India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జడ్చర్ల మండలం కిష్టారం గ్రామపంచాయతీ అంబఠాపూర్ ఆమ్లెట్ గ్రామానికి చెందిన తానేం బాలయ్య, రాములమ్మ వృద్ధ దంపతులు వాగు దాటే సమయంలో గల్లంతైన విషయం తెలుసుకున్న అధికారులు వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు. అడిషనల్ కలెక్టర్ డి.మధుసూదన్ నాయక్, తహశీల్దార్ నర్సింగ్ రావు గురువారం రాత్రి 10 గంటలకు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను సమీక్షించారు.

ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం రద్దు చేయడంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఆశావహుల్లో ఆశలు ఆవిరి అయ్యాయి. మళ్లీ షెడ్యూల్ వస్తే ఇప్పుడు ఖరారైన రిజర్వేషన్లు ఉంటాయో.. లేదోనని ఆందోళన చెందుతున్నారు. ఎన్నికలు వాయిదా పడటంతో మరి కొందరు ఆనందంలో ఉన్నారు. తర్వాత రిజర్వేషన్లు తమకు అనుకూలంగా వస్తుందో.. రాదోనని అయోమయంలో పడ్డారు.

మహబూబ్ నగర్ జిల్లా బాదేపల్లి ZPHS(BOY’S) క్రీడా ప్రాంగణంలో ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో అండర్-17 విభాగంలోని బాల, బాలికలకు శుక్రవారం వాలీబాల్ టోర్నమెంట్ కామ్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి శారదాబాయి తెలిపారు. పాల్గొనే ప్రతి క్రీడాకారుడు బోనఫైడ్, ఆధార్, SGF అర్హత పత్రంతో ఉ.8.30 గంటలకు రిపోర్ట్ చేయాలన్నారు. పూర్తి వివరాలకు PD కళ్యాణ్‌ను సంప్రదించాలన్నారు.

మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని చౌదర్పల్లి శివారులో నేషనల్ హైవే 167పై ఈనెల ఆరో తేదీన గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి గాయపడ్డాడు. అతడిని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ నేడు మృతిచెందినట్లు రూరల్ ఎస్ఐ విజయ్ వెల్లడించారు. మృతుడు వయసు 45 సంవత్సరాలు ఉంటుందని, మృతదేహాన్ని జనరల్ ఆసుపత్రి మార్చరీలో భద్రపరిచామని, వివరాలకు 8712659336 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు సమాజ సేవకు అంకితం అవ్వాలని పాలమూరు యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రవీణ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని సెంట్రల్ లైబ్రరీలో ఏడు రోజుల క్యాంపును నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మూఢనమ్మకాలు, బాల్య వివాహాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాలపై కూడా అవగాహన కల్పించాలని కోరారు.

ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో ఏర్పాటు చేసిన భవిత కేంద్రాన్ని కలెక్టర్ విజయేందిర బోయి గురువారం తనిఖీ చేశారు. భవిత కేంద్రంలో పిల్లలకు అందిస్తోన్న ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ విధానాన్ని పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న టాయిలెట్‌ను పరిశీలించారు. టాయిలెట్లోకి వెళ్లేందుకు భవనం నుంచి దారి ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మంజుల పాల్గొన్నారు.

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండల పరిషత్ కార్యాలయంలో కొడుగల్ గ్రామపంచాయతీ కార్యాలయం క్లస్టర్లో ఎంపీటీసీ నామినేషన్ స్వీకరణ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఈరోజు పరిశీలించారు. అనంతరం ఎన్నికల సజావు నిర్వహణ, భద్రత, ఉద్యోగుల సంఖ్య, మౌలిక వసతులు సదుపాయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

ఎన్నికల కోడ్‌ను జిల్లాలో పటిష్టంగా అమలు చేస్తున్నట్లు ఎస్పీ డి.జానకి వెల్లడించారు. ఎన్నికల సంఘం సూచనలు, నిబంధనల మేరకు వ్యవహరించాలని, శాంతి భద్రతలకు ఆటంకం కలిగించవద్దని ఆమె కోరారు. అనుమానాస్పద కార్యకలాపాలపై పోలీసు నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసినా, ఇతరుల మనోభావాలను కించపరిచేలా పోస్ట్‌లు పెట్టినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ ప్రక్రియ సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లాలో పటిష్ట నిఘా ఉంచినట్లు ఎస్పీ డి.జానకి తెలిపారు. జిల్లాలోని 16 మండలాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఉంటుందని, డీఎస్పీలు, సీఐలు పర్యవేక్షిస్తారని చెప్పారు. కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధి నిబంధనలు ఉంటాయని, బారికేడ్లు ఏర్పాటు చేశామని ఆమె వివరించారు.
SHARE IT

మహబూబ్‌నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. బాలానగర్ మండలం ఉడిత్యాలలో 13.8 మి.మీ. అత్యధిక వర్షపాతం నమోదైంది. చిన్నచింతకుంట మండలం వడ్డేమాన్‌లో 8.5 మి.మీ., జడ్చర్లలో 6.5 మి.మీ., నవాబుపేటలో 3.5 మి.మీ., మిడ్జిల్‌లో 2.8 మి.మీ., కౌకుంట్ల 2.0 మి.మీ., చిన్నచింతకుంటలో 1.8 మి.మీ. వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.