India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించిన ఘటన గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపురం గ్రామ శివారులోని ఆర్టీఏ చెక్‌పోస్ట్ వద్ద సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. నాందేడ్ నుంచి పసుపు లోడ్‌తో కేరళకు వెళ్తున్న లారీ హైవే పక్కన ఆగింది. ఈ సమయంలో షాద్‌నగర్ నుంచి ఆళ్లగడ్డ వెళ్తున్న లారీ అతివేగంగా వచ్చి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో లారీ డ్రైవర్ షేక్ హుస్సేన్, క్లీనర్ వీరయ్య మృతిచెందారు.
మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట మండలం యన్మన్గండ్ల గ్రామ సమీపంలోని దేవరగట్టులో 3 రోజులుగా 2 చిరుత పులులు సంచరిస్తున్నాయని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒంటరిగా బయటకు వెళ్లాలంటే భయంగా ఉందని, అటవీ శాఖ అధికారులు స్పందించి సాధ్యమైనంత త్వరగా వాటిని బంధించాలన్నారు. స్థానిక గుట్టపై చిరుత పులులు సంచరిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మహబూబ్‌నగర్‌లో ఈరోజు తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. మహబూబ్‌నగర్ పరిధిలోని ప్రభుత్వ వైద్య కళాశాల వద్ద క్వారీ గుంతలో ఈతకు దిగిన ముగ్గురు యువకులు నీట మునిగారు. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా మరో ఇద్దరు గల్లంతయ్యారు. ఒక యువకుడి మృతదేహం లభ్యం కాగా మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇద్దరు యువకులు మునిగిపోతుండగా వాళ్లని కాపాడబోయి మరో యువకుడు కూడా మునిగిపోయాడు.
ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిన్న మహమ్మదాబాద్ మండలంలో జరిగింది. పోలీసుల వివరాలు.. జంగంరెడ్డిపల్లికి చెందిన ఆనంద్(24) HYDలో కూలీ పనిచేసుకుని జీవిస్తున్నాడు. శనివారం సొంతూరుకు వచ్చాడు. మద్యానికి బానిసైన ఆనంద్.. తనకంటూ ఎవరూ లేరని తనలో తాను కుమిలిపోవటం చేస్తుండేవాడు. ఈ క్రమంలో పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరేసుకుని మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదైంది.
బాదేపల్లిలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందన ఘటన నిన్న జరిగింది. పోలీసుల వివరాలు.. పాతబజార్‌కు చెందిన అంజమ్మ(73) శనివారం రాత్రి తన చిన్న కొడుకు నగేశ్ ఇంట్లో నిద్రపోయింది. ఆదివారం తెల్లవారుజామున ఇంటి ఎదుట రోడ్డుపై శవమై కనిపించింది. ఇంట్లో పడుకున్న ఆమె రోడ్డుపై శవమై పడి ఉండటంతో కుటుంబసభ్యుల అనుమానం వ్యక్తం చేశారు. ఆమె మృతికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు. ఈమేరకు కేసు నమోదైంది.
మిడ్జిల్ మండలానికి చెందిన తండ్రి, కొడుకులు అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్థుల వివరాలు.. ఓ గ్రామానికి చెందిన తండ్రి, కొడుకు రెండు రోజుల నుంచి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లల్లో వెతికారు. అయినా ఫలితం లేకపోవడంతో అతని భార్య స్థానిక పోలీస్ స్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేశారు.
కొడంగల్ నియోజకవర్గంలోని భూనీడ్‌లో సోమవారం జరిగే అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి పాల్గొంటారని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తెలిపారు. అనంతరం తిమ్మిరెడ్డిపల్లిలో జరిగే సద్గురు సంత్ గురులోకమసంద్ మహరాజ్ బావోజీ జాతర బ్రహ్మోత్సవంలో పాల్గొంటారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులు రావాలని కోరారు.
యువతకు ఉపాధి కల్పించేందుకుగానూ రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసానికి ఆసక్తి గల వారంతా ఈనెల 14లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లాకలెక్టర్ విజయేంద్రబోయి శనివారం తెలిపారు. 21 నుంచి 60ఏళ్ల వరకు వయస్సున్న వారు రూ.లక్షన్నర వార్షిక ఆదాయం ఉన్న వారంతా సంబంధిత మండల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. యూనిట్ రూ.50వేల నుంచి రూ.5లక్షల వరకు ఉంటుందని ఆసక్తికలిగిన వారంతా సద్వినియోగపరుచుకోవాలన్నారు.
రాజకీయ లబ్ధి పొందేందుకు గాలి మాటలు మాట్లాడొద్దని ఎంపీ డీకే అరుణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను హెచ్చరించారు. AP పర్యటనలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. HUC భూముల విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి BJP ఎంపీ సహకరిస్తున్నాడని ఆరోపిస్తున్న కేటీఆర్ దమ్ముంటే ఎంపీ పేరు చెప్పాలని డిమాండ్ చేశారు. పేరు చెప్పకుండా బీజేపీపై నిందలు వేస్తే ఖబర్దార్ అని తీవ్ర స్థాయిలో ఆమె హెచ్చరించారు.
అంబేడ్కర్‌ను అడుగడుగున మోసం చేసింది కాంగ్రెస్ అని మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ అన్నారు. ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ రాజ్యాంగంపై, పార్టీపై చేస్తున్న దుష్ప్రచారాలు తిప్పికొట్టి కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దళితుల సంక్షేమానికి, అంబేద్కర్ సంయాన్ అభియాన్ కార్యక్రమాలు 13 నుంచి 25 వరకు జరుగుతాయన్నారు.
Sorry, no posts matched your criteria.