India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిబద్ధతతో పనిచేస్తేనే వ్యవస్థ మనుగడ సాధ్యమవుతుందని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి అన్నారు. ఇటీవల నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులైన గ్రామ పాలన అధికారులతో కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ గురువారం సమావేశం నిర్వహించి, ఆప్షన్ ఫారంలను స్వీకరించారు. ఇటీవల నిర్వహించిన పరీక్షలో 253 మంది ఉత్తీర్ణత సాధించారని, వీరిలో 240 మంది లోకల్, 13 మంది నాన్ లోకల్ ఉన్నారని పేర్కొన్నారు.
ఖమ్మం జిల్లాలో బుధవారం ఉదయం 8:30 నుంచి గురువారం ఉదయం 8:30 వరకు 46.6 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సత్తుపల్లిలో 20.6, వేంసూరు 6.0, నేలకొండపల్లి 4.8, చింతకాని, ఖమ్మం అర్బన్ 3.6, మధిర 3.4, బోనకల్ 2.2, ముదిగొండ 1.8, వైరా మండలంలో 0.6 నమోదైనట్లు చెప్పారు. అటు ఇతర మండలాల్లో ఎలాంటి వర్షపాతం నమోదు కాలేదని పేర్కొన్నారు.
గ్రామపాలనాధికారి పరీక్షలో ఉత్తీర్ణులైన ఖమ్మం జిల్లాకు చెందిన 307 మంది అభ్యర్థులకు ఈ నెల 5న నియామక పత్రాలు అందనున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ఈ పత్రాలు అందజేస్తారు. భూ భారతి చట్టం అమలులో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ఈ నియామకాలతో గ్రామస్థాయిలో పరిపాలన మరింత పటిష్టం కానుంది.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు ఈ సీజన్ కు సంబంధించిన కొత్త పత్తి వచ్చింది. గురువారం మార్కెట్‌లో ఇవాళ్టి ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా కొత్త పత్తి ధర రూ.6,711, క్వింటా పాత పత్తి ధర రూ.7,625, ఏసీ మిర్చి ధర రూ.15,425, నాన్ ఏసీ మిర్చి ధర రూ.8,600 జెండా పాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. మార్కెట్లో ప్రతి ఒక్కరు నియమ నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు.
తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి, ఇంటర్మీడియట్ అడ్మిషన్ల గడువు పెంచడం జరిగిందని అదనపు కలెక్టర్ శ్రీజ తెలిపారు. అపరాధ రుసుం లేకుండా ఈనెల 7 వరకు, అపరాధ రుసుంతో 20వ తేదీ వరకు పొడిగించారన్నారు. ఆసక్తిగల అభ్యాసకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వివరాలకు 80084 03522 నెంబరును సంప్రదించాలని పేర్కొన్నారు.
ఖమ్మం జిల్లాలో కాజీపేట–BZA రైల్వే మూడో లైన్ ప్రాజెక్టుకు అవసరమైన భూ సేకరణ తుది దశలో ఉందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ సమీక్షించిన వీడియో కాన్ఫరెన్స్‌లో బుధవారం పాల్గొన్న ఆయన, ప్రాజెక్ట్ వేగవంతానికి భూ సేకరణ కీలకమని, గడువు నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ లైన్ పూర్తయితే రైళ్ల ట్రాఫిక్ తగ్గి ప్రయాణికులు, పరిశ్రమలకు మేలు చేకూరనుందని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే యూరియా కష్టాలు వచ్చాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. దేశవ్యాప్తంగా యూరియా కొరత ఉందని, ఆ ప్రభావం తెలంగాణ పైనా పడిందని చెప్పారు. గత నెల తెలంగాణకు రావాల్సిన యూరియా పూర్తిగా రాలేదని, యూరియా పంపాలని పదే పదే కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. యూరియా విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ముందు చూపు లేదని విమర్శించారు.
గణేశ్ నిమజ్జన వేడుకల నేపథ్యంలో నగరంలోని కాల్వోడ్డు, మున్నేరు వద్ద ఉన్న నిమజ్జన ఘాట్‌ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పరిశీలించారు. నగరపాలక కమిషనర్ అభిషేక్ అగస్త్య, అదనపు కలెక్టర్ శ్రీజ, మేయర్ నీరజ, సంభాద్రి ఉత్సవ కమిటీ సభ్యులు ఆయనతో కలిసి ఈ పరిశీలనలో పాల్గొన్నారు. శోభాయాత్ర, నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు.
ఖమ్మం జిల్లాలో బుధవారం ఉదయం 8:30 వరకు గడచిన 24 గంటల్లో 82.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. తల్లాడ 10.2, చింతకాని 9.0, బోనకల్ 8.0, KMM(R) 6.8, KSMC 6.4, SPL 6.2, వేంసూరు 5.6, KMM(U), కల్లూరు 4.8, T.PLM 4.4, NKP 3.4, ఏన్కూరు 2.8, R.PLM 2.0, KMPL, PNBL 1.8, MDR 1.4, సింగరేణి, ఎర్రుపాలెం 0.8, MDGD 0.6, కొణిజర్ల 0.4 నమోదైంది.
ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది 882 జలాశయాల్లో 3.49కోట్ల చేపపిల్లలు ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించి టెండర్ల దరఖాస్తు కోసం ఆహ్వానించిన విషయం తెలిసింది. అయితే జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్ ఒకటి నాటికి మూడు టెండర్లు నమోదైనట్లు సమాచారం. దీంతో గడువును ఈనెల 8వ తేదీ వరకు పెంచారు. ఆపై టెండర్లను ఖరారు చేశాక చేప పిల్లల పంపిణీ చేయనున్నారు.
Sorry, no posts matched your criteria.