India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి కోరారు. ఏప్రిల్ 5వ తేదీన జగ్జీవన్ రామ్, 14వ తేదీన అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టరేట్‌లో బుధవారం సంబంధిత సంఘాల ప్రతినిధులు అధికారులతో సమావేశం అయ్యారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో వెంకటరెడ్డి పాల్గొన్నారు.
మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని పాలమూరు యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య శ్రీనివాస్‌ను బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ సాగర్ బుధవారం కోరారు. అలాగే పాలమూరు విశ్వవిద్యాలయంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే అధ్యయన కేంద్రాన్ని కూడా నెలకొల్పాలన్నారు. ఈ అధ్యయన కేంద్రం ద్వారా జ్యోతిరావు ఫూలే ఆశయాలను కొనసాగించడానికి వీలవుతుందని వెల్లడించారు.
మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ఈనెల 30వ తేదీ వరకు 30 పోలీస్ యాక్ట్ 1961 అమలులో ఉంటుందని ఎస్పీ జానకి ధరావత్ వెల్లడించారు. పోలీసుల అనుమతులు లేకుండా ఎటువంటి మీటింగులు, ఊరేగింపులు, ధర్నాలు నిర్వహించకూడదన్నారు. నిషేధిత కత్తులు, చాకులు, కర్రలు, జెండా కర్రలు, తుపాకులు, పేలుడు పదార్థాలు వాడకూడదన్నారు. డీజేలు లౌడ్ స్పీకర్లను కూడా పూర్తిస్థాయిలో నిషేధించామన్నారు.
ఊర్కోండ మండలంలోని పేట ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో వివాహితపై 8 మంది సామూహిక అత్యాచారం చేసిన ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. కొంతకాలంగా దేవాలయం వద్దకు వచ్చే మహిళల పట్ల పోకిరీల ఆగడాలు అధికమైనట్లు తెలుస్తుంది. గతంలో అనేకమంది మహిళలకు వేధింపులు ఎదురైనట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేస్తే మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ బీహార్ వాసి మృతి చెందిన ఘటన బాలానగర్ మండల కేంద్రంలో జరిగింది. ఎస్ఐ లెనిన్ వివరాల ప్రకారం.. బీహార్‌కి చెందిన బినోద్ ముర్ము(32) మండల కేంద్రం శివారులోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. మంగళవారం రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
ఎస్ఎల్బీసీ శ్రీశైలం ఎడమ గట్టు సొరంగంలో చిక్కుకొని ప్రాణాలు వదిలిన వారి ఆచూకీ కోసం 38 రోజులుగా సహాయక కొనసాగుతున్నాయి. 24 గంటల పాటు మూడు షిప్టుల్లో 600 మంది రెస్క్యూ బృందాలు శ్రమిస్తూనే ఉన్నారు. ఈ చర్యలను పరిశీలించేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం రానున్నారు. మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే లు రానున్నారు.
దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే అభివృద్ధిని విస్మరించి అక్రమంగా రూ.కోట్లు ఆర్జించాడని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. సన్న బియ్యం పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. గ్రామాల్లో ఒక్క రేషన్ కార్డు కానీ,డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కానీ మాజీ ఎమ్మెల్యే ఇవ్వలేదన్నారు.గత ప్రభుత్వ పాలకులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి చిప్ప చేతికిచ్చారన్నారు. ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ సీఎం హామీలను అమలు చేస్తున్నారన్నారు.
బెట్టింగ్, ఆన్‌లైన్ గేమింగ్‌కు దూరంగా ఉండాలని, అవి ప్రాణాలతో చెలగాటమాడుతాయని మహబూబ్‌నగర్ ఎస్పీ డి.జానకి ఓ ప్రకటనలో హెచ్చరించారు. విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్, నిషేధిత గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లో IPL బెట్టింగ్‌లకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా బెట్టింగ్ కార్యకలాపాలకు పాల్పడితే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
ఫ్రీ బస్సు కారణంగా తాము బస్సు ఎక్కేందుకు అవకాశం లేకుండా పోయిందని పలువురు పురుషులు మంగళవారం వాపోయారు. మహబూబ్‌నగర్ బస్టాండ్‌లో వచ్చిన బస్సులన్నింటిలో మహిళలు పెద్ద ఎత్తున ఎక్కుతుండడంతో తమ పరిస్థితి ఏంటని పురుషులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఉగాది, సోమవారం రంజాన్, మంగళవారం సెలవు, బుధవారం వర్కింగ్ డే కావడంతో హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ బస్సు ఎక్కేందుకు ప్రయాణికులు పోటీ పడ్డారు.
ఊరుకొండ పేటలో మహిళపై జరిగిన అత్యాచార ఘటన అత్యంత దురదృష్టకరమని, ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు మహిళల భద్రత అంశం ఆందోళన కలిగిస్తోందని BRS నేత, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నేర స్థలంతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కేసు పక్కాగా దర్యాప్తు చేయాలని పోలీసులను కోరారు. బాధితురాలిని ప్రభుత్వం ఆదుకోవాలని, నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు.
Sorry, no posts matched your criteria.