India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందక ఓ ప్రాణం పోయిందని కుటుంబసభ్యులు మంగళవారం సాయంత్రం హైవేపై ధర్నా చేశారు. పీర్లపల్లి తండాకు చెందిన రవి నాయక్ అప్పుల బాధతో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే వైద్యం అందక ప్రాణాలు దక్కలేదని బంధువులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని హైవేపై మృతదేహంతో బైఠాయించారు.

అరుణాచలం గిరి ప్రదక్షిణకు MBNR డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్ నడుపుతున్నట్లు డిపో మేనేజర్ సుజాత Way2Newsతో తెలిపారు. Sep 5న రాత్రి 7గం.కు బస్ MBNR నుంచి బయలుదేరుతుందని, 6న కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, అరుణాచలం చేరుకొని అరుణాచలం గిరిప్రదక్షిణ, 8న MBNRకు చేరుకుంటుందన్నారు. ఒక్కొక్కరికి రూ.3,600 (ప్యాకేజ్) టికెట్ ధర ఉందన్నారు. వివరాలకు 99592 26286, 94411 62588 ఫోన్ చేయాలన్నారు.Web:https://tsrtconline.in

వినాయక చవితి పండుగను అందరూ శాంతియుతంగా జరుపుకోవాలని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి అన్నారు. ప్రజలు భద్రతా నియమాలను పాటించి, సామాజిక సమన్వయం, పరిశుభ్రత, ట్రాఫిక్ నియమాలను పాటించాలని, పోలీసు సిబ్బంది పండుగ సమయంలో నిబద్ధతతో విధులు నిర్వహించాలన్నారు. ప్రతి ఒక్కరూ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు.

వినాయక చవితికి ఉమ్మడి పాలమూరు సిద్ధమైంది. గ్రామాల్లో, పట్టణాల్లో వీధి వీధికి గణపతి విగ్రహాలు కొలువు ధీరనున్నాయి. ‘జై బోలో గణేశ్ మహారాజ్ కు జై’ అనే స్లోగన్‌తో పాలమూరు మారుమోగనుంది. కొన్ని రోజులుగా పందిరి, డెకరేషన్ కోసం ఆరాట పడిన యువత నవరాత్రుల్లో పూజలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక గణేష్ పాటలతో, భజనలతో దద్దరిల్లనుంది.

మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ జానకి, వినాయక మండపాల నిర్వాహకులు పాటించాల్సిన సూచనలతో కూడిన కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ కరపత్రం ప్రకారం, ప్రతి మండపం వద్ద కనీసం ముగ్గురు వాలంటీర్లు ఉండాలి. మండపాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. అలాగే, కొత్త వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలని, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ సూచించారు. ఈ జాగ్రత్తల వల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించవచ్చు.

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం చిన్నచింతకుంటలో చోటుచేసుకుంది. ఎస్ఐ రామ్ లాల్ నాయక్ వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఎస్.రాము(39)మేస్త్రి పనిచేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఊకచెట్టు వాగు చెక్ డ్యామ్‌లో చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారీ వరద నీటిలో మునిగి ఊపిరాడక మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.

విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌కు పాల్పడే విద్యార్థులపై కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఎస్పీ డి.జానకి హెచ్చరించారు. ర్యాగింగ్‌లో పాల్గొనే విద్యార్థులను కళాశాల నుంచి తక్షణమే బహిష్కరిస్తారని, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, భవిష్యత్తులో ఉద్యోగావకాశాలు లేకుండా చేస్తారని తెలిపారు. ర్యాగింగ్ అనేది విద్యార్థుల భవిష్యత్తును మాత్రమే కాదు, సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అన్నారు.

వినాయక చవితి వేడుకలను పురస్కరించుకొని మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టినట్లు ఎస్పీ జానకి అన్నారు. వినాయక చవితి వేడుకలను పరిష్కరించుకుని జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీసు అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. వివాదాస్పద ప్రాంతాలలో దారికి అడ్డంగా మండపాలు ఏర్పాటు చేయకూడదన్నారు. అత్యవసర సేవలకు ఇబ్బందులు లేకుండా మండపాలు ఏర్పాటు చేయాలన్నారు.

నానో యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని మహబూబ్‌నగర్ కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులతో కలెక్టర్ సమస్య నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బందులు లేకుండా సక్రమంగా యూరియా సరఫరా అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.

వినాయక చవితి సందర్భంగా మహబూబ్‌నగర్ సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం (IDOC) నందు పీస్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్ అధ్యక్షతన వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వినాయక చవితి వేడుకలు శాంతి, సామరస్య వాతావరణంలో నిర్వహించాలన్నారు. అందరూ మత సమన్వయం పాటించాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.