India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మహబూబ్నగర్ జిల్లా పోలీసు కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ డి.జానకి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా నమోదైన అన్ని కేసుల్లో సమగ్ర విచారణ చేపట్టి నిందితులకు శిక్షలు పడేలా కృషి చేయాలని ఎస్పీ సూచించారు. SC,ST యాక్ట్, ఉమెన్ అగైనెస్ట్ కేసులు, పోక్సో కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. DSP వెంకటేశ్వర్లు, CIలు అప్పయ్య, ఇజాజ్ఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేసేందుకు కొత్త పద్ధతులను ఉపయోగిస్తున్నారని, అప్రమత్తంగా ఉండాలని ఉమ్మడి పాలమూరు జిల్లా పోలీసులు హెచ్చరిస్తున్నారు. SMలో ఏపీకే ఫైల్ ద్వారా ఫేక్ లింక్ పంపించి ఫోన్లను హ్యాక్ చేసి ఆర్థిక నష్టానికి గురిచేస్తున్నారన్నారు. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. SHARE IT

బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ యూజీ, పీజీలో అడ్మిషన్లకు ఈనెల 30 వరకు గడువు పొడిగించినట్లు ఉమ్మడి పాలమూరు జిల్లా ఓపెన్ యూనివర్సిటీ రీజినల్ కో-ఆర్డినేటర్ డాక్టర్ జి.సత్యనారాయణ గౌడ్ Way2Newsతో తెలిపారు. రెగ్యులర్గా కాలేజీకి వెళ్లి చదవలేని విద్యార్థులు, ఉద్యోగులకు ఓపెన్ యూనివర్సిటీ ఒక మంచి అవకాశం అని సూచించారు. పూర్తి వివరాలకు https://braou.ac.in వెబ్సైట్ను సందర్శించాలన్నారు.

2025-26 సంవత్సరానికి గాను ధాన్యం సేకరణకు ముందస్తు కార్యచరణ రూపొందించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్లోని ఆయన కార్యాలయంలో ఆయా శాఖల అధికారులతో రెవెన్యూ అదనపు కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోలుకి సరిపడా గన్ని బ్యాగులు, మిల్లింగ్ సామర్థ్యం స్టోరేజ్ స్పేస్ ముందుగా ఏర్పాటు చేసుకొని ఇలా కార్యచరణ రూపొందించాలని అన్నారు.

మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రభుత్వ ఐటిఐ బాలుర కళాశాలలో నేడు జాబ్ మేళా నిర్వహించామని జిల్లా ఉపాధి కల్పన అధికారిణి మైత్రిప్రియ Way2Newsతో తెలిపారు. 6 ప్రైవేట్ సంస్థలలో మొత్తం 414 ఉద్యోగ ఖాళీల కోసం వివిధ జిల్లాల నుంచి దాదాపుగా 122 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. వారిలో షార్ట్ లిస్టు తీసి.. అర్హులైన విద్యార్థులకు ఆఫర్ లెటర్ అందించినట్లు పేర్కొన్నారు.

పాలమూరు పార్లమెంట్ అభివృద్దే ధ్యేయంగా పాలమూరు ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి అడుగులు వేశారు. స్థానిక సమస్యలపై ఢిల్లీలో కేంద్ర మంత్రులు, మంత్రి శాఖల ముఖ్య కార్యదర్శులతో వరుస భేటీ అయ్యారు. గురువారం ఢిల్లీలో పార్లమెంట్ భవనంలో కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శిని తారాజీని కలిశారు. పలు మున్సిపాలిటీల అభివృద్ధి, ఇప్పటికే ఇచ్చిన ప్రతిపాదనలపై కీలక చర్చలు జరిపారు.

మహబూబ్ నగర్ జిల్లా అంబేడ్కర్ కళాభవన్లో ఎస్పీ డి.జానకి పోలీసులు శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా డీఎస్పీ వెంకటేశ్వర్లు హాజరై, గణేష్ మండప నిర్వాహకులకు ముఖ్య సూచనలు అందించారు. గణేష్ విగ్రహాల ప్రతిష్ఠాపనకు తప్పనిసరిగా https://policeportal. tspolice.gov.in/index.htm పోలీస్ పోర్టల్లో నమోదు చేసుకోవాలన్నారు. టౌన్ ఇన్స్పెక్టర్ హెజాజుద్దీన్, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గురువారం మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11:30 గంటలకు అమరరాజ కంపెనీ రోడ్డుతోపాటు, భూత్పూర్ మండలం అమిస్తాపూర్-రాందాస్ తండా, అప్పన్నపల్లి-ఇదిరా గ్రామాల మధ్య దెబ్బతిన్న రోడ్లను పరిశీలిస్తారు. అనంతరం ఆయన జిల్లా అధికారులతో రోడ్ల మరమ్మతులు, ఇతర అంశాలపై సమీక్ష నిర్వహిస్తారు.

పాలమూరు విశ్వవిద్యాలయంలో పీజీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. బుధవారం యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ జిఎన్ శ్రీనివాస్, పరీక్షల నియంత్రణ అధికారిణి డా.ప్రవీణ, పీజీ కాలేజ్ ప్రిన్సిపల్ డా.డి.మధుసూదన్ రెడ్డి, అబ్జర్వర్ డా.నూర్జహాన్ పరివేక్షించారు. మొత్తం 1911 మంది విద్యార్థులకు గాను.. 1,792 మంది హాజరయ్యారని, 64 మంది గైహాజరయ్యారని ఆమె తెలిపారు.

గణేష్ విగ్రహా మండప నిర్వాహకులకు డీఎస్పీ వెంకటేశ్వర్లు కీలక సూచనలు చేశారు.
✒DJలు వినియోగించరాదు.
✒మండపాల వద్ద CCTV కెమెరాలు అమర్చాలి.
✒భక్తుల కోసం క్యూ లైన్, బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలి.
✒రోడ్లపై, కాలిబాటలపై విగ్రహాలను పెట్టరాదు.
✒కేవలం భక్తి గీతాలే వాడాలి.
✒రా.10:00-ఉ.6:00 వరకు స్పీకర్లు నిషేధం.
✒మండపంలో ఎమర్జెన్సీ ల్యాంప్ తప్పనిసరి.
✒వాలంటీర్లందరికి ఫొటో ఐడీ కార్డులు ఉండాలన్నారు.
Sorry, no posts matched your criteria.