India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చిందని, గ్రామాల్లో చేపడుతున్న రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యల పరిష్కారానికి దరఖాస్తు చేసుకోవాలని ఇంచార్జ్ కలెక్టర్ డా. పి. శ్రీజ తెలిపారు. నేలకొండపల్లి మండలం చెరువు మాధారం, కొత్త కొత్తూరు గ్రామాలలో చేపట్టిన రెవెన్యూ సదస్సులను ఇంచార్జ్ కలెక్టర్ తనిఖీలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు ఉన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పథకంలో అవకతవకలకు పాల్పడే ఎలాంటి వారినైనా ఉపేక్షించమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల విషయంలో అక్రమాలకు పాల్పడితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బేస్మెంట్ నిర్మాణం పూర్తి కాకుండానే తప్పుడు సమాచారాన్ని అప్ లోడ్ చేసిన బిల్ కలెక్టర్ జగదీష్‌పై చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
బావిలో పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. మండలం మేడిదపల్లి గ్రామంలో మతిస్థిమితం లేని వ్యక్తి బావిలో పడి మృతి చెందినట్లు చెప్పారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
BRS అమలు చేసిన ధరణిని బంగాళాఖాతంలో కలుపుతాం అన్నందుకే రైతులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకువచ్చారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి సీతక్కతో కలిసి పొంగులేటి మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చాక ధరణిని, తొలగించి భూ భారతిని తీసుకొచ్చామని పేర్కొన్నారు.
ఖమ్మం నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో ఈ నెల 20న సాయంత్రం 6 గంటలకు నెల నెలా వెన్నెల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు మోటమర్రి జగన్మోహన్ రావు, అన్నాబత్తుల సుబ్రమణ్యకుమార్, కె.దేవేంద్ర, నాగబత్తిని రవి, వేల్పుల విజేత, లక్ష్మీనారాయణ, వేముల సదానందం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌కు చెందిన సిరిమువ్వ కల్చరల్స్ కళాబృందం ‘హక్కు’ నాటిక ప్రదర్శించనున్నట్లు తెలిపారు.
ఫైనాన్స్ వేధింపులు తాళలేక ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం(D) బోనకల్(M) గోవిందపురం(ఎల్)లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఇసంపల్లి సైదా గత కొద్ది రోజుల క్రితం ఓ కంపెనీలో ఫైనాన్స్ తీసుకోగా ఈఎంఐ చెల్లించకపోవడంతో ఫైనాన్సర్ వేధింపులు ఎక్కువయ్యాయి.. దీంతో మనస్తాపం చెంది, పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారని గ్రామస్థులు తెలిపారు. మృతుడి భార్య ఠాణాలో ఫిర్యాదు చేశారు.
పేదలకు అందాల్సిన ముఖ్యమంత్రి సహాయనిధి బిల్లులను ఖమ్మంలోని పలు ఆసుపత్రులు నకిలీ బిల్లులు సృష్టించి రూ.లక్షల విలువ గల CMRF చెక్కులను కాజేశాయి. ఈ అంశంపై కొద్దినెలల క్రితం సీఎంఓకు అందిన ఫిర్యాదుతో పలు ఆసుపత్రులపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. నేడు తాజాగా ఆ ఆసుపత్రులకు నోటీసులు పంపి, రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని ఆదేశించారు. పేదలకు అందాల్సిన పథకం నిర్వీర్యం అవుతుందని ప్రజలు విమర్శిస్తున్నారు.
అనుమానాస్పద స్థితిలో ఓ బాలుడి మృతదేహం బావిలో లభ్యమైన ఘటన శుక్రవారం బోనకల్ మండలంలో చోటు చేసుకుంది. లక్ష్మీపురం రెవెన్యూ పరిధిలోని వ్యవసాయ బావిలో తెల్లవారుజామున ఓ బాలుడి మృతదేహం తేలియాడుతూ స్థానికుల కంటపడింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. బాలుడు ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడా? లేక ఎవరైనా హత్య చేశారా? వంటి కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతుంది.
ఏఐకేఎంఎస్ జాతీయ సమితిలో ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురికి స్థానం లభించింది. తమిళనాడులో ముగిసిన జాతీయ మహాసభల్లో 36 మందితో జాతీయ కార్యవర్గం, 115 మందితో జాతీయ కౌన్సిల్‌ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నేలకొండపల్లికి చెందిన బాగం హేమంతరావు జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. చింతకాని మండలం రాఘవాపురానికి చెందిన కొండపర్తి గోవిందరావుతో పాటు మందడపు రాణికి జాతీయ కౌన్సిల్ సభ్యులుగా స్థానం దక్కింది.
∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గుడ్ ఫ్రైడే వేడుకలు ∆} ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన∆} వివిధ శాఖల అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్ష సమావేశం∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ∆} కల్లూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} ఖమ్మం సంబాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
Sorry, no posts matched your criteria.