India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ నాయకులపై బెదిరింపులు అధికమవుతున్నాయని, నాయకులపై అక్రమ కేసులు పెడుతున్న పోలీసు అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్‌కు బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షులు యాదగిరి ఉన్నారు.
ఈనెల 31 నుంచి కురుమూర్తి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పోస్టర్‌ను దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. కలెక్టర్ విజయేంద్ర బోయి, ఎస్పీ జానకితో కలిసి ఇవాళ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలన్నారు.
వాల్మీకి మహర్షి జీవిత చరిత్ర అందరికీ ఆదర్శమని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. గురువారం నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో వాల్మీకి మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించారు. వాల్మీకి చిత్రపటానికి ఎస్పీ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. వాల్మీకి సామాన్య వ్యక్తిగా జీవించి బోయవానిగా జీవితం గడిపి సప్తఋషులు బోధనల ద్వారా మహర్షిగా మారి అద్భుతమైన రామాయణాన్ని రచించిన గొప్ప వ్యక్తి అని అన్నారు. సిబ్బంది పాల్గొన్నారు.
ధన్వాడ మండల కేంద్రానికి చెందిన ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ మాదారం రామ్మోహన్ గౌడ్ 13వ మహిళా ఆసియా నెట్ బాల్ పోటీలకు టెక్నికల్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. ఈరోజు నుంచి 21 వరకు బెంగళూరులోని కోరమండల్ ఇండోర్ స్టేడియంలో ఆసియా మహిళా నెట్ బాల్ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలకు ఫిజికల్ డైరెక్టర్ గా ఎంపికైన రామ్మోహన్ గౌడ్ మండలంలోని కొండాపూర్ గురుకుల పాఠశాలలో పీడిగా పనిచేస్తూ నెట్ బాల్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా గురువారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా.. గద్వాల జిల్లా అలంపూర్ లో 51.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో 33.5 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా కేంద్రంలో 21.5 మిల్లీమీటర్లు, వనపర్తి జిల్లా దగడలో 19.0 మిల్లీమీటర్లు, మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో 12.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
త్వరలోనే రానున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో తుది ఓటరు జాబితాను అధికారులు ఇప్పటికే విడుదల చేశారు. ఎన్నికల సంఘం tsec.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది.జిల్లా, మండలం, గ్రామం వివరాలు నమోదు చేయగానే మరో పేజీ కనిపిస్తుంది. వివరాలు నమోదు చేసిన తర్వాత పంచాయతీకి సంబంధించిన ఓటరు జాబితా కనిపిస్తుంది. వార్డుల వారీగా అందులో పేరు చూసుకోవచ్చు. #SHARE IT
ఉమ్మడి జిల్లాలోని బి.ఆర్ అంబేడ్కర్ కళాశాలలో డిగ్రీ, పీజీల్లో చేరడానికి చివరి తేదీని అక్టోబరు 30 వరకు పొడిగించినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. 2022-23, 2023-24 విద్యా సంవత్సరంలో డిగ్రీలో చేరిన ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు ట్యూషన్ రుసుం చెల్లించాలని, అంతకుముందు చేరిన విద్యార్థులు సైతం అక్టోబరు 30 లోపు ఆన్లైన్లో చెల్లించాలని, మిగతా వివరాల కొరకు www.braou.ac.inలో పరిశీలించాలన్నారు.
అఖిల భారత ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ ఈనెల 18,19 తేదీల్లో పీయూలో నిర్వహిస్తున్నట్లు పీడీ శ్రీనివాసులు తెలిపారు. ఈ నెల 18న పురుషుల విభాగంలో బ్యాడ్మింటన్, 19న తైక్వాండో పురుషులకు, కబడ్డీలో స్త్రీ, పురుషులకు ఎంపికలు ఉంటాయని, 17-25 ఏళ్ల వయస్సు ఉన్నవాళ్లు అర్హులని, ఎంపికైన క్రీడాకారులు తమిళనాడులోని పలు విశ్వవిద్యాలయాలలో జరిగే సౌత్ జోన్ పోటీల్లో పాల్గొంటారన్నారు. SSC మెమో, బోనఫైడ్‌తో హాజరు కావాలన్నారు.
గోవా టూర్ వెళ్లాలనుకుంటున్న వారికి దక్షిణ రైల్వే అధికారులు గుడ్ న్యూస్ తెలిపారు. సికింద్రాబాద్ నుంచి జడ్చర్ల, MBNR,GDWL మీదుగా గోవాలోని వాస్కోడిగామా మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నారు. ప్రతి బుధ, శుక్రవారాల్లో ఉ.10:05కు సికింద్రాబాద్ నుంచి గోవా వెళ్లేందుకు 17039 ట్రైన్ అందుబాటులో ఉంది. ఇందులో 21 LHB కొచేస్, ఫస్ట్ ACక్లాస్-1, AC-2,టైర్-2, స్లీపర్ క్లాస్-7, జనరల్ క్లాస్- 4 అందుబాటులో ఉన్నాయి. SHARE IT
ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తూ పరిశ్రమల స్థాపనకు వివిధ శాఖల నుంచి అనుమతులను గడువులోగా మంజూరు చేయాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పరిశ్రమలకు టీజీ. ఐ పాస్ కింద వివిధ శాఖల ద్వారా మంజూరు చేయాల్సిన అనుమతులను సమీక్షించి నిర్ణిత గడువులోగా జారీ చేయాలన్నారు.
Sorry, no posts matched your criteria.