకుల మనసులో ఉన్నా ఆచరణలో ముందుకు వెళ్లడం లేదని తెలుస్తోంది.

News August 24, 2025

ఖమ్మం: తగ్గుతున్న పాలేరు జలాశయం నీటి మట్టం

image

కూసుమంచి మండలం పాలేరు జలాశయం నీటి మట్టం గణనీయంగా తగ్గింది. నిన్నటి వరకు వరదల కారణంగా పరవళ్లు తొక్కగా, వర్షాలు తగ్గడంతో పాటు సాగర్ డ్యాం నుంచి నీటి రాక తక్కువగా ఉంది. పాలేరు జలాశయం నుంచి ఎడమ కాల్వకు 4 వేల క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. దీంతో 23 అడుగుల గరిష్ఠ నీటి మట్టానికి ప్రస్తుతం 19.5 అడుగులకు తగ్గింది.

News August 24, 2025

విద్యార్థుల ప్రతిభకు మురిసిపోయిన ఖమ్మం కలెక్టర్

image

ప్రతి నెల నాలుగో శనివారం నిర్వహించే బ్యాగ్‌లెస్ డే కార్యక్రమంలో భాగంగా ఖమ్మం ఇందిరానగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సందర్శించారు. విద్యార్థులు కాగితపు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలకగా, కలెక్టర్ ఆనందం వ్యక్తం చేశారు. పిల్లలు తయారు చేసిన గ్రీటింగ్ కార్డులు, పతంగులు, పోస్టర్లు, పజిల్స్, పేపర్ ఆకృతులను పరిశీలించి, నృత్యం, గానం,ప్రసంగాలు,సాంస్కృతిక ప్రదర్శనలను ఆస్వాదించారు.