Khammam

News July 11, 2024

గణాంకాల హ్యాండ్ బుక్‌ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్

image

ఖమ్మం: జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ 2023-2024 సంవత్సర జిల్లా గణాంకాల హ్యాండ్ బుక్‌ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఓ శ్రీనివాస్, డిఆర్డీవో సన్యాసయ్య, జడ్పి సిఇఓ ఎస్. వినోద్, సింగరేణి మండల మహిళా సమైఖ్య అధ్యక్షురాలు సుహాసిని, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

News July 11, 2024

రైతుల అభిప్రాయాలకు అనుగుణంగానే రైతు భరోసా: భట్టి

image

ఖమ్మం: రైతుల అభిప్రాయాలకు అనుగుణంగానే రైతు భరోసా ఖరారు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గురువారం ఆదిలాబాద్ కలెక్టరేట్‌‌లో భట్టి మాట్లాడారు. తమ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాల్లో కీలకమైన రైతు భరోసా పథకాన్ని ప్రజాక్షేత్రంలో రైతుల అభిప్రాయాలకు, అనుగుణంగా పకడ్బందీగా అమలు చేసి తీరుతుందన్నారు. 

News July 11, 2024

KMM: స్తంభం ఎక్కే పరీక్షకు ఒక్కరే హాజరు

image

టీజీ ఎన్పీడీసీఎస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో జూనియర్ లైన్‌మెన్‌ నియామకానికి అభ్యర్థులకు స్తంభం ఎక్కే సామర్థ్య పరీక్ష బుధవారం నిర్వహించారు. ఖమ్మం సర్కిల్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఇద్దరు అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపించగా ఒక్కరు మాత్రమే హాజరయ్యారు. అభ్యర్థి విజయవంతంగా స్తంభం ఎక్కడంతో అతని ధ్రువీకరణ పత్రాలు పరిశీలనకు వరంగల్ హెడ్ ఆఫీస్‌కు పంపిస్తున్నట్లు ఎస్ఈ సురేందర్ తెలిపారు.

News July 11, 2024

TGSRTC ఖమ్మం వైద్య అధికారి బదిలీ

image

ఉమ్మడి ఖమ్మం రీజియన్ TGSRTC వైద్యాధికారి డాక్టర్ గిరి సింహారావు బదిలీ అయ్యారు. సుదీర్ఘకాలంగా ఇక్కడ పని చేస్తున్న ఆయన మహబూబ్‌నగర్‌కు వెళ్లారు. ఉన్నతాధికారులు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయడంతో బుధవారం ఆయన విధుల నుంచి రిలీవ్ అయ్యారు. గత 25 సంవత్సరాల పైగా ఖమ్మం రీజియన్‌లో ఆయన సేవలో అందించారు.

News July 11, 2024

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి

image

భద్రాచలం వద్ద గోదావరి నీటి ప్రవాహం స్వల్పంగా పెరుగుతోంది. భద్రాచలంలో 11.5 అడుగుల మేర ప్రవహిస్తోంది. ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా వాగులు, రిజర్వాయర్ల నుంచి నీరు దిగువకు వస్తోంది. ఎగువన వాజేడు మండలం పేరూరు వద్ద కూడా నీటి మట్టం పెరుగుతోంది. కాగా కొత్త నీటితో గోదావరి కళకళలాడుతోంది. గోదావరి ప్రవాహం పెరుగుతుందని, గోదారి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

News July 11, 2024

TGSRTC ఖమ్మం వైద్య అధికారి బదిలీ

image

ఉమ్మడి ఖమ్మం రీజియన్ TGSRTC వైద్యాధికారి డాక్టర్ గిరి సింహారావు బదిలీ అయ్యారు. సుదీర్ఘకాలంగా ఇక్కడ పని చేస్తున్న ఆయన మహబూబ్‌నగర్‌కు వెళ్లారు. ఉన్నతాధికారులు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయడంతో బుధవారం ఆయన విధుల నుంచి రిలీవ్ అయ్యారు. గత 25 సంవత్సరాల పైగా ఖమ్మం రీజియన్‌లో ఆయన సేవలో అందించారు.

News July 11, 2024

బోనమెత్తిన డిప్యూటీ సీఎం సతీమణి

image

మధిర: ఆషాఢ బోనాలు సందర్భంగా ప్రజా భవన్ నుంచి డిప్యూటి సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి, అమ్మ ఫౌండేషన్ ఛైర్మన్ మల్లు నందిని విక్రమార్క సంప్రదాయంగా బోనాలు తయారు చేశారు. అనంతరం బోనాలను ఎత్తుకొని ఎల్లమ్మ తల్లికి సమర్పించారు. అదేవిధంగా ఎల్లమ్మ తల్లి అమ్మవారికి పట్టు వస్త్రాలను అందజేశారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని పేర్కొన్నారు.

News July 11, 2024

మధిర: రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి

image

మధిర మండలం మడుపల్లి గ్రామంలో నిన్న రోడ్డు పక్కకు ఓ <<13600268>>కారు <<>>దూసుకెళ్లి డ్రైవర్‌కు గాయాలైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో గాయపడ్డ కారు డ్రైవర్ రమేశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. రమేశ్ మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News July 11, 2024

ప్రకాశం జిల్లాలో ఖమ్మం బాలిక ఆత్మహత్య

image

ప్రకాశం జిల్లా మేదరమెట్లలో బుధవారం ఖమ్మం జిల్లాకు చెందిన బాలిక(14) చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కొద్దిరోజుల క్రితం కూలీ పనుల నిమిత్తం ప్రకాశం జిల్లాలో బంధువుల వద్ద ఉంటూ, పనికి వెళ్తుంది. ఈక్రమంలో బుధవారం అర్ధరాత్రి బాలిక కనిపించకపోవడంతో పరిసర ప్రాంతాలు వెతకగా చెట్టుకు ఉరేసుకుని కనిపించిందని బాలిక తండ్రి దేవయ్య తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. వివరాలు తెలియాల్సి ఉంది.

News July 11, 2024

మణుగూరు: వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు 

image

కొత్తగూడెం జిల్లా మణుగూరు పోలీసులు ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తిని రక్షించారు. పట్టణంలోని సురక్షా బస్టాండ్ సమీపంలో జాఫర్ అనే వ్యక్తి పురుగు మందు తాగి బలవన్మరణానికి యత్నించాడు. అనంతరం 100కు ఫోన్‌ చేసి చెప్పాడు. మణుగూరు బ్లూకోట్ పోలీసులు జాఫర్‌ను గుర్తించి ఆసుపత్రికి తరలించి ప్రాణాలు పోకుండా కాపాడారు. పోలీసులను పలువురు అభినందిస్తున్నారు.