India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా పదోతరగతి పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా కొనసాగాయి. నేటి పరీక్షకు 12,785 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 12,744 మంది విద్యార్థులు హాజరయ్యారు. 41 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఇక మొత్తంగా 99.98 శాతం మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్టు అధికారులు వెల్లడించారు. పరీక్షల సందర్భంగా నేడు ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని పేర్కొన్నారు.
పదో తరగతి పరీక్షలను ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మహత్మా గాంధీ రోడ్, క్రీస్తు జ్యోతి విద్యాలయం, భూత్పూర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పరీక్షా కేంద్రాల్లో పదో తరగతి పరీక్షల నిర్వహణ తీరును ఆమె ఈరోజు పరిశీలించారు. మౌలిక సదుపాయాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, గురుకుల పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని వడ్డించాలని కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. శుక్రవారం భూత్పూర్ మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు అందించే భోజనాన్ని ఆమె పరిశీలించారు. కలెక్టర్ వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె పలు సూచనలు చేశారు.
మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కావడంతో విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్లను రూమ్ నెంబర్ వైస్‌గా చెక్ చేసుకుని వెళ్లారు. పరీక్ష కేంద్రంలో 144 సెక్షన్ విధించారు. పరీక్ష రాసే విద్యార్థులకు అధికారులు మంచినీటి వసతితో పాటు అత్యవసర వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచారు. మొదటి రోజు ప్రశాంతంగా పరీక్ష ముగిసింది.
ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలపై ఆంక్షలు విధిస్తూ వీసీ విడుదల చేసిన సర్క్యులర్‌ను వెనక్కి తీసుకోవాలని, HCUలో 400 ఎకరాల భూములను వేలం వేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని SFI PU అధ్యక్షుడు బత్తిని రాము పాలమూరు యూనివర్సిటీ PG కాలేజ్ ముందు ఈరోజు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నేతలు రాజేశ్, శ్రీనివాస్, విద్యుల్లత, ఈదన్న, సాయి, శిరీష, రాంచరణ్ పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో ట్రాన్స్‌ఫార్మర్లకు చుట్టూ కంచెలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రస్తుతం అవి ప్రమాదకరంగా మారాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పట్టణంలోని బండమీదిపల్లి, తెలంగాణ చౌరస్తా, పోలీస్ లైన్ తదితర జనావాసాలు,స్కూళ్లు ఉన్న ప్రాంతాల్లో రహదారులకు ఆనుకుని ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లు ప్రమాదకరంగా ఉన్నాయన్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ క్రీడలకు ఉమ్మడి పాలమూరు జిల్లా మక్తల్ పట్టణానికి చెందిన గోపాలం, వెంకటమ్మ దంపతుల నలుగురు కూతుర్లు ఎంపికయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఖోఖో మహిళల జట్టుకు అక్క చెల్లెలు బీ.రూప(PD), బీ.దీప(SGT), బీ.శిల్ప(వెటర్నరీ అసిస్టెంట్), బీ.పుష్ప(PET) ఎంపికయ్యారు. నేటి నుంచి ఈనెల 24 వరకు ఢిల్లీలో జరగనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్రీడల్లో వీళ్ళు పాల్గొంటారు. CONGRATULATIONS
ఈ నెల 16న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి మృతిచెందిన ఘటన నిన్న జరిగింది. పోలీసుల వివరాలు.. విజయనగర్ కాలనీలో నివాసం ఉంటున్న యూపీకి చెందిన విశ్వకర్మ(20), నిఖిల్ జైస్వాల్(19)లు పని మీద స్కూటీపై మెడికల్ షాప్‌కు వెళ్లారు. ఇంటికి తిరిగి వస్తుండగా ఓ ఆటో ఢీకొట్టింది. గాయపడిన వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిన్న నిఖిల్‌ను యూపీ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా టెన్త్ పరీక్షలపై అధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. విద్యార్థులకు ఏవైనా సూచనలు, సందేహాలు ఉంటే MBNR-98487 57542,93908 11476, NGKL-94406 48324,98850 17701 టోల్ ఫ్రీ నంబర్లు ఫోన్ చేయాలని అధికారులు తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. హాల్ టికెట్‌పై బార్ కోడ్ ఉంటుంది. స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రం లోకేషన్ సూచిస్తుందని అధికారులు తెలిపారు.
ఈనెల 15న చెట్టు ఎక్కి ఆకులు తెంచుతుండగా.. కాలు జారికిందపడి గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన బుధవారం అర్ధరాత్రి జరిగింది. స్థానికులు వివరాలు.. అడ్డాకుల మం. పొన్నకల్‌కు చెందిన సత్యం(30) గ్రామ సమీపంలోని చెట్టు ఎక్కి కిందపడ్డారు. ఆయనను కుటుంబసభ్యులు HYDలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
Sorry, no posts matched your criteria.