India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మైనర్ డ్రైవర్లపై ప్రత్యేక దృష్టి పెట్టిన ట్రాఫిక్ పోలీసులు ఏడు రోజుల్లో 15 కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు తెలిపారు. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు విద్యార్థులు వేసవి సెలవులు దృష్టిలో పెట్టుకొని ప్రతిరోజు వాహన తనిఖీలు చేపడుతున్నామని చెప్పారు. పాఠశాలలకు సెలవుల సమయంలో తల్లిదండ్రులు వారి పిల్లల కదలికలపై దృష్టి పెట్టాలని ఏసీపీ పేర్కొన్నారు.
ఖమ్మం జిల్లాకు ఖమ్మం అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా. ఖమ్మం నగర మధ్యలో ఉన్న స్తంభాద్రి నుంచి మండపాలకు, స్తంభాలకు కావాల్సిన రాళ్లు తరలించేవారని చరిత్ర చెబుతుంది. ఉర్దూ భాషలో ఖమ్మం అంటే స్తంభం అని అర్ధం. అలాగే నరసింహస్వామి పేరు మీద ఈ పేరు వచ్చిందనే వాదన ఉంది. బ్రిటిష్ వారి పాలనలో ఈ ప్రాంతాన్ని ‘ఖమ్మం మెట్టు’ అని పిలిచేవారనే మరో వాదన ఉంది. దీంతో ఖమ్మంకు అలా పేరు వచ్చిందని చెబుతున్నారు.
హైదరాబాద్ జీడిమెట్ల PS పరిధిలో దారుణం జరిగింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన వివాహిత తేజ(30) గాజులరామారంలో ఉంటుంది. వేట కొడవలితో ఇద్దరు కొడుకులను నరికి, ఆనక తల్లి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ తగాదాల నేపథ్యంలో 7, 5 ఏళ్ల పిల్లలను కిరాతకంగా నరికి చంపిందని స్థానికులు అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలు పోలీసులు నిర్ధారించాల్సి ఉంది.
సమ్మర్ HOLIDAYS వచ్చాయంటే ఫ్యామిలీతో కలిసి ఎక్కడికి వెళ్లాలా అని ఆలోచిస్తుంటారు. మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ చాలా పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలు ఉన్నాయి. ఖమ్మం ఫోర్ట్, పాపికొండలు, పులిగుండాల, లకారం ట్యాంక్‌బండ్, నేలకొండపల్లి బౌద్ధ క్షేత్రం, భద్రాచలం రామయ్య గుడి, పర్ణశాల, కిన్నెరసాని ప్రాజెక్ట్, పాల్వంచ పెద్దమ్మ గుడిని ఒక్క రోజులో చుట్టేయొచ్చు. వీటిలో మీరు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో కామెంట్ చేయండి
టేకులపల్లి మండలం సంపత్‌నగర్‌కు చెందిన కుడితేటి రమేశ్‌కు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. క్రిస్టియన్ గీతాలపై ప్రపంచ స్థాయిలో జరిగిన ఆన్లైన్ మ్యూజిక్ ప్రదర్శనలో రమేశ్ పాల్గొనగా కీబోర్డు వాయిద్య బృందం గంటలో 1,046 వీడియోలు అప్లోడ్ చేసింది. ఈ బృందంలో రమేశ్ సభ్యుడు. సోమవారం హోలెల్ మ్యూజిక్ స్కూల్ నిర్వాహకుల చేతుల మీదుగా మెడల్ అందుకున్నాడు.
ఖమ్మం పట్టణంలోని ట్రాఫిక్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఎండీ షౌకత్ అలీ ఇటీవల మృతి చెందారు. ఈ సందర్భంగా పట్టణంలోని పోలీస్ కమిషనరేట్‌లో ఏఎస్ఐ షౌకత్ అలీ కుటుంబానికి మంజూరు అయిన రూ.8 లక్షల ఎక్స్‌గ్రేషియో చెక్కును బుధవారం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
∆} కల్లూరులో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ ∆} నేలకొండపల్లిలో భూభారతిపై అవగాహన కార్యక్రమం ∆} పెనుబల్లి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} ఖమ్మంలో జాబ్ మేళా ∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ∆} వివిధ శాఖల అధికారులతో ఇన్ఛార్జ్ కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} సత్తుపల్లిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని తాళ్లపెంటకు చెందిన దేవుడి ఆంబోతు అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ ఊరంతా తల్లడిల్లింది. ఆ ఆంబోతును దేవుడి స్వరూపంగా భావిస్తూ గ్రామస్థులు ట్రాక్టర్‌పై వీధులలో మేళతాళాలు, కుంకుమ చల్లుతూ ఊరేగించారు. అనంతరం భక్తి శ్రద్దలతో సంప్రదాయబద్దంగా ఆంబోతుకు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. మహిళలు, పెద్దలు, గ్రామస్థులు పాల్గొని, కన్నీటి పర్యాంతమయ్యారు.
ఖమ్మం జిల్లాలో రైతులకు, ప్రజలకు భూ భారతి చట్టంపై ఈనెల 17 నుంచి 30 వరకు రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటలకు 2 మండల కేంద్రాల్లో అవగాహన సమావేశాలు నిర్వహిస్తామని జిల్లా అదనపు కలెక్టర్ పి.శ్రీజ తెలిపారు. కొత్త ఆర్ఓఆర్ చట్టం అమలుపై సమగ్రంగా అధికారులు వివరిస్తారని, ప్రజలకు ఏలాంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకోవచ్చునని ఆమె సూచించారు.
ఖమ్మం జిల్లా ప్రజలకు విద్యుత్ శాఖ విజ్ఞప్తి చేసింది. మంగళవారం రాత్రి భారీ ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో తమ ప్రాంతాల్లో విద్యుత్తు లైన్ల పై చెట్టుకొమ్మలు లేదా స్తంభాలు విరిగిపడినట్లు ఉంటే వెంటనే విద్యుత్ సిబ్బందికి తెలియజేయాలన్నారు. విద్యుత్ సంబంధిత సమస్యలు ఉంటే 1912 నంబర్ కు కాల్, లేదా విద్యుత్ అధికారులకు సమాచారం అందించాలని విద్యుత్ అధికారులు ప్రకటించారు.
Sorry, no posts matched your criteria.