Mahbubnagar

News August 8, 2025

MBNR: PUలో 14న క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్

image

పాలమూరు యూనివర్సిటీలో లాబోరేటరీస్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 14న క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ప్లేస్మెంట్ అధికారి డా.అర్జున్ కుమార్ Way2Newsతో తెలిపారు. ట్రైనీ సూపర్‌వైజర్/గ్రాడ్యుయేట్ అప్రెంటిస్/హెల్పర్, వివిధ పోస్టులకు SSC,INTER,ITI,బి.టెక్,B.Sc/M.Sc పూర్తి చేసిన విద్యార్థులు అర్హులన్నారు. ఫొటోలు, అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెస్యూమ్‌తో హాజరుకావాలన్నారు. SHARE IT.

News August 8, 2025

తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి

image

తెలంగాణ రాబిన్‌హుడ్‌గా పేరు పొందిన పండుగ సాయన్న1840-1900లో పేదల పక్షాన పోరాటం చేశారు. MBNR జిల్లా నవాబ్‌పేట మండలం మెరుగోనిపల్లెకు చెందినవారు. ఆనాటి నిజాం అధికారులను, దేశ్‌ముఖ్‌లను ధైర్యంగా ప్రశ్నించారు. కొత్త బహుజన రాజ్యాన్ని స్థాపించడానికి ప్రయత్నించారు. ఈ కారణంగా 1890 డిసెంబర్ 10న నిజాం సర్కార్ ఆయన తల నరికి జిల్లా కేంద్రంలోని తిర్మలదేవుని గుట్టపై విసిరేశారు. నేడు పండుగ సాయన్న జయంతి. SHARE IT

News August 8, 2025

జడ్చర్లలో 114.8 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం

image

మహబూబ్ నగర్ జిల్లాలో గడచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా జడ్చర్లలో 114.8 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. రాజాపూర్ 98.0, అడ్డాకుల 80.8, బాలానగర్ మండలం ఉడిత్యాల 79.8, నవాబుపేట 79.0, భూత్పూర్ 59.8, బాలానగర్, చిన్న చింతకుంట (M) వడ్డేమాన్ 49.0, కౌకుంట్ల 43.3, మహమ్మదాబాద్ 40.0, కోయిలకొండ మండలం పారుపల్లి 18.5, హన్వాడ 10.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News August 7, 2025

MBNR: పోలీసులకు ఎస్పీ అత్యవసర ఆదేశాలు

image

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ జానకి గురువారం రాత్రి పోలీసు అధికారులతో అత్యవసర కాన్ఫరెన్స్ నిర్వహించారు. నేడు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు వాగులు వంకల వైపు వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేయాలన్నారు. పాత ఇండ్లలో నివసించే వారు ఆ ఇండ్లలో ఉండకుండా పునరావాస కేంద్రాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

News August 7, 2025

MBNR: సైబర్ క్రైమ్.. అప్రమత్తంగా ఉండండి

image

ఉమ్మడి జిల్లాలో సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పోలీస్ సిబ్బంది అవగాహన కల్పించిన పలువురు మోసపోతూనే ఉన్నారు. అనుమానాస్పద లింకులు, వీడియో కాల్స్, డబ్బు వస్తుందన్న ఆశతో క్లిక్ చేయడం వల్ల వచ్చే మోసాలపై హెచ్చరికలు చేస్తున్నారు. మోసపోయినట్టయితే వెంటనే 1930కు కాల్ చెయ్యాలని, www.cybercrime.gov.in పోర్టల్ ద్వారా ఫిర్యాదు చెయ్యాలన్నారు. సైబర్ కేటుగాళ్లతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

News August 6, 2025

జడ్చర్ల: గల్లంతైన మహిళా మృతదేహం లభ్యం

image

జడ్చర్ల మండలం నెక్కొండలో బుధవారం ప్రమాదవశాత్తు కాలు జారి వాగులో పడి ఓ మహిళా గల్లంతైన విషయం తెలిసిందే. స్థానికుల వివరాలు ప్రకారం.. నెక్కొండ గ్రామానికి చెందిన జ్యోతి (34) వ్యవసాయ పనులకు వెళ్తుండగా కాలు జారి గల్లంతయింది. ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని జ్యోతి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతురాలికి నలుగురు కుమారులు, భర్త ఉన్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News August 6, 2025

జడ్చర్ల: వాగులో జారి పడి మహిళా గల్లంతు

image

వాగులో జారిపడి మహిళా గల్లంతైన ఘటన జడ్చర్ల మండలంలో బుధవారం జరిగింది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. నెక్కొండకు చెందిన జ్యోతి (35) పొలం పనులకు వెళ్తుండగా వాగులో జారి పడి గల్లంతు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని వాగులో గాలింపు చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News August 6, 2025

MBNR: సర్కార్ పేటలో అత్యధిక వర్షపాతం నమోదు

image

జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా గండీడ్ మండలం సర్కార్ పేటలో 24.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మహమ్మదాబాద్ 9.5, చిన్నచింతకుంట 11.0, సీసీ కుంట మండలం వడ్డేమాన్ లో 7.3, కౌకుంట్ల 3.8, జడ్చర్ల 3.5, రాజాపూర్ 1.3, మహబూబ్ నగర్ అర్బన్, బాలానగర్ 1.0 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది.

News August 5, 2025

MBNR: ఆగస్టు 15 వేడుకలను ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్

image

ఆగస్టు 15 వేడుకలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవానికి సంబంధించి వివిధ శాఖల అధికారులతో మంగళవారం ఆమె సమావేశం అయ్యారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని పరేడ్ గ్రౌండ్‌లో వేదిక వీఐపీలు, అధికారులు, మీడియా ఇతరులకు సీటింగ్ ఏర్పాటు చేయాలని అన్నారు. పెరేడ్ మైదానంలో తాగునీరు, మౌలిక వసతులు ఏర్పాటు చేయాలన్నారు.

News August 5, 2025

PU ఇంజినీరింగ్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్‌గా మొహియుద్దీన్

image

పాలమూరు యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్‌గా డాక్టర్ గౌస్ మొహియుద్దీన్ నియమితులయ్యారు. ఈ మేరకు నియామక పత్రాన్ని పాలమూరు యూనివర్సిటీ ఉపసంచాలకులు ఆచార్య జి.ఎన్.శ్రీనివాస్ మంగళవారం అందజేశారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలమూరు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య పూస రమేశ్ బాబు తదితరులు పాల్గొన్నారు.