Khammam

News March 17, 2025

ఖమ్మం పాత బస్టాండ్‌లో సౌకర్యాలు నిల్..!

image

ఖమ్మం పాత బస్టాండ్‌లో సౌకర్యాలు అధ్వానంగా ఉన్నాయని ప్రయాణికులు వాపోయారు. కనీసం కూర్చోవడానికి కుర్చీలు, ప్యాన్లు లేవన్నారు. మూత్రశాలలు సైతం కంపుకోడుతున్నాయని చెబుతున్నారు. బస్టాండ్ అవరణలో ఉన్న షాపుల వారు ఉన్న రేట్లకంటే అధికంగా వసూళ్లు చేస్తున్నారన్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలంటున్నారు.

News March 17, 2025

నిరుద్యోగ యువత అప్లై చేసుకోవాలి: పీవో

image

రాజీవ్ యువ వికాసం పథకం కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగ గిరిజన యువత స్వయం ఉపాధి పొందడానికి దరఖాస్తు చేసుకోవాలని భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత, ఆసక్తిగల గిరిజన నిరుద్యోగులు https://tgobmmsnew.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా ఏప్రిల్ 5 లోపు అప్లై చేసుకోవాలని సూచించారు. మరింత సమాచారం కోసం ఎంపీడీవో కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు.

News March 17, 2025

ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్యాంశాలు..!

image

∆}ఖమ్మం నగరంలో సినీ హీరో సుమన్ సందడి∆}రాజీవ్ యువ వికాసంపై Dy.CM భట్టి సమీక్ష∆} తిరుమలాయపాలెం:పురుగుమందు నీళ్లు తాగి వ్యక్తి మృతి∆} సత్తుపల్లి:సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యేలు, జేఏసీ నేతలు∆} బోనకల్:అనుమానాస్పదంగా వివాహిత ఆత్మహత్య∆} ఖమ్మం: కారులో మంత్రి పొంగులేటి షి’కారు’∆} ఖమ్మం: అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నాం: మంత్రి తుమ్మల∆}ఖమ్మంలో కేటీఆర్, జగదీశ్ రెడ్డిల దిష్టిబొమ్మ దహనం

News March 16, 2025

టీ పాలెం: పురుగుమందు కలిపిన నీళ్లు తాగి వ్యక్తి మృతి

image

పురుగుమందు కలిసిన మంచినీళ్లు తాగి రైతు మృతి చెందిన ఘటన తిరుమలాయపాలెం మండలం సోలిపురం పిక్యాతండాలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. బీ.రామోజీ అనే వ్యక్తి కాకరవాయిలో భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు. తన పొలం పక్క రైతు రవి పాత కక్షల నేపథ్యంలో తన వెంట తెచ్చుకున్న నీళ్లలో పురుగుమందు కలిపాడు. ఆ నీటిని తాగి రామోజీ అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News March 16, 2025

రాజీవ్ యువ వికాసంపై Dy.CM భట్టి సమీక్ష

image

ప్రజా భవన్‌లో రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభంపై అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాజీవ్ యువ వికాసం పథకం విధి విధానాలు, కావలిసిన నిధులపై చర్చించారు. ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ ఛైర్మన్లు ప్రీతం, బెల్లయ్య నాయక్, ఒబేదుల్లా కొత్వాల్, తదితరులు పాల్గొన్నారు.

News March 16, 2025

ఖమ్మం: అనుమానాస్పదంగా వివాహిత ఆత్మహత్య

image

ఓ వివాహిత తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పలు అనుమానాలకు తావిస్తోంది. ఖమ్మం జిల్లా బోనకల్ మండల పరిధిలోని ఆళ్లపాడుకు చెందిన షేక్ మస్తాన్, జరీనా(28) దంపతులు. జరీనా అప్పటి వరకు ఇంట్లో పని చేసుకుంటుండగా, విశ్రాంతి తీసుకోడానికి ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. కొంత సమయం తర్వాత ఇంట్లో వాళ్లు చూడగా, ఉరి వేసుకొని ఉంది. ఎస్ఐ మధుబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 16, 2025

ఇందిరమ్మ ప్రభుత్వంలో విద్య, వైద్యానికి పెద్ద పీట: పొంగులేటి

image

ఇందిరమ్మ ప్రభుత్వంలో విద్య, వైద్యానికి పెద్ద పీట వేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఇల్లందు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. 58 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి రూ.200కోట్ల చొప్పున మొత్తం 11,600కోట్లను కేటాయించుకోని ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని తెలిపారు.

News March 16, 2025

ఖమ్మం జిల్లాలో చికెన్ ధరలు ఇలా..

image

ఖమ్మం జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. చికెన్ (విత్ స్కిన్) KG రూ. 160 ఉండగా, స్కిన్లెస్ కేజీ రూ. 180 ధర పలుకుతుంది. అలాగే లైవ్ కోడి రూ. 110 మధ్య ఉంది. కాగా బడ్ ఫ్లూ ఎఫెక్ట్ తో గత నెల క్రితం భారీగా అమ్మకాలు పడిపోగా.. ప్రస్తుతం అమ్మకాలు పెరగాయని, ధర సైతం పెరిగిందని నిర్వాహకులు తెలుపుతున్నారు.

News March 16, 2025

పెనుబల్లి: మేక పంచాయితీ.. దాడి, ఫిర్యాదు.!

image

మేక తెచ్చిన పంచాయితీలో యువకుడికి తీవ్ర గాయాలైన ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో శనివారం చోటుచేసుకుంది. మండలానికి చెందిన కొందరు యువకులు కారులో టేకులపల్లి సాగర్ కాల్వ వద్ద ఈత కొడుతుండగా, అటుగా వచ్చిన మేకల గుంపులోని ఓ మేక కారుపై ఎక్కడంతో, పశువులు కాపరిని యువకులు కొట్టారు. అది గమనించిన స్థానికులు యువకులను కొట్టడంతో మారేష్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. యువకులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

News March 16, 2025

ఖమ్మం: ఏప్రిల్ 20 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు

image

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు వచ్చే నెల 20 నుంచి నిర్వహించనున్నట్లు డీఈఓ సోమశేఖర శర్మ, ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ మద్దినేని పాపారావు తెలిపారు. పది, ఇంటర్మీడియట్ థియరీ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 26వ తేదీ వరకు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 గంటల వరకు జరుగుతాయని వెల్లడించారు.