India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఖమ్మం జిల్లాలో మంగళవారం నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అత్యధికంగా ముదిగొండ (పమ్మి)లో 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపారు. అటు వైరా, నేలకొండపల్లిలో 40.3, ఖమ్మం(U) ఖానాపురం పీఎస్ లో 40.1, ఖమ్మం (R) పల్లెగూడెం, చింతకాని, మధిరలో 39.9, పెనుబల్లిలో 39.4, రఘునాథపాలెం (పంగిడి)లో 39.1, ఏన్కూరులో 38.6, తిరుమలాయపాలెంలో 38.4, కొణిజర్లలో 37.7 వైరాలో 37.2 నమోదైంది.

ఖమ్మం: ఉపాధి కల్పనపై వృత్తి శిక్షణా సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి పురంధర్ ఓ ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ట్రైనింగ్ పార్టర్‌గా ఉన్న వృత్తి శిక్షణ సంస్థలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హత కలిగిన వృత్తి శిక్షణ సంస్థలు తమ దరఖాస్తులను HYDలోని రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏప్రిల్ 12 లోగా సమర్పించాలన్నారు.

రాజీవ్ యువ వికాసం పథకం కింద వచ్చే దరఖాస్తుల స్వీకరణ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో రాజీవ్ యువ వికాసం దరఖాస్తు స్వీకరణ ప్రక్రియను మంగళవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అప్లికేషన్లు సమర్పించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్‌లను పరిశీలించారు. కార్పొరేషన్ కార్యాలయంలో దరఖాస్తుల స్వీకరణ కోసం 5 కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు.

ఖమ్మం: గురుకుల (రెసిడెన్షియల్) జూనియర్ కళాశాలల్లో 2025-26 విద్యా సం.కి ఇంటర్మీడియట్ మొదటి సం. ప్రవేశాలకు మే 10న ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు గురుకుల జిల్లా సమన్వయ అధికారిణి రమ ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూప్‌లలో చేరుటకు మే 10న ఉ.10 నుండి మ.12-30 వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. www.tgrjdc.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.

రఘునాథపాలెం: క్షయ వ్యాధి నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని డిఎంహెచ్వో డా. కళావతి బాయ్ అన్నారు. జిల్లాలో పని చేస్తున్న మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లకు విధి నిర్వహణ పై జిల్లా కలెక్టరేట్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వేసవిలో వడదెబ్బ తగలకుండా ఉండేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలలో అవగాహన పెంచాలన్నారు.

ఖమ్మం టేకులపల్లి ప్రభుత్వ ఐటిఐ మోడల్ కెరీర్ సెంటర్ నందు ఈ నెల 9న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి మాధవి తెలిపారు. అపోలో ఫార్మసీలో ఖాళీగా ఉన్న 100 ఉద్యోగాల ఖాళీల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 18-35 ఏళ్ళు కలిగి డీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, బీ ఫార్మసీ, పదో తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులని అన్నారు. ఉ.10 గంటలకు జాబ్ మేళా ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చాతకొండలో గల 6వ బెటాలియన్‌లో పలు అభివృద్ధి పనులకు రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తన ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ.20 లక్షలు మంజూరు చేశారు. ఈ మేరకు నిధులు కేటాయింపు లేఖను సంబంధిత అధికారులకు అందజేశారు. బెటాలియన్ కమాంటెండెంట్ డి. శివప్రసాద్ రెడ్డి, ఆర్.ఐ జీవి రామారావులు గతంలో ఎంపీ రవిచంద్రను కలిసి బెటాలియన్‌కు నిధులు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.

ఖమ్మం జిల్లాలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. మధ్యాహ్నం వరకు ఎండలు దంచి కొడుతుండటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సాయంత్రం ఉన్నట్టుండి వాతావరణం చల్లబడి ఈదురుగాలలో కూడిన వర్షం కురుస్తోంది. సోమవారం జిల్లాలో వడగండ్ల వర్షం కురవడంతో మామిడి కాయలు నేలరాలాయి. మొక్కజొన్న పంట నేలకొరిగింది. నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు అప్రమత్తమయ్యారు.

ఖమ్మం జిల్లాలో గడిచిన 24 గంటల్లో కురిసిన వర్షపాత నమోదు వివరాలను వాతావరణ శాఖ మంగళవారం వెల్లడించింది. వేంసూరులో అత్యధికంగా 16.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. సత్తుపల్లిలో 10.2 మిల్లీమీటర్ల వర్షపాతం, మధిరలో 4, ఎర్రుపాలెంలో 6.4, తల్లాడ 1.6, చింతకాని 0.8 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదయినట్లు తెలిపారు. మిగతా మండలాలలో వర్షం పడలేదు. జిల్లా వ్యాప్తంగా 39.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

కాకతీయ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వర్సిటీలో మొత్తం 258 పోస్టులకు గానూ 77 మంది మాత్రమే పని చేస్తున్నారు.ఇంకా 181 పోస్టుల ఉన్నాయి. అకడమిక్ రికార్డ్, పరిశోధనలు, విషయ పరిజ్ఞానం, బోధన నైపుణ్యం, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా ఈ పోస్టుల్లో ఎన్ని భర్తీ చేస్తారనే విషయాన్ని ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు.
Sorry, no posts matched your criteria.